Andhra Pradesh

News August 26, 2025

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు: పల్లా శ్రీనివాస్

image

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో జరగదని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ స్పష్టం చేశారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ప్లాంట్ నష్టాలకు కారణాలను వివరించారు. ఒక టన్ను స్టీల్ ఉత్పత్తి చేయడానికి టన్నున్నర ముడిసరుకు అవసరం అన్నారు. ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేయకపోవడమే నష్టాలకు ప్రధాన కారణం అన్నారు.

News August 26, 2025

550 అనధికార లేఅవుట్లను గుర్తించాం: ఛైర్మన్

image

VMRDA పరిధిలో తాజాగా 550 అనధికార లేఅవుట్లను గుర్తించామని ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. వీటికి ఇన్ ప్రిన్సిపల్ లేఅవుట్ పాట్రన్ (I.P.L.P) తయారు చేయాల్సి ఉందన్నారు. అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు (L.R.S) ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులతో సమావేశాలు నిర్వహించి, అనధికార లేఅవుట్ల జాబితాలు తీసుకున్నట్లు వెల్లడించారు.

News August 26, 2025

పర్యావరణాన్ని పరిరక్షిస్తూ పండగ చేసుకుందాం: కలెక్టర్

image

పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ప్రతీ ఒక్కరం వినాయక చవితి పండుగను జరుపుకుందామని కలెక్టర్ పి.రంజిత్ బాషా మంగళవారం పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. గణనాథుని కృపతో జిల్లా అభివృద్ధితో పాటు ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వినాయకుడి ఆశీస్సులతో జిల్లా ప్రజలకు మంచి జరగాలని, చేపట్టే ప్రతీ పనిలో విజయం చేకూరాలని ఆకాంక్షించారు.

News August 26, 2025

విజయనగరం పోలీసులపై యాక్షన్ షురు..!

image

విజయనగరం జిల్లా పోలీసు శాఖలో ప్రక్షాళన మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి ఆరోపణలు, ఫిర్యాదుదారుల పట్ల పోలీసుల దురుసు ప్రవర్తనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్ఐలు, ఐదుగురు కానిస్టేబుళ్లపై వేటు పడింది. విజయనగరం రూరల్ సీఐ లక్ష్మణరావు, ఎస్.కోట రూరల్ సీఐ రవికుమార్‌తో సహా పలువురిపై కేసులు నమోదు కాగా పలువురిని బదిలీలు చేశారు.

News August 26, 2025

జాతీయ మహిళా కమిషన్ మెంబర్‌కి స్వాగతం పలికిన కలెక్టర్

image

రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం విశాఖ వచ్చిన జాతీయ మహిళా కమిషన్ మెంబర్ డా.అర్చనా మజుందార్‌కి కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్‌ స్వాగతం పలికారు. అనంతరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్, సీపీ శంఖబ్రత బాగ్చి, ఇతర అధికారులతో కలిసి బాధిత మహిళల నుంచి మజుందార్ వినతులు స్వీకరిస్తున్నారు.

News August 26, 2025

విశాఖ: కట్టేసి వదిలేయడేమానా?

image

విశాఖను సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేస్తోంది. నగరంలో పలు చోట్ల స్మార్ట్ సిటీ నిధులతో ఆకర్షణీయ చిత్రాలు, బొమ్మలు తీర్చి దిద్దుతున్నారు. ఇక్కడి వరకు అధికారులు ప్రజల నుంచి మన్ననలు అందుకుంటున్నా తర్వాత వాటి అతీగతి పట్టించుకోవడంలేదని విమర్శలు మూటగట్టుకున్నారు. డెయిరీ ఫారం, ఆదర్శనగర్ కూడలిలో ఓ బొమ్మ చేయి విరిగి అధ్వానంగా ఉన్నా పట్టించుకున్న దాఖలాలులేవని మండిపడ్డుతున్నారు.

News August 26, 2025

జి.సిగడాం: కత్తిపోట్ల దాడిలో యువకుడు మృతి

image

కత్తిపోట్లకు గురైన ఓ యవకుడు చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. ఎస్సై మధుసూదనరావు తెలిపిన వివరాల మేరకు జీసిగాడం(M) గెడ్డకంచారానికి చెందిన రాజశేఖర్‌, గొబ్బూరు గ్రామస్థుడు శంకర్‌ల మధ్య ఆదివారం ఓ విషయంపై వాగ్వాదం జరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న శంకర్ క్షణికావేశంలో కత్తితో రాజశేఖర్‌పై దాడి చేశారు. క్షతగాత్రుడుని స్థానికులు రిమ్స్‌లో చేర్చగా అక్కడే చికిత్స పొందుతూ మరణించాడు. కేసు నమోదైంది.

News August 26, 2025

ప్రకాశం: ఎటు చూసినా జ్వరాలే..!

image

ప్రకాశం జిల్లాలో సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. పశ్చిమ ప్రకాశంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇతర ప్రాంతాల్లోనూ వైరల్ ఫీవర్లు ఎక్కువయ్యాయి. చాలా మంది ఒంగోలు రిమ్స్‌కు తరలి వస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించి గ్రామాల్లో శిబిరాలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.

News August 26, 2025

కడప జిల్లాలో సీఐల బదిలీ ఇలా

image

➤తిమ్మారెడ్డి: అన్నమయ్య TO ప్రొద్దుటూరు 1టౌన్
➤రామకృష్ణారెడ్డి: ప్రొద్దుటూరు 1టౌన్ TO కడప రిమ్స్
➤సీతారామిరెడ్డి: కడప రిమ్స్ TO పులివెందుల అర్బన్
➤చాంద్ బాషా: పులివెందుల TO నంద్యాల సైబర్ క్రైం
➤వంశీధర్: నంద్యాల సైబర్ TO ఖాజీపేట
➤మోహన్: ఖాజీపేట TO కడప వీఆర్
➤నాగభూషణం: సీకేదిన్నెTO ప్రొద్దుటూరు రూరల్
➤బాల మద్దిలేటి: ప్రొద్దుటూరు రూరల్ TO సీకేదిన్నె

News August 26, 2025

నెల్లూరు: టీడీపీ అధ్యక్ష పదవి ఎవరికో?

image

నెల్లూరు టీడీపీ అధ్యక్ష పదవిని ఎవరికి కట్టబెట్టుతారు, అసలు అధిష్ఠానం మనసులో ఎవరున్నారో? అని ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పదవికి రెండు సామాజిక వర్గాలు పోటీ పడుతున్నట్లు సమాచారం. పార్టీ అధిష్ఠానం అనుభవం, విధేయత తదితర అంశాలకు లోబడి చేస్తుందా లేదా అని పార్టీ నేతల్లో సందేహం నెలకొంది. టీడీపీ అధికారంలో ఉండడంతో ఈ పదవి కీలకంగా మారుతున్న నేపథ్యంలో మరికొన్ని గంటల్లో ఈ అంశానికి తెరపడనుంది.