Andhra Pradesh

News April 24, 2024

కొవ్వూరు ప్రధాన రహదారిపై ACCIDENT

image

ప.గో. జిల్లా కొవ్వూరు ప్రధాన రహదారిలోని పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మందికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు నుండి 9 మంది ప్రయాణుకులతో కొవ్వూరు వైపు వస్తున్న ఓమ్నీ వ్యాన్ పెట్రోల్ బంక్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని కొవ్వూరు ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేసి రాజమండ్రి తరలించారు.

News April 24, 2024

కొడాలి నాని అఫిడవిట్‌ వివరాలివే.!

image

గుడివాడ నియోజకవర్గం నుంచి YCP MLA అభ్యర్థిగా కొడాలి నాని సోమవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందించేశారు. అఫిడవిట్ వివరాలివే..
➤ కుటుంబ ఆస్తుల మెత్తం విలువ రూ.3,88,25,411
➤ ల్యాండ్ మెత్తం విలువ రూ.9,29,00000
➤ అప్పులు మెత్తం రూ. 4,92,00458
➤ 5కార్లు, 3లారీలు, TVS స్కూటి ఉందన్నారు.
➤ ఆయనపై 15 కేసులు ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

News April 24, 2024

వినుకొండ: టెన్త్ విద్యార్థినికి 594 మార్కులు

image

వినుకొండ పట్టణంలోని కొత్తపేట ప్రాంతానికి చెందిన పి.ఇష్రత్ ఫాతిమా పది పరీక్షలలో సత్తా చాటింది. 600 మార్కులకు గానూ 594 మార్కులు సాధించి వినుకొండ పట్టణంలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు ఆమెకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

News April 24, 2024

గుంటూరు తూర్పులో ఆరుగురు అభ్యర్థులు 11 నామినేషన్లు

image

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సోమవారం 6 అభ్యర్థులు 11 సెట్లు నామినేషన్ వేసినట్లు అధికారులు తెలిపారు. 1. షేక్ ముంతాజ్ , ఇండిపెండెంట్ 2. సయ్యద్ జావేద్, ఇండిపెండెంట్ 3. మహ్మద్ నజీర్, తెలుగుదేశం (2 సెట్లు) 4. మహ్మద్ రఫీ, ఇండిపెండెంట్ 5. షేక్ అల్తాఫ్ హుస్సేన్, ఇండియన్ లీగల్ ముస్లిం పార్టీ (4 సెట్లు). 6. షేక్ మస్తాన్ వలి, కాంగ్రెస్ (2 సెట్లు) రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరికి అందించారు.

News April 24, 2024

తిరుపతి పార్లమెంట్ పరిధిలో 46 నామినేషన్లు

image

తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలు, ఓ ఎంపీ స్థానానికి సోమవారం 46 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్లు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. తిరుపతి ఎంపీ స్థానానికి 5 మంది అభ్యర్థులు, శాసనసభ స్థానాలకు 41 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈనెల 25 వరకు నామినేషన్ సేకరణ జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

News April 24, 2024

విశాఖ: సీఎం జగన్ రేపు బస్సు యాత్ర షెడ్యూల్ ఇదే..

image

ఎండాడ బస కేంద్రం నుంచి మంగళవారం సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకొని అక్కడ సోషల్ మీడియా కార్యకర్తలతో ఆయన ముఖాముఖి సమావేశం నిర్వహిస్తారు. తర్వాత తగరపువలస మీదుగా జొన్నాడ చేరుకుంటారు. అక్కడ భోజనం విరామం తర్వాత బొడ్డువలస మీదుగా సాయంత్రం చెల్లూరు వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం చింతలవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలస చేరుకొని రాత్రి బస చేస్తారు.

News April 24, 2024

ప.గో.: 43948 పరీక్ష రాశారు.. 35556 పాస్

image

ఉమ్మడి ప.గో. జిల్లాలో మొత్తం 43,948 మంది 10వ తరగతి పరీక్షలు రాశారు. వీరిలో ఏలూరు జిల్లాలో బాలురులు 8,513, బాలికలు 10,036 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే ప.గో లో బాలురు 8,262, బాలికలు 8,745 మంది ఉత్తీర్ణత సాధించారని విద్యాశాఖ అధికారులు సోమవారం తెలిపారు.

News April 24, 2024

మాగుంట విజయ్ రెడ్డి మృతి

image

మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామ రెడ్డి, పార్వతమ్మ కుమారుడు మాగుంట విజయ్ రెడ్డి (విజయ్ బాబు) చనిపోయారు. నెల్లూరులోని అపోలోలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఆయన కుటుంబానికి పలువురు ప్రగాఢ సానుభూతి తెలిపారు. టీడీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి విజయ్ రెడ్డికి బాబాయి అవుతారు.

News April 24, 2024

శ్రీకాకుళంలో నామినేషన్ వేసింది వీరే..

image

➤ పలాస: YCP అప్పలరాజు
➤ ఇచ్ఛాపురం: స్వతంత్రంగా లక్ష్మీ
➤ టెక్కలి: TDP అచ్చెన్నాయుడు
➤ శ్రీకాకుళం: TDP శంకర్, INCP కృష్ణారావు,
➤ ఆమదాలవలస: YCP సీతారాం, INCP అన్నాజీ రావు, BSP సోమేశ్వరరావు, స్వతంత్రంగా సురేశ్
➤ పాతపట్నం: YCP రెడ్డి శాంతి, కూటమి మామిడి గోవిందరావు
➤ ఎచ్చెర్ల: PPI నీలాచలం, JBNP కొర్లయ్య, INCP మల్లేశ్వరరావు,
➤ నరసన్నపేట: YCP కృష్ణదాస్, NCP కామేశ్వరి, INCP నరసింహ మూర్తి.

News April 24, 2024

ఒంటిమిట్టలో వైభవంగా సీతారాముల కళ్యాణం

image

ఒంటిమిట్ట శ్రీకోదండ రాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా రాములోరి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా సీతారాములను పట్టు వస్త్రాలు బంగారు ఆభరణాలతో అలంకరించి రామాలయం నుంచి ఊరేగింపుగా కళ్యాణ మండపం దగ్గరకు తీసుకెళ్లారు. తెలుగుదనం ఉట్టిపడేలా సీతారాముల కళ్యాణాన్ని  అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి రావడంతో కళ్యాణ మండపం కిటకిటలాడింది.