Andhra Pradesh

News April 24, 2024

మహానంది: న్యూసెన్స్ కేసులో ముగ్గురికి జైలుశిక్ష

image

మహానంది మండలం తమ్మడపల్లె గ్రామం వద్ద ఈలలు, కేకలు వేస్తూ ప్రజా శాంతికి భంగం కలిగించిన ముగ్గురిపై ఈ నెల 17న మహానంది పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. బొల్లవరం గ్రామానికి చెందిన గుండా మధు, పలుకూరు జమాన్ మధు, తమ్మడపల్లె అశోక్ లను ముగ్గురిని కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి ఒక్కొక్కరికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు పోలీసులు తెలిపారు.

News April 24, 2024

బై‌క్‌పై నామినేషన్‌కు బయలుదేరిన ఏలూరి

image

పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నామినేషన్ కార్యక్రమంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నామినేషన్ కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ముహుర్త సమయానికి ఆలస్యమవుతుందని ఆర్వో కార్యాలయానికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బైక్‌పై బయలుదేరారు. అప్పటికీ వెళ్లడానికి సాధ్యపడక ముహూర్త సమయానికి జనసేన ఇన్‌ఛార్జ్ పెదపూడి విజయ్ కుమార్, తదితరుల చేత నామినేషన్ పత్రాలను కార్యాలయానికి పంపారు.

News April 24, 2024

వక్కలగడ్డ బాలికకు 597 మార్కులు

image

టెన్త్ ఫలితాల్లో చల్లపల్లి మండలం పాగోలులోని ఎన్టీఆర్ ట్రస్ట్ వారి ఎన్టీఆర్ హైస్కూల్ విద్యార్థిని స్టేట్ మూడవ ర్యాంక్ సాధించింది. చల్లపల్లి మండలం వక్కలగడ్డకు చెందిన కనుపర్తి భావజ్ఞ సాయి 600కు 597 మార్కులు తెచ్చుకొని స్టేట్ మూడో ర్యాంక్ సాధించింది. నల్లబోతుల దివ్యశ్రీ 583 మార్కులు, మహమ్మద్ సబిహా బేగం 582 మార్కులు సాధించారు. 

News April 24, 2024

నారాయణ అప్పులు రూ.62.43 కోట్లు

image

TDP నెల్లూరు సీటీ అభ్యర్థి నారాయణ 77 పేజీలతో ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేశారు. ఆయన స్థలాల వివరాలకే దాదాపు 50 పేజీలు ఉపయోగించారు. ఆయన దగ్గర బంగారం లేకపోయినా భార్య దగ్గర రూ.22.76 కోట్ల విలువైన 35.929 కేజీల బంగారం ఉందని ప్రకటించారు. తన అప్పులు రూ.62.43 కోట్లు, భార్య పేరిట రూ.127.16 కోట్లు ఉన్నట్లు చూపారు. తనపై CID, పేపర్ లీకేజీతో పాటు నారాయణ విద్యా సంస్థలో విద్యార్థి సూసైడ్ కేసు ఉందని పేర్కొన్నారు.

News April 24, 2024

పార్వతీపురం జిల్లా టాపర్‌గా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి

image

పార్వతీపురం మన్యం జిల్లా టాపర్‌గా పార్వతీపురం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని నిలిచింది. 591 మార్కులతో పార్వతిపురం టిఆర్ఎస్ మున్సిపల్ పాఠశాల విద్యార్థిని కేబి గౌతమి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచారు. ప్రభుత్వం విద్యాశాఖలో అమలు చేసిన విప్లవాత్మక మార్పులు కారణంగా కార్పొరేట్ పాఠశాలలకు గట్టి పోటీని ఇస్తున్నట్లు ఆమె తెలిపారు.

News April 24, 2024

ప్రకాశం: ఆటో బోల్తా.. పలువురికి గాయాలు

image

జిల్లాలోని పీసీపల్లి మండలం ఇర్లపాడులో మిరపకాయలు కోసేందుకు కూలీలతో వెళ్తున్న ఆటో వెంగళాయపల్లిలోకి వచ్చేసరికి హఠాత్తుగా కుక్క రోడ్డుపైకి అడ్డంగా రావడంతో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న సుబ్బరత్తమ్మ, గోవిందమ్మ, ఐ.జయమ్మ, సంపూర్ణ తదితరులకు గాయాలయ్యాయి. బాధితులను పీసీపల్లి వైద్యశాలకు తరలించి ప్రథమచికిత్స చేశారు. ఆనంతరం మెరుగైన చికిత్స కోసం 108లో కనిగిరి వైద్యశాలకు తరలించారు.

News April 24, 2024

కోటబొమ్మాళి: పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

image

పదో తరగతిలో ఒక సబ్జెక్టు ఫెయిల్ కావడంతో మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వివరాలోకి వెళ్తే.. కోటబొమ్మాళి మండలం విశ్వనాథపురం పంచాయతీ సీతారాంపురానికి చెందిన వజ్రగడ్డి జానకి(16) పదిలో బక  సబ్జెక్టు ఫెయిల్ కావడంతో  ఫ్యాన్‌కు ఉరేసుకుంది. తల్లి సరోజనమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు స్థానిక ఏస్‌ఐ షేక్‌మహ్మద్‌ ఆలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 24, 2024

కూటమికి ప్రజలు మద్దతు తెలపాలి: పురంధీశ్వరి

image

కూటమికి ప్రజలు మద్దతు తెలపాలని రాజమండ్రి లోక్‌సభ కూటమి ఎంపీ అభ్యర్థిని దగ్గుబాటి పురంధీశ్వరి అన్నారు. సోమవారం నిడదవోలులో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గ MLAగా కూటమి అభ్యర్థి కందుల దుర్గేశ్‌ను, ఎంపీగా తనను గెలిపించాలని అభ్యర్థించారు.

News April 24, 2024

కర్నూలు: 594 మార్కులు సాధించిన రైతు బిడ్డ

image

రుద్రవరం మండలం బీరవోలుకు చెందిన రైతు పుల్లారెడ్డి, శిరీష దంపతుల కుమార్తె ఎం హర్షిత 594 మార్కులు సాధించి మండలంలో అత్యధిక మార్కులు సాధించిన బాలికగా నిలిచింది. అలాగే తాను చదివిన నంద్యాలలోని గురురాజ పాఠశాలలో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. తమ కూతురు పదో తరగతి పరీక్షల్లో ఇలా మొదటి ర్యాంకు సాధించినందుకు తమకెంతో ఆనందంగా ఉందని విద్యార్థిని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

News April 24, 2024

గుంటూరులో మత్తు పదార్థాలు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

image

గుంటూరులో మత్తు పదార్థాలు విక్రయిస్తున్న యువకుడిని సోమవారం లాలాపేట పోలీసులు అరెస్ట్ చేశారు. CI దేవ ప్రభాకర్ తెలిపిన వివరాల మేరకు.. ఏటుకూరు రోడ్డులో మత్తు పదార్థాలు అమ్ముతున్నారన్న సమాచారంతో ఎస్ఐ అమర్నాథ్ తనిఖీలు నిర్వహించారు. రాజస్థాన్‌కి చెందిన మహేందర్ సింగ్ తన స్నేహితుల ద్వారా మత్తు పదార్థాలు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నారు. 11 గ్రాముల మత్తు పదార్థాలు సీజ్ చేశారు.