Andhra Pradesh

News April 24, 2024

గుంటూరు: 29 నుంచి రాయగడ ఎక్స్ ప్రెస్ రద్దు

image

ఇంజినీరింగ్ పనుల కారణంగా ఈనెల 29వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు గుంటూరు- రాయగడ మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ (17243) రైలు రద్దు చేసినట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. అదే విధంగా రాయగడ నుంచి గుంటూరు వచ్చే (17244) ఈనెల 30వ తేదీ నుంచి మే 27వ తేదీ వరకు నిలిపివేసినట్లు తెలిపారు. ఈ మేరకు రైల్వే ప్రయాణికులు గమనించాలని తెలిపారు.

News April 24, 2024

పెదపారుపూడి: చెరువులో పడవ బోల్తా పడి.. యువకుడి మృతి

image

మండలంలోని తంబలంపాడు గ్రామంలో నరసింహారావు పొలంలో చేపల చెరువు మేత వేయడానికి వెళ్లిన వల్లూరి విజయబాబు ప్రమాదవశాత్తు మృతిచెందినట్లు ఎస్సై చంటిబాబు తెలిపారు. బాపులపాడు మండలానికి చెందిన విజయ్ కుమార్ చేపల చెరువు వద్ద కాపలా ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం మేత వేసేందుకు పడవలో వెళ్లగా, పడవ బోల్తా పడి యువకుడు మృతి చెందినట్లు ఎస్సై వెల్లడించారు. 

News April 24, 2024

కురుపాం: స్వతంత్ర అభ్యర్థిగా ట్రాన్స్‌జెండర్ నామినేషన్

image

కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి ట్రాన్స్ జెండర్ అడ్డాకుల గీతా రాణి సమర్పించారు. సోమవారం కురుపాం తాహశీల్దార్ కార్యాలయంలో ట్రాన్స్‌జెండర్ గీతా రాణి మూడు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. పాలకుల నిర్లక్ష్యానికి గురవుతున్న తాము ఎన్నికలలో పోటీ చేసి తమ బలాన్ని నిరూపించుకోవాలన్నదే లక్ష్యం అన్నారు.

News April 24, 2024

సజ్జల రామకృష్ణా రెడ్డిని కలిసిన జాన్ వెస్లీ 

image

తాడేపల్లిగూడెంలోని వైసీపీ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డిని ఉభయగోదావరి జిల్లాల క్రిస్టియన్ మైనార్టీ సెల్ జోనల్ ఇన్‌ఛార్జి, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ జాన్ వెస్లీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాలో రేపు ఎన్నికల్లో వైసీపీ జెండా మరోసారి ఎగిరేందుకు, సీఎం జగన్‌ను రెండోసారి గెలిపించేందుకు కృషి చేయాలన్నారు.

News April 24, 2024

రేపు సత్యకుమార్ నామినేషన్‌కు కేంద్ర మంత్రి రాక

image

ధర్మవరం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ మంగళవారం నామినేషన్ వేస్తున్న సందర్భంగా కేంద్ర మంత్రి విజయ్ కుమార్ సింగ్ ధర్మవరానికి రానున్నారని ఆయన కార్యాలయం వెల్లడించింది. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి రావాలని వారు వెల్లడించారు.

News April 24, 2024

హిరమండలం:అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

image

హిరమండలం రెల్లివీధికి చెందిన కళింగపట్నం ధనుంజయ(26) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. ధనుంజయకు రూ.5000 అప్పుగా ఇచ్చిన పందిరి రాజా అనే వ్యక్తి, అతని అనుచరులు అప్పు తీర్చమని ఇటీవల దారుణంగా కొట్టి, ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. వేధింపులకు భయపడి తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడు తండ్రి భూలోకం ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News April 24, 2024

మైదుకూరు: RTC బస్సు ఢీ కొట్టడంతో విలేకరి మృతి

image

మైదుకూరు మండలం మిట్టమానుపల్లె సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బ్రహ్మంగారిమఠం మండలం గోడ్లవీడుకు చెందిన ఉప్పలూరు గురవయ్య ఓ న్యూస్ ఛానల్‌లో విలేకరిగా పనిచేస్తున్నాడు. సోమవారం ఆయన బ్రహ్మంగారిమఠం నుంచి మైదుకూరు వెళుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News April 24, 2024

తెనాలి: టెన్త్ విద్యార్థికి 596 మార్కులు

image

తెనాలి పట్టణంలోని ఐతానగర్ ప్రాంతానికి చెందిన పాటిబండ్ల ప్రభాకర్ పదవ తరగతి పరీక్షలలో సత్తా చాటాడు. 600 మార్కులకు గానూ 596 మార్కులు సాధించి తెనాలిలో మొదటి స్థానంలో నిలిచాడు. పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాటిబండ్ల రామకృష్ణ, లక్ష్మీ తులసి, తోటి విద్యార్థులు ప్రభాకర్‌‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

News April 24, 2024

ధర్మవరం: రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

ధర్మవరం పట్టణం కేతిరెడ్డి కాలనీ వద్ద రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగినట్లు తెలిపారు. మృతుడికి సుమారు 30 లేదా 35 సంవత్సరాలు ఉండచ్చని, నలుపు రంగు టీ షర్టు, ఆరెంజ్ కలర్ డ్రాయర్ ధరించి ఉన్నాడని హిందూపురం రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి బంధువులు ధర్మవరం రైల్వే పోలీస్ స్టేషన్‌కు వచ్చి కలవాలని వారు తెలిపారు.

News April 24, 2024

ఓటు హ‌క్కు వినియోగం ప్ర‌తి ఒక్క‌రి క‌ర్త‌వ్యం: ఢిల్లీరావు

image

ఓటు హ‌క్కు వినియోగం.. ప్ర‌తి ఒక్క‌రి క‌ర్త‌వ్య‌మ‌ని క‌లెక్ట‌ర్ ఢిల్లీరావు అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందీరా గాంధీ స్టేడియంలో సిస్ట‌మాటిక్ ఓట‌ర్స్ ఎడ్యుకేష‌న్ అండ్ ఎల‌క్టోర‌ల్ పార్టిసిపేష‌న్లో భాగంగా ఓట‌ర్ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించినట్లు తెలిపారు. ఓటు హ‌క్కు ఉన్న ప్ర‌తిఒక్క‌రు త‌ప్ప‌నిస‌రిగా నైతిక బాధ్య‌త‌గా మే 13న ఓటు హ‌క్కును స‌ద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.