Andhra Pradesh

News April 24, 2024

పెద్దకడబూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

పెద్దకడబూరు మండలంలోని హనుమాపురం గ్రామ శివారులోని ఎల్లెల్సి సమీపంలో జాతీయ రహదారిలో సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందారు. గుడేకల్ గ్రామానికి చెందిన వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 24, 2024

ఏలూరు: వ్యక్తి దారుణ హత్య

image

ఏలూరు జిల్లా పెదవేగి మండలం భోగాపురం గ్రామంలో సోమవారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు గ్రామానికి చెందిన పామర్తి రంగారావుగా (45) గుర్తించారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పెదవేగి పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 24, 2024

నెల్లూరు: నలుగురు అభ్యర్థుల మార్పు

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొత్తగా ఇద్దరు అభ్యర్థుల పేర్లతో పాటు నలుగురు అభ్యర్థులను మారుస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం ఉత్తర్వులు ఇచ్చింది.
☞ కావలి: పొదలకూరి కల్యాణ్
☞ వెంకటగిరి: శ్రీనివాసులు
☞ కోవూరు: కిరణ్ కుమార్ రెడ్డి(మోహన్)
☞ సర్వేపల్లి: PV శ్రీకాంత్ రెడ్డి(పూల చంద్రశేఖర్)
☞ గూడూరు: డాక్టర్ రామకృష్ణారావు(వేమయ్య)
☞ సూళ్లూరుపేట: చందనమూడి శివ(తిలక్ బాబు)
NOTE: బ్రాకెట్‌లో ఉన్న పేర్లు పాత అభ్యర్థులవి.

News April 24, 2024

మారిన హిందూపురం కాంగ్రెస్ అభ్యర్థి

image

హిందూపురం కాంగ్రెస్ అభ్యర్థిగా వి నాగరాజు స్థానంలో మహ్మద్ హుస్సేన్ ఇనయతుల్లాను ఆ పార్టీ ప్రకటించింది. అటు ధర్మవరం- అశ్వర్ధ నారాయణ, కళ్యాణదుర్గం-రాం భూపాల్ రెడ్డిని తాజాగా ఖరారుచేసింది. కాగా హిందుపురం కూటమి అభ్యర్థిగా బాలకృష్ణ, వైసీపీ-దీపిక బరిలో ఉన్నారు. ధర్మవరంలో కూటమి-సత్యకుమార్ యాదవ్, వైసీపీ-కేతిరెడ్డి పోటీ చేస్తుండగా.. కళ్యాణదుర్గంలో కూటమి-సురేంద్రబాబు, వైసీపీ- రంగయ్య పోటీలో ఉన్నారు.

News April 24, 2024

పెమ్మసాని చంద్రశేఖర్ అఫిడవిట్‌లోని ఆస్తుల వివరాలు..

image

➤ పార్లమెంట్: గుంటూరు
➤ అభ్యర్థి: పెమ్మసాని చంద్రశేఖర్(TDP)
➤ విద్యార్హతలు: M.D, M.B.B.S
➤ భార్య: శ్రీరత్న కోనేరు
➤ చరాస్తి విలువ: రూ.2,316కోట్లు
➤ భార్య చరాస్తి విలువ: రూ.2,289కోట్లు
➤ కేసులు: 1
➤ అప్పులు: రూ.519కోట్లు
➤ చేతిలో ఉన్న డబ్బులు: రూ.2.06,400
➤ బంగారం: 181 గ్రాములు, భార్యకు 2,567.135 గ్రాములు బంగారం

News April 24, 2024

మంగళగిరిలో యాచకుని మృతి

image

మంగళగిరిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన లక్ష్మీ నారసింహుని ఆలయం ఎదుట ఉన్న కళ్యాణ గ్రౌండ్‌లో సోమవారం తెల్లవారుజామున, గుర్తు తెలియని యాచకుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న మంగళగిరి పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుని వయస్సు సుమారు 35 సంవత్సరాలు ఉంటుందని ఇతర ప్రాంతం నుంచి వచ్చి రాత్రి సమయాల్లో ఇక్కడ నిద్రిస్తుంటాడని పోలీసులు తెలిపారు.

News April 24, 2024

గజపతినగరం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మార్పు

image

గజపతినగరం అభ్యర్థిగా కురిమి నాయుడు స్థానంలో దోలా శ్రీనివాస్‌ను కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించింది. అటు బొబ్బిలి అభ్యర్థిగా మరిపి విద్యాసాగర్, నెల్లిమర్ల నుంచి ఎస్.రమేశ్ కుమార్ బరిలో ఉంటారని కాంగ్రెస్ తెలిపింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.

News April 24, 2024

శ్రీకాకుళం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీనివాసరావు

image

శ్రీకాకుళం కాంగ్రెస్ అభ్యర్థిగా పైడి నాగభూషణ్ స్థానంలో అంబటి కృష్ణారావును ఆ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ గతంలో 114 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా తాజాగా 38 నియోజకవర్గాలకు ఖరారు చేసింది. ఇందులో శ్రీకాకుళం కాంగ్రెస్ అభ్యర్థిని తాజాగా మార్చింది. అటు వైసీపీ అభ్యర్థిగా ధర్మాన ప్రసాద్ రావు, కూటమి నుంచి గొండు శంకర్ బరిలో ఉన్నారు.

News April 24, 2024

ప.గో.: సిట్టింగ్ MLAలను పక్కన పెట్టారు.. గెలుపు సులువేనా..?

image

ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప.గో. జిల్లాలో YCP, TDPలు చెరోస్థానంలో సిట్టింగ్ MLAలను కాదని ఇతరులకు కేటాయించాయి. 2019లో చింతలపూడి వైసీపీ MLAగా నియోజకవర్గ చరిత్రలో అధిక మెజారిటీ సాధించి గెలిచిన ఎలీజాను ఆ పార్టీ ఈ సారి పక్కనపెట్టి విజయరాజుకు అవకాశం ఇచ్చింది. ఉండిలో టీడీపీ MLA రామరాజును కాదని కూటమి అభ్యర్థిగా ఆ పార్టీ RRRకు అవకాశమిచ్చింది. మరి ఈ 2చోట్ల ఆయా పార్టీల గెలుపు సులువయ్యేనా..?
– మీ కామెంట్..?

News April 24, 2024

ప్రకాశం జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించిన కనిగిరి విద్యార్థిని

image

10వ తరగతి పరీక్ష ఫలితాలలో కనిగిరి పట్టణానికి చెందిన నాదెళ్ల సాయి దీక్షిత 595 మార్కులతో జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు సాయి దీక్షితను అభినందించారు. జిల్లా స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించినందుకు పట్టణ ప్రముఖులు, ఆర్యవైశ్య సంఘాలు విద్యార్థిని అభినందించారు.