Andhra Pradesh

News April 24, 2024

చినకాకానిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

మంగళగిరి మండల పరిధిలోని చినకాకాని మురగన్ హోటల్ సమీపంలో సైడ్ కాలువలో గుర్తుతెలియని మృతదేహం సోమవారం లభ్యమైంది. మృతదేహం కుళ్ళిపోయి గుర్తు పట్టలేని స్థితిలో ఉంది. సదరు వ్యక్తి మృతి చెంది ఐదు రోజులపైనే అయి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 24, 2024

గజపతినగరంలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. లారీ పక్క నుంచి స్కూటీపై వెళ్తూ అదుపు తప్పడంతో లారీ వెనుక చక్రం కింద పడి ఘటనా స్థలంలోనే మరణించాడు. గజపతినగరం ఎస్సై యు.మహేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 24, 2024

‘కృష్ణా’లో మెరుగుపడని స్థానం.. పెరిగిన ఉత్తీర్ణతా శాతం

image

పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో కృష్ణా జిల్లా స్థానం మెరుగు పడలేదు. గత సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా 11వ స్థానానికే పరిమితమైంది. ఈ సంవత్సరం ఉత్తీర్ణతా శాతం పెరిగింది. గత సంవత్సరం 19,670 మంది విద్యార్థులకు 14,688 మంది ఉత్తీర్ణులవ్వగా ఉత్తీర్ణతా శాతం (74.67%) ఉత్తీర్ణులయ్యారు. ఈ సంవత్సరం 21,112 మంది విద్యార్థులకు 19,011 మంది (90.03%) పాస్ అయ్యారు. గత సంవత్సరం కంటే 16.26% ఉత్తీర్ణత పెరిగింది.

News April 24, 2024

ఉమ్మడి ప.గో జిల్లాలో 10Th ఉత్తీర్ణత శాతం ఇలా..

image

10వ తరగతి ఫలితాల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గతేడాదితో పోల్చితే ఈసారి ఉత్తీర్ణత శాతం మెరుగుపడింది.
➤ పశ్చిమ గోదావరి జిల్లాలో గతేడాది 65.93 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ఈ ఏడాది 81.82 శాతంతో రాష్ట్రంలో 23వ స్థానంలో నిలిచింది.
➤ ఏలూరు జిల్లా విద్యార్థులు గతేడాది 64.35 శాతం మంది ఉత్తీర్ణులు కాగా.. ఈ ఏడాది 80.08% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 25వ స్థానంలో నిలిచింది.

News April 24, 2024

ఒంగోలు: ATM దొంగతనం చేసిన మహేశ్ ఆత్మహత్య

image

ఒంగోలులోని కర్నూలు రోడ్డులో ATM క్యాష్ నింపే వాహనంలో 64 లక్షల దొంగతనం కేసులో ముద్దాయి మహేశ్ బాబు మనస్థాపంతో ఉరివేసుకొని సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. సంతనూతలపాడు మండలం కామేపల్లివారిపాలెంకు చెందిన మహేశ్ ఇటీవలే బెయిల్‌పై బయటికి వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని మృతి చెందాడు. దొంగతనం తన మేనేజర్ అయిన పెద్ద కొండారెడ్డి ప్రోద్బలంతో మాత్రమే చేశానని సూసైడ్ లేఖలో మహేశ్ పేర్కొన్నారు.

News April 24, 2024

వైసీపీ MLA అభ్యర్థిగా బుగ్గన నామినేషన్

image

డోన్ నియోజకవర్గ వైసీపీ MLA అభ్యర్థిగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. బుగ్గన వెంట నంద్యాల పార్లమెంట్ వైసీపీ MP అభ్యర్థి పోచా బ్రహ్మానంద రెడ్డి ఉన్నారు. వరుసగా మూడోవ సారి డోన్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

News April 24, 2024

10Th రిజల్ట్స్.. ఉమ్మడి తూ.గో.లో ఉత్తీర్ణత శాతమిలా

image

10వ తరగతి ఫలితాల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గతేడాదితో పోల్చితే ఈసారి ఉత్తీర్ణత శాతం మెరుగుపడింది.
➠ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2023లో 73.48% పాస్ కాగా.. 2024లో ఏకంగా 91.88శాతానికి ఎగబాకింది.
➠ కాకినాడ జిల్లాలో గతేడాది 68.02% మంది ఉత్తీర్ణులు కాగా.. ఈ ఏడాది 83.09% మంది పాసయ్యారు.
➠ తూ.గో జిల్లాలో గతేడాది 70.32% ఉత్తీర్ణత నమోదు కాగా.. ఈసారి 82.03శాతానికి చేరింది.

News April 24, 2024

10th RESULTS: ఉమ్మడి విశాఖలో అమ్మాయిలదే పైచేయి

image

➤ విశాఖలో 14,932 మంది బాలురుకు 90.07%తో 13,449 మంది పాసయ్యారు. 13,362 మంది బాలికలకు 92.35%తో 12,345 మంది ఉత్తీర్ణత సాధించారు.
➤ అనకాపల్లిలో 10,820 మంది బాలురుకు 86.73%తో 9,384 మంది పాసయ్యారు. 10,349 మంది బాలికలకు 91.45%తో 9,464 మంది ఉత్తీర్ణత సాధించారు.
➤ అల్లూరిలో 4,958 మంది బాలురుకు 88.77%తో 4,401 మంది పాసయ్యారు. 5,865 మంది బాలికలకు 92.79%తో 5,442మంది ఉత్తీర్ణత సాధించారు.

News April 24, 2024

ఉమ్మడి విజయనగరం జిల్లాలలో బాలికలదే పైచేయి

image

➤ పార్వతీపురం మన్యం జిల్లాలో 5,099 మంది బాలురు పరీక్ష రాయగా.. 95.33శాతంతో 4,861 మంది పాసయ్యారు. 5,344 మంది బాలికలు పరీక్ష రాయగా 97.36శాతంతో 5,203 మంది ఉత్తీర్ణత సాధించారు.
➤ విజయనగరం జిల్లాలో 11,868 మంది బాలురు పరీక్ష రాయగా.. 89.91శాతంతో 11,081 మంది పాసయ్యారు. 11,822 మంది బాలికలు పరీక్ష రాయగా 93.73శాతంతో 11,081 మంది ఉత్తీర్ణత సాధించారు.

News April 24, 2024

10th ఫలితాల్లో సత్తాచాటిన ప్రకాశం జిల్లా

image

టెన్త్ ఫలితాల్లో ప్రకాశం జిల్లా 91.21% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 7 స్థానంలో నిలిచింది. 29,195 మందికి గానూ 26,630 మంది పాసయ్యారు. 14,511 మంది బాలికలకు 13,422 మంది, బాలురు 14,684 మందికి 13,208 మంది పాసయ్యారు. బాలులతో పోలీస్తే బాలికలు ఈసారి సత్తా చాటారు. కాగా 2023లో 73.74% ఉత్తీర్ణత సాధించారు. అటు బాపట్ల జిల్లాలో 16,718 మందికి గానూ 14,743 మంది పాసయ్యారు. 88.19శాతం ఉత్తీర్ణతతో 14వ స్థానంలో నిలిచింది.