Andhra Pradesh

News April 24, 2024

పదో తరగతి ఫలితాల్లో నెల్లూరు జిల్లాకు 15వ స్థానం

image

పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో నెల్లూరు జిల్లా 88.17% ఉత్తీర్ణతతో 15 స్థానంలో నిలిచింది. 27,788 మంది పరీక్షలు రాయగా 24500 మంది పాస్ అయ్యారు. 13926 మంది బాలురు పరీక్షలు రాయగా 12003 మంది పాస్ అయ్యారు. 13862 మంది
బాలికలు పరీక్ష రాయగా 12497 మంది పాస్ అయ్యారు. అటు తిరుపతి జిల్లాలో 26625 మందికి 24151 మంది పాస్ అయ్యారు.

News April 24, 2024

టెన్త్ ఫలితాలలో శ్రీకాకుళం జిల్లాకు రెండో స్థానం

image

ఏపీలో విడుదలైన టెన్త్ ఫలితాలలో శ్రీకాకుళం జిల్లా 93.35 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. బాలురు 14,712 మంది పరీక్షలు రాయగా 13,489 మంది పాసయ్యారు. బాలికలు 14,033 మంది పరీక్షలు రాయగా 13,344 మంది పాసయ్యారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 28,745 మంది పరీక్షలు రాయగా 26,833 మంది పాసయ్యారు. వీరిలో బాలురు 91.69 శాతం, బాలికలు 95.09 %మంది ఉత్తీర్ణులయ్యారు.

News April 24, 2024

పదో తరగతి ఫలితాల్లో పార్వతీపురం మన్యం ఫస్ట్

image

➤ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా వరుసగా రెండోసారి ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తం 10,443 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 96.37%తో 10,064 మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాది 87.47 శాతం మంది పాస్ అయ్యారు.
➤ విజయనగరం జిల్లాలో మొత్తం 23,690 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 91.82 శాతంతో 21,752 మంది ఉత్తీర్ణతతో రాష్ట్రంలో ఐదో స్థానంలో నిలిచింది. గతేడాది 76.66% మంది పాసయ్యారు.

News April 24, 2024

పదోతరగతి ఫలితాల్లో వైఎస్సార్ జిల్లా సత్తా

image

10th ఫలితాల్లో కడప జిల్లా 92.10% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 3 స్థానంలో నిలిచింది. 27,729 మందికి 25,538 పాసయ్యారు. 13,515 మంది బాలికలకు 12,609 పాసయ్యారు. బాలురు 14,214 మందికి గానూ 12,929 పాసయ్యారు. బాలికలు ఈసారి సత్తా చాటారు. కాగా 2023లో 79.43% ఉత్తీర్ణత సాధించగా, ఈసారి 92.10% సాధించారు. అటు అన్నమయ్య జిల్లా 86.67 ఉత్తీర్ణత శాతంతో 17వ స్థానంలో నిలిచింది. జిల్లాలో 22,240 మందికి గానూ 19,276 పాసయ్యారు.

News April 22, 2024

కడప జిల్లాను భయపెడుతున్న ఉష్ణోగ్రతలు

image

జిల్లాలో వారం రోజుల నుంచి రాత్రి, పగలు ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. దీంతో జనాలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. రాత్రిళ్లు ఇళ్లలో సరైన నిద్రలేక జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు కూడా క్రమేపీ పెరుగుతున్నాయి. ఉ.9 గంటల నుంచి సూర్యుడు సుర్రుమంటున్నాడు. పగలంతా ఎండతాకిడితో అల్లాడిన జనం రాత్రి పూటైనా కాసింత ప్రశాంతంగా నిద్రపోదామంటే కూడా కుదరని పరిస్థితి నెలకొందని అంటున్నారు.

News April 22, 2024

ప్రకాశం: 30,928 మంది విద్యార్థుల ఉత్కంఠ

image

జిల్లాలో ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు 170 కేంద్రాల్లో 30,928 మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్చి 30న పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ముగియగా, ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీ వరకు జవాబు పత్రాల మూల్యాంకనం చేశారు. మూల్యంకనం ముగిసిన 14 రోజులకే ఫలితాలు ప్రకటించడం ప్రభుత్వ పరీక్షల బోర్డు చరిత్రలో ఒక రికార్డు అని డీఈవో సుభద్ర తెలిపారు. మరికొద్ది సేపట్లో ఫలితాలు రానుండటంతో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది.

News April 22, 2024

విశాఖ: టీడీపీలో టికెట్లు మార్పు.. వారి నిర్ణయంపై ఉత్కంఠ..!

image

మాడుగుల, పాడేరు అభ్యర్థులను మార్చిన TDP.. వారికి B-ఫామ్‌లు సైతం ఇచ్చేసింది. మాడుగులలో పైలా ప్రసాద్‌‌కు బదులు బండారుకి, పాడేరులో రమేశ్ నాయుడును తప్పించి గిడ్డి ఈశ్వరికి టికెట్లు కేటాయించింది. కొత్త అభ్యర్థులు ఈరోజు నామినేషన్ వెయ్యనున్నారు. అయితే ఇప్పటికే ప్రసాద్, రమేశ్ నామినేషన్లు వేశారు. పాడేరులో రెబల్ అభ్యర్థిగా రమేశ్ నాయుడు పోటీలో ఉంటారని వార్తలు వస్తుండగా.. పైలా నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

News April 22, 2024

నెల్లూరు: వైసీపీ రాష్ట్ర మహిళా సెక్రటరీగా నిడిగుంట అరుణ

image

వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం కమిటీ సెక్రటరీలుగా కోవూరు మండలం పడుగుపాడుకు చెందిన నిడిగుంట అరుణ, వెంకటాచలం హిమ బిందును నియమించారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో అరుణ రాష్ట్ర దిశా ఫౌండేషన్ ఛైర్మన్‌గా వ్యవహరించారు.

News April 22, 2024

పల్నాడు: ఆరుబయట నిద్రిస్తున్న మహిళ దారుణ హత్య

image

ఆరుబయట నిద్రిస్తున్న మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన రెంటచింతల మండల పరిధిలోని తుమృకోటలో, సోమవారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన కుంకలకుంట భారతి గ్రామంలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు ఆదివారం గ్రామానికి వచ్చారు. రాత్రి ఆరు బయట పడుకోగా తెల్లవారేసరికి హత్యకు గురైందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News April 22, 2024

పుంగనూరు: వైసీపీలోకి మాజీ ఎంపీ కుటుంబ సభ్యులు?

image

మాజీ ఎంపీ రామకృష్ణారెడ్డి కుమారుడు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీనాథ్ రెడ్డి దంపతులతో మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి మదనపల్లెలో భేటీ అయ్యారు. వారిని వైసీపీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా శ్రీనాథ్ రెడ్డి భార్య అనీష రెడ్డి పోటీ చేసి ఓటమి చెందారు.