Andhra Pradesh

News April 22, 2024

తూ.గో: నేడు నామినేషన్లు వేసేది వీరే

image

☞ రాజమండ్రి ఎంపీ అభ్యర్థులు రుద్రరాజు(కాంగ్రెస్), గూడూరి శ్రీనివాస్ (YCP)
☞ వేగుళ్ల జోగేశ్వరరావు (మండపేట-TDP)
☞ విశ్వరూప్ (అమలాపురం-YCP)
☞ సూర్యారావు (రాజోలు-YCP)
☞ చిర్ల జగ్గిరెడ్డి (కొత్తపేట-YCP)
☞ ద్వారంపూడి (కాకినాడ సిటీ- YCP)
☞ ధనలక్ష్మి (రంపచోడవరం- YCP)
☞ చినరాజప్ప (పెద్దాపురం- TDP)
☞ విప్పర్తి వేణుగోపాలరావు (పి.గన్నవరం-YCP)
☞ కన్నబాబు (కాకినాడ రూరల్-YCP)
☞ వంగా గీత (పిఠాపురం-YCP)

News April 22, 2024

శ్రీకాకుళం: నేడు నామినేషన్లు వేసేది వీరే..!

image

శ్రీకాకుళం జిల్లాలో నేడు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పలాస నుంచి మంత్రి సీదిరి అప్పలరాజు, పాతపట్నం నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెడ్డిశాంతితో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలిలో నామినేషన్ చేయనున్నారు. వీరితో పాటు తమ్మినేని సీతారాం ఆమదాలవలసలో నామినేషన్ వేయనున్నారు.

News April 22, 2024

అనిల్ కుమార్ యాదవ్ ఆస్తుల వివరాలు

image

➤ పార్లమెంట్: నరసరావుపేట
➤ అభ్యర్థి: పాలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ (YCP)
➤ భార్య: జాగృతి
➤ విద్యార్హతలు: B.D.S
➤ చరాస్తి విలువ: రూ.2.43 కోట్లు
➤ భార్య చరాస్తి విలువ: రూ.2.10కోట్లు
➤ కేసులు: 1
➤ అప్పులు: రూ.1.59కోట్లు
➤ చేతిలో ఉన్న డబ్బులు: రూ.2 లక్షలు
➤ బంగారం: 12 గ్రాములు, డైమండ్ రింగ్ భార్యకు 900 గ్రాములు
NOTE: ఎన్నికల అఫిడవిట్‌లో అభ్యర్థి పేర్కొన్న వివరాలు ఇవి.

News April 22, 2024

కృష్ణా జిల్లాలో నేడు నామినేషన్లు వేసేది వీరే

image

కృష్ణా జిల్లాలో నేడు వైసీపీ, టీడీపీ బలపరిచిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. వీరిలో మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి వైసీపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ రావు నేటి ఉదయం కలెక్టరేట్‌లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. అదే విధంగా పెడన నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణ ప్రసాద్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.

News April 22, 2024

నెల్లూరు: నేడు జిల్లా అంతా నామినేషన్ల కోలాహలం

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం నామినేషన్ల సందడి కొనసాగనుంది. శుభ ముహూర్తం ఉండటంతో నెల్లూరులో నారాయణ, ఆత్మకూరులో ఆనం రామనారాయణ రెడ్డి, సర్వేపల్లిలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, గూడూరులో పాశం సునీల్ కుమార్, ఉదయగిరిలో కాకర్ల సురేశ్‌తో పాటు పలువురు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలో పోలీసు అధికారులు బందోబస్తు విషయంలో అప్రమత్తమయ్యారు.

News April 22, 2024

పగో: నేడే ఫలితాలు.. ఉత్కంఠతో 27,426 మంది

image

ప.గో జిల్లాలో 27,426 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరుకాగా.. వారందరూ ఫలితాల కోసం ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 14,624 మంది బాలురు, 12,802 మంది బాలికలు కలిపి మొత్తం 27,426 మంది విద్యార్థులు 127 కేంద్రాల్లో మార్చి 18 నుంచి 30 వరకు పరీక్షలు రాశారు. గతేడాది జిల్లాలో 65.93 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈ ఏడాది 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా యంత్రాంగం కసరత్తు చేసిందని అధికారులు తెలిపారు.

News April 22, 2024

నేడు ఒంటిమిట్టకు ప్రత్యేక బస్సులు

image

నేడు ఒంటిమిట్ట రాములోరి కల్యాణోత్సవం సందర్భంగా రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు, కొరత లేకుండా 100 ప్రత్యేక బస్సులను పలు ముఖ్యప్రాంతాల నుంచి రూట్ల వారీగా కేటాయించామని ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి గోపాల్‌ రెడ్డి తెలిపారు. కడప డిపో నుంచి 35 బస్సులు, పులివెందుల 10, బద్వేలు 20, జమ్మలమడుగు 10, మైదుకూరు 5, ప్రొద్దుటూరు 20 బస్సులు నడుపుతున్నామన్నారు. ఇక రాజంపేట 30, రాయచోటి 10 ఏర్పాటు చేశారు.

News April 22, 2024

NTR జిల్లాలో నేడు నామినేషన్లు వేసేది వీరే

image

ఎన్టీఆర్ జిల్లాలో నేడు బీజేపీ, జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. వీరిలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ రావు, మైలవరం నియోజకవర్గం నుంచి వసంత వెంకట కృష్ణ ప్రసాద్, నందిగామ నియోజకవర్గం నుంచి తంగిరాల సౌమ్య, తిరువూరు నియోజకవర్గం నుంచి కొలకపూడి శ్రీనివాసరావు నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు.

News April 22, 2024

చిత్తూరు: మండుతున్న ఎండలు

image

చిత్తూరు జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిండ్రలో 42.6, పులిచెర్లలో 42.4 పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే తవణంపల్లె 41.7, గుడుపల్లె 41.7, పెద్దపంజాణి 41.5, శ్రీరంగరాజపురం 41.4, గుడిపాల 41.2, పుంగనూరు 41.2, సదుం, బంగారుపాలెంలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. రాత్రి వేళల్లోనూ 33 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదు అవుతోంది.

News April 22, 2024

మదనపల్లె: పెద్దిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు

image

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందీశ్వరిని చిన్నపాటి రాక్షసి అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ ఎత్తివేస్తామని మాట్లాడారని ఆరోపించారు. అలాగే రాజంపేట ఎన్డీఏ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి వలన రాష్ట్రం రెండుగా విడిపోయిందని, సీఎంగా చేసిన కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయిందని అన్నారు.