India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ నెల 28 నుంచి డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ మొదలవుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2,600 మంది అభ్యర్థుల కౌన్సిలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. ఈ కార్యక్రమం కోసం మూడు ప్రాంతాలలో 54 బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.
ఆచంటలోని పెనుమంచిలి, భీమలాపురం, కోడేరు, కొడమంచిలి, వల్లూరు, పెదమల్లం ప్రాంతాల్లో వేకువ జాము నుంచి చిరుజల్లులతో కూడిన వర్షం కురుస్తోంది. దీంతో ఉదయం వేళ వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో రహదారులపై ఏర్పడ్డ గుంతల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. మరి మీ ప్రాంతంలో వర్షం పడుతోందా ? కామెంట్ చేయండి.
నేడు నెల్లూరుకు త్రిసభ్య కమిటీ రానుంది. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో TDP విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. TDP జిల్లా అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తులు తీసుకోనుంది. అబ్దుల్ అజీజ్ మరోసారి అధ్యక్ష పదవిని ఆశిస్తుండగా, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, చెంచల్ బాబు యాదవ్ తదితరులు పదవిని ఆశిస్తున్నట్లు సమచారం.
హనుమంతునిపాడు మండలానికి చెందిన ధనేకుల తిరుపతయ్య 2000వ సంవత్సరం సెప్టెంబర్ 4న బాలిక ఉన్న షాపు దగ్గరకు వెళ్లాడు. అక్కడ కూల్‌డ్రింక్ తీసుకుని తాగాడు. తర్వాత బాలికను బయటకు పిలిచి నోరు మూసిపెట్టి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కేకలు వేయడంతో పారిపోయాడు. నేరం రుజువు కావడంతో 24 ఏళ్ల తర్వాత ఒంగోలు కోర్టు అతనికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.7వేల జరిమానా విధిస్తూ నిన్న తీర్పు చెప్పింది.
కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మూడు రాజకీయ పార్టీలను ఎన్నికల జాబితా నుంచి తొలగించినట్లు సహాయ ఎన్నికల నమోదు అధికారి గంగయ్య వెల్లడించారు. రాయలసీమ రాష్ట్ర సమితి, వైఎస్సార్ బహుజన, సధర్మ సంస్థాపన పార్టీలు 2019నుంచి 6 ఏళ్లుగా ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదని చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951క్రింద ఈ మూడు పార్టీలను రద్దు చేశామన్నారు.
డీఎస్సీ ఫలితాల్లో పలు విభాగాల్లోని పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఈనెల 28న జరగనుంది. ఈ మేరకు డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ లాగిన్ ఐడీతో మంగళవారం మధ్యాహ్నం నుంచి కాల్‌లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. సంబంధిత ధ్రువ పత్రాలను గెజిటెడ్ అధికారి ధ్రువీకరణతో 3 సెట్ల జిరాక్స్, 5 ఫొటోలతో కేటాయించిన తేదీ, వేదికకు సమయానికి హాజరవ్వాలన్నారు.
అమరావతి ప్రాంతంలో జరుగుతున్న పనులను పర్యవేక్షించడానికి CRDA తన కొత్త రాయపూడి కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మిస్తోంది. ఇది 360° పర్యవేక్షణ, రోడ్లు, భవనాలు, డ్రైనేజీ, పచ్చదనం ట్రాక్ చేయడం వంటి నెలవారీ పురోగతి నివేదికలను రోజువారీగా అందించడం కోసం CCTV కెమెరాలు, డ్రోన్‌లను ఉపయోగిస్తుంది. దీంతో ఎప్పటికప్పుడు పనుల పురోగతి తెలుసుకునేందుకు మరింత వీలుకానుంది.
కాణిపాక శ్రీవరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిత్తూరు నుంచి కాణిపాకానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డీపీటీఓ రాము తెలిపారు. సాధారణ రోజుల్లో ఐదు బస్సులు 55 ట్రిప్పులు తిరుగుతాయన్నారు. చవితి రోజు 12 బస్సులు, 130 ట్రిప్పులు తిరిగేలా చూస్తామన్నారు. అలాగే పుష్పపల్లకి, రథోత్సవానికి పది బస్సులు కేటాయించగా 110 ట్రిప్పులు తిప్పుతామన్నారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
పలాస రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఖాళీగా ఉన్న ఈ-డివిజనల్ మేనేజర్ పోస్టు భర్తీకి సంబంధించి తుది జాబితా సోమవారం విడుదలైంది. వివరాలు శ్రీకాకుళం జిల్లా వెబ్‌సైట్ srikakulam.ap.gov.inలో ఉంచినట్లు సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. తొలి 10 మందికి 26న కలెక్టర్ కార్యాలయంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్, సీపీటీ పరీక్ష జరగనున్నట్లు ప్రకటించారు.
కడప జిల్లాలో యూరియా కొరత లేదని రీజినల్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ASP శ్రీనివాసరావు స్పష్టం చేశారు. దువ్వూరులో ఎరువుల షాపులను తనిఖీ చేశారు. జిల్లాలో 3,350 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందన్నారు. RSKల్లో, ప్రైవేట్ డీలర్ల వద్ద యూరియా పొందవచ్చని సూచించారు. MRP ధరకే విక్రయించాలని డీలర్లకు సూచించారు. జిల్లాలో చాలాచోట్ల యూరియా పక్కదారి పడుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. మీ ఏరియాలో MRPకే ఇస్తున్నారా?
Sorry, no posts matched your criteria.