Andhra Pradesh

News April 22, 2024

శ్రీకాకుళం: పెళ్లి వేడుకలో కరెంట్ షాక్‌తో మృతి

image

రణస్థలం మండలం అల్లివలసలో మరో నిమిషాల్లో తాళి కట్టాల్సి ఉండగా.. ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మైలపల్లి లక్ష్ముడు ఇంట్లో ఆదివారం రాత్రి జరుగుతున్న వివాహ వేడుకల్లో విద్యుత్ షాక్ తగిలి ఒకరు మృతి చెందగా.. 12మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో జీరుపాలెంకు చెందిన అంబటి సీతమ్మ(45) మరణించగా.. గాయపడిన వారు రణస్థలంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

News April 22, 2024

నాదెండ్ల: ఈతకు వెళ్లి ఇద్దరు పిల్లలు మృతి

image

నాదెండ్ల మండల పరిధిలోని తూబాడు గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. తూబాడు చిరుమామిళ్ళ గ్రామాల మధ్యనున్న సాగర్ కాలువలో ఈత కొడదామని వెళ్ళిన ఇద్దరు చిన్నారులు షేక్ సిద్దిక్ (15), షేక్ అత్తర్ (15) నీట మునిగి చనిపోయారు. నీటి ప్రవాహానికి కాలువలో కొట్టుపోవడంతో గమనించిన స్థానికులు బయటకు తీసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. 

News April 22, 2024

వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా సమీర్ ఖాన్

image

వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా సమీర్ ఖాన్‌ను నియమించారు. ఈ మేరకు వైసీపీ రాష్ట్ర కమిటీ అధికారికంగా ఆదివారం ప్రకటన జారీచేసింది. వైసీపీ మైనార్టీ నేతగా క్రియాశీలకంగా పనిచేయడంతో పాటు జిల్లాలో సోనుసూద్ ట్రస్ట్ తరఫున అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. తాజాగా రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి దక్కింది.

News April 22, 2024

ప.గో.: కూటమి అభ్యర్థులను గెలిపించాలి: RRR

image

ప.గో. జిల్లా కాళ్ళ మండలం జక్కరం గ్రామంలో టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి పార్టీల కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. ఉండి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే మంతెన రామరాజు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో ఉండి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో కూటమి అభ్యర్థులు గెలిపించాలని సూచించారు.

News April 22, 2024

సింహాచలం అప్పన్న సన్నిధిలో పండిత సదస్సు

image

సింహాచలం ఆలయంలో సింహాద్రి అప్పన్న వార్షిక తిరు కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు ఆదివారం రాత్రి పండిత సదస్సును వైదిక వర్గాలు సాంప్రదాయపద్ధంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన వేద పండితులు సింహాద్రి అప్పన్న శ్రీదేవి భూదేవిని కొనియాడుతూ కీర్తించారు. అనంతరం వేద పండితులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి శ్రీనివాసమూర్తి, అదనపు కమిషనర్ చంద్రకుమార్ పాల్గొన్నారు.

News April 22, 2024

గుండెపోటుతో పంచాయతీ కార్యాదర్శి మృతి

image

శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న నాగరాజు గుండెపోటుతో అదివారం మృతిచెందారు. చిలమత్తూరులో గుండెపోటుకు గురి కావడంతో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు సన్నిహితులు తెలిపారు. విషయం తెలుసుకున్న సన్నిహితులు సంతాపం వ్యక్తం చేశారు.

News April 22, 2024

కడప: శిల్పారామంలో నృత్య ప్రదర్శన

image

కడప నగర పరిధిలోని శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఆటవిడుపు కార్యక్రమంలో భాగంగా వైభవంగా నృత్య ప్రదర్శనను నిర్వహించినట్లు పరిపాలనా అధికారి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. నగర పరిధిలోని ప్రజలు కార్యక్రమానికి హాజరై ఆసక్తిగా తిలకించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా జానపద, కూచిపూడి, నాటక ప్రదర్శనలు యువత ప్రదర్శించినట్లు చెప్పారు.

News April 22, 2024

ఒంగోలు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సుధాకర్ రెడ్డి

image

ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ లోక్ సభ పార్లమెంటు స్థానాలను ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ ఆదివారం విడుదల చేశారు. ఈ మేరకు ఒంగోలు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఈదా సుధాకర్ రెడ్డిని నియమించారు. ఆయన ప్రస్తుతం ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.

News April 22, 2024

సమ్మర్ ఆక్టివిటీస్ పుస్తకాన్ని ఆవిష్కరించిన డీఈఓ

image

రాష్ట్ర విద్యా శాఖ ఉత్తర్వులతో కమిషనర్ సూచనలతో APSSTF వారు సోషల్ స్టడీస్ సమ్మర్ యాక్టివిటీస్ పుస్తకాన్ని ప్రచురించారు. ఆదివారం విజయనగరం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈఓ ఎన్.ప్రేమ్ కుమార్, ఇతర సిబ్బందితో కలసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులు వేసవి సెలవుల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా అత్యంత ఆకర్షనీయంగా పుస్తకాన్ని రూపొందించారని తెలిపారు.

News April 22, 2024

22వ తేది లోపు పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

image

పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన పీఓ, ఏపీఓలు ఏప్రిల్ 22వ తేదిలోపు దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులను జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.జి.సృజన అదేశించారు. ఆదివారం పోస్టల్ బ్యాలెట్ వినియోగంపై రిటర్నింగ్ అధికారులు, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారులు, తహసీల్దార్లతో కలెక్టర్ డా.జి.సృజన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.