Andhra Pradesh

News April 22, 2024

వైభవంగా శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు ప్రారంభం

image

తిరుపతి శ్రీకోదండరామస్వామి తెప్పోత్సవాలు ఆదివారం శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులను రామచంద్ర పుష్కరిణికి వేంచేపు చేశారు. రాత్రి తెప్పోత్సవం నిర్వహించారు.

News April 22, 2024

జిల్లాలోని సమస్య ఆత్మక పోలింగ్ స్టేషన్లో కలెక్టర్ బస

image

సార్వత్రిక ఎన్నికల 2024 కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ మాచర్ల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను, చెక్ పోస్టులను అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల విధులను అప్రమత్తత నిర్వహించాలన్నారు. మద్యం, నగదు ఇతర వస్తువులు అక్రమ రవాణాను నివారించాలని, సిబ్బందికి సలహాలు అందజేశారు. తనిఖీ అనంతరం మందడం జిల్లా పరిషత్ పాఠశాలలో రాత్రి బస చేశారు.

News April 22, 2024

NTR: చెక్‌పోస్టుల వ‌ద్ద నిరంత‌ర నిఘా

image

మ‌ద్యం, డ‌బ్బు, విలువైన వ‌స్తువులు త‌దిత‌రాల అక్ర‌మ ర‌వాణాకు అడ్డుక‌ట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వ‌ద్ద క‌ట్టుదిట్టంగా నిరంత‌ర నిఘా కొన‌సాగుతోంద‌ని క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. చెక్‌పోస్టుల కార్య‌క‌లాపాల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో భాగంగా ఆయన ఆదివారం ప్ర‌కాశం బ్యారేజ్ వ‌ద్ద పోలీస్ చెక్‌పోస్టును ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. అనంతరం వాహ‌నాల త‌నిఖీ ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించారు.

News April 21, 2024

కృష్ణా: మేకలు తోలుకొని వెళుతున్న మహిళపై అత్యాచారయత్నం

image

ముసునూరు మండలంలోని చింతలవల్లి గ్రామంలో మహిళ మేకలను మేతకు తోలుకు వెళుతుండగా, ఆదివారం అదే గ్రామానికి చెందిన శ్యామ్ కుమార్ అనే వ్యక్తి అత్యాచారయత్నం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసే దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ వాసు తెలిపారు. క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి విచారణ అనంతరం తగిన చర్యలు చేపడతామని ఎస్ఐ వాసు స్పష్టం చేస్తున్నారు.

News April 21, 2024

ANUలో ICET-2024 నోటిఫికేషన్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెల్ఫ్ సపోర్ట్ విధానంలో 8 కోర్సులకు ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు ANU- ICET-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఎంబీఏలో పలు రకాల కోర్సులు, ఎంసీఏ కోర్సులలో చేరే విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని ఆ విభాగ సంచాలకులు డాక్టర్ అనిత తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు మే 9లోగా దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా పంపించాలని కోరారు. 

News April 21, 2024

అమలాపురం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నేపథ్యం ఇదే..

image

అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా జంగా గౌతమ్‌ను ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. కాగా ఆయన ప్రస్తుతం ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. 2009లో ప్రజారాజ్యం తరఫున పి.గన్నవరం అసెంబ్లీకి పోటీ చేశారు. 2014లో అమలాపురం అసెంబ్లీ, 2019లో అమలాపురం పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అయినవిల్లి మండలం నేదునూరు పెదపాలెంలో 1970 ఆగస్టులో జన్మించారు.

News April 21, 2024

వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని గరుడసేవ

image

శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఆదివారం రాత్రి గరుడ వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణులు భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 నుంచి వాహనసేవ వైభవంగా జరిగింది. కేరళ డ్రమ్స్, భక్తజన బృంధాలు, చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

News April 21, 2024

శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

హిరమండలంలోని దాసుపురం గ్రామానికి చెందిన సిద్ధమడుగుల శంకర్రావు (26) చవితి సీది వెళ్తుండగా కోడూరు దగ్గరలో బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయినట్లు హిరమండలం పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. ఈ ప్రమాదంలో అతని ముఖం రోడ్డును బలంగా తాకి తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించిన హిరమండలం ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News April 21, 2024

విజయనగరం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బొబ్బిలి శ్రీను

image

విజయనగరం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బొబ్బిలి శ్రీనును పార్టీ ప్రకటించింది. గజపతినగరం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గతంలో ఆయన పోటీచేశారు. ఆయన సేవలను అధిష్ఠానం గుర్తించి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో కాంగ్రెస్ అభిమానుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరించాలని శ్రీను కోరారు.

News April 21, 2024

విజయవాడ: ఇందిరా గాంధీ స్టేడియంలో ఉచిత యోగా

image

స్థానిక ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఏప్రిల్ 22వ తేదీ నుంచి ఉచిత యోగ వేసవి క్రీడా శిక్షణ శిబిరం ప్రారంభిస్తున్నట్లు అమరావతి యోగా, ఏరోబిక్ సంఘ అధ్యక్షుడు నాగేశ్వరరావు ఆదివారం తెలిపారు. సోమవారం ఉదయం 6 గంటలకు కలెక్టర్ ఢిల్లీ రావు ఈ శిబిరాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. నగరంలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.