Andhra Pradesh

News April 21, 2024

కడప: రేపు నామినేషన్లు వేయనున్న అభ్యర్థులు

image

జిల్లాలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఆదివారం సెలవుదినం కావడంతో నామినేషన్లు నమోదుకాలేదు. సోమవారం ప్రధాన పార్టీల నుంచి నామినేషన్లు వేస్తున్నవారు. వారిలో
➤ కడప TDP MP అభ్యర్థిగా భూపేశ్ రెడ్డి
➤ JMD-సుధీర్ రెడ్డి
➤ PDTR-రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి
➤ బద్వేల్-దాసరి సుధ, విజయ జ్యోతి
➤ కమలాపురం-పి.రవీంద్ర నాథ్ రెడ్డి
➤ మైదుకూరు-పుట్టా సుధాకర్ యాదవ్
➤ 25న పులివెందులలో వైఎస్ జగన్ నామినేషన్ వేయనున్నారు.

News April 21, 2024

ఆదోని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిపై కేసు నమోదు

image

ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద ఎన్డీఏ అభ్యర్థి పార్థసారథిపై ఆదివారం కేసు నమోదైందని టూ టౌన్ సీఐ గోపి తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్థసారథి శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారన్నారు. ఆ సమయంలో ఐదుగురికి బదులు 8 మంది వెళ్లడంతో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, గుడిసె కృష్ణమ్మ, సూరం భాస్కర్ రెడ్డి, మరో నలుగురిపై 188 సెక్షన్ కింద కేసు నమోదు చేశామన్నారు.

News April 21, 2024

కాకినాడ: రేపే చంద్రబాబు పర్యటన.. SP పర్యవేక్షణ

image

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రేపు కాకినాడ జిల్లా జగ్గంపేటలో పర్యటించనున్న నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ సతీశ్ కుమార్ పరిశీలించారు. ఆయన వెంట పెద్దాపురం డీఎస్పీ లతా కుమారి, సీఐ లక్ష్మణరావు, ఎస్ఐలు ఉన్నారు. హెలిప్యాడ్, రోడ్ షో నిర్వహించే ప్రాంతాన్ని సిబ్బందితో పరిశీలించారు. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ మళ్లింపు వంటి అంశాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

News April 21, 2024

నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి: శివశంకర్

image

పోస్టల్ బ్యాలెట్‌కి సంబంధించి ఎన్నికల కమిషన్ రూపొందించిన నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సూచించారు. ఆదివారం నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్ తదితర అంశాలపై రిటర్నింగ్ అధికారులతో వెబెక్స్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News April 21, 2024

చిత్తూరు: వడదెబ్బ తగిలి ఏఎస్ఐకి తీవ్ర గాయాలు

image

తంబళ్లపల్లికి ఎన్నికల విధులకు వెళుతున్న ఏఎస్ఐ వడదెబ్బ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి కథనం.. ఎన్నికల విధులకు తంబళ్లపల్లికి వెళ్తున్న మదనపల్లి ట్రాఫిక్ ఏఎస్ఐ సుబ్రహ్మణ్యం కురబలకోట మండలం, ముదివేడు క్రాస్ వద్ద వడదెబ్బ తగలడంతో రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. అదే సమయంలో మదనపల్లికి వస్తున్న లోకేశ్ అనే యువకుడు తన కారులో మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు.

News April 21, 2024

కసుమూరు దర్గాలో సినీ హీరో సుమన్ పూజలు

image

దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసుమూరు మస్తాన్ వలి దర్గాను ఆదివారం ప్రముఖ సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు. దర్గా ముజావర్లు ఆయనకు ఘన స్వాగతం పలికారు. హీరో సుమన్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో కేఎస్ అసిఫ్, ఎంఎస్ మొహమ్మద్, ఎంఎస్ దస్తగిరి, రహీద్ తదితరులు పాల్గొన్నారు.

News April 21, 2024

కడప: అక్కడ వారి ఓట్లే కీలకం

image

జిల్లాలోనే జమ్మలమడుగు నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం ఇక్కడ కూటమి నుంచి ఆదినారాయణ రెడ్డి, వైసీపీ నుంచి మూలె సుధీర్ ఢీ అంటే ఢీ అంటున్నారు. అయితే నియోజకవర్గంలో 2,41,642 ఓట్లు ఉన్నాయి. అందులో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 79,462 మంది ఉంటే బీసీ – 42,370, రెడ్డి – 40,590, ముస్లిం ఓటర్లు 38,223 మంది ఉన్నారు. జమ్మలమడుగులో కీలకంగా ఉన్న ఎస్సీ ఓట్లు గెలుపును నిర్దేశిస్తాయి.

News April 21, 2024

నరసాపురంలో చిన్నప్పుడు తప్పిపోయా: పవన్ కళ్యాణ్

image

నరసాపురంతో తనకు చాలా మంచి జ్ణాపకాలు ఉన్నాయని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు. నరసాపురంలో నిర్వహించిన వారాహి సభలో ఆయన మాట్లాడుతూ.. చిన్నప్పుడు ఒంగోలు నుంచి మొగల్తూరు వెళ్తుండగా నరసాపురం బస్టాండ్‌లో ఆగినప్పుడు తప్పిపోయాను. ఆ సమయంలో ఓ వ్యక్తి నన్ను దుకాణంలో కూర్చొబెట్టి నాన్న వచ్చాక వెయిట్ చేసి అప్పజెప్పారంటూ గుర్తుచేసుకున్నారు.

News April 21, 2024

విజయనగరం జిల్లాలో చంద్రబాబు సభ  

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 23న టీడీపీ అధినేత చంద్రబాబు విజయనగరం జిల్లాకు రానున్నారు. ఆరోజు ఉదయం బొండపల్లి మండలంలో మహిళా ప్రజాగళం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. సభకు బొండపల్లి జాతీయ రహదారి పక్కన గల మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ ప్రభాకర్, ఎస్.ఐలు లక్ష్మణరావు, మహేశ్ సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. 

News April 21, 2024

అద్దంకిలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం

image

అద్దంకి పట్టణంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆదివారం బీభత్సం సృష్టించింది. ఒంగోలు వైపు నుంచి వస్తున్న ట్రావెల్స్ బస్సు అద్దంకి పట్టణంలో సత్యనారాయణ కళామందిరం దగ్గరికి వచ్చేసరికి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ సందర్భంలో ట్రావెల్స్ బస్సు ఆగకుండా వెళ్లి గోపాలపురం దగ్గర మరొక ట్యాలీ వ్యాన్‌ను ఢీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు.