Andhra Pradesh

News April 21, 2024

జిల్లాలో 634 సీ-విజిల్ ఫిర్యాదుల ప‌రిష్కారం: ఢిల్లీరావు

image

జిల్లాలో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి అమ‌ల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు సీ-విజిల్ ద్వారా 634 ఫిర్యాదులు ప‌రిశీలించి ప‌రిష్క‌రించిన‌ట్లు కలెక్ట‌ర్ ఢిల్లీరావు తెలిపారు. ఓట‌ర్ హెల్ప్‌లైన్‌, నేష‌న‌ల్ గ్రీవెన్స్ స‌ర్వీసెస్ పోర్ట‌ల్ త‌దిత‌ర మార్గాల ద్వారా మొత్తం 1, 635 ఫిర్యాదులు రాగా 1, 609 ఫిర్యాదుల ప‌రిష్కార ప్ర‌క్రియ పూర్త‌యింద‌న్నారు. మిగిలినవి పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు.

News April 21, 2024

విశాఖ: ఏడుసార్లు పోటీ.. నాలుగుసార్లు గెలుపు

image

మాడుగుల టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి చంద్రబాబు బీ-ఫారమ్ అందజేసిన సంగతి తెలిసిందే. ఏడుసార్లు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన ఆయన.. నాలుగు సార్లు గెలిచారు. 1989, 1994 ,1999, 2004లో పరవాడ నుంచి పోటీ చేసి.. మూడుసార్లు గెలుపొందగా 2004లో ఓడిపోయారు. నియోజకవర్గాల పునర్విభజనతో 2009, 2014, 2019లో పెందుర్తి నుంచి పోటీచేయగా.. 2014లో గెలిచారు. 1997-98లో క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు.

News April 21, 2024

పుట్టపర్తి టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తా: పోలన్న

image

పుట్టపర్తి నియోజకవర్గం నుంచి టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తానని వడ్డెర సంఘం నాయకులు దళవాయి సిమెంట్ పోలన్న పేర్కొన్నారు. ఆదివారం ఆయన పుట్టపర్తిలో మాట్లాడుతూ.. ఎన్నికలలో వడ్డెరలకు సముచిత స్థానం కల్పిస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాయమాటలు చెప్పి చివరిలో మోసం చేశారని అన్నారు. అందుకే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి వడ్డెర్ల సత్తా చూపిస్తామన్నారు.

News April 21, 2024

ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్ 

image

సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. మనజీర్ జిలాని సమూన్ అన్నారు. ఆదివారం ఆయన వజ్రపు కొత్తూరు మండలంలో పర్యటించారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు కీలక సూచనలు చేశారు. ఇప్పటికే చేసిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం దిశా నిర్దేశాల్లో ఎటువంటి తేడా వచ్చినా సంబంధిత అధికారులదే బాధ్యత అన్నారు.

News April 21, 2024

శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులుగా సున్నిపెంట వాసులు

image

శ్రీశైల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులుగా సున్నిపెంటకు చెందిన ఇద్దరు ముస్లిం మైనార్టీ నాయకులను ఆయా పార్టీలు ఎంపిక చేశాయి. ఇప్పటికే జై భారత్ నేషనల్ పార్టీ తరఫున ఎస్ఎం సికిందర్ బాషా నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏఎస్ ఇస్మాయిల్ త్వరలోనే నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇరువురూ నియోజకవర్గ పరిధిలో గుర్తింపు గల వ్యక్తులు కావడం, స్థానికంగా అందరితో పరిచయాలు ఉండటం విశేషం.

News April 21, 2024

విజయనగరం: ముగిసిన మోడల్ స్కూల్ ఎంట్రన్స్ పరీక్ష

image

విజయనగరం జిల్లాలో ఆదివారం 6వ తరగతి మోడల్ స్కూల్ ఎంట్రన్స్ పరీక్షా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ప్రశాంతంగా ముగిసిందని జిల్లా విద్యా శాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ తెలిపారు. జిల్లాలో పలు పరీక్షా కేంద్రాలను డిఈఓ పరిశీలించారు. జిల్లాలో 14 సెంటర్లలో 3,669మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. 3,167 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. 502 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈఓ పేర్కొన్నారు.

News April 21, 2024

స్ట్రాంగ్ రూమును పరిశీలించిన జిల్లా కలెక్టర్

image

తడ తహశీల్దార్ కార్యాలయం మరియు స్ట్రాంగ్ రూంను తిరుపతి జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ సందర్శించారు. అలాగే సూళ్లూరు పేట తహశీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

News April 21, 2024

ప్రకాశం: తాగునీటి సమస్యనా.. ఈ నంబర్‌కు కాల్ చేయండి

image

జిల్లాలో ఏ గ్రామంలో అయినా తాగునీటి సమస్య ఉంటే అధికారుల దృష్టికి తెచ్చేందుకు ఒంగోలులోని కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఆ మేరకు జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ కంట్రోల్ రూమ్ నంబర్‌ను ప్రకటించారు. ఏ గ్రామంలోనైనా తాగునీటితో ఇబ్బందులు పడుతుంటే ప్రజలు 91001 21605 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.

News April 21, 2024

మంత్రి పెద్దిరెడ్డి కాళ్లు మొక్కిన ఎంపీ రెడ్డప్ప

image

బి.ఫాం తీసుకోవడానికి మదనపల్లెకి వచ్చిన చిత్తూరు ఎంపీ అభ్యర్థి రెడ్డెప్ప, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాళ్లకు మొక్కి బీఫాం అందుకున్నారు. ఈ కార్యక్రమం మదనపల్లెలో ఆదివారం ఎన్నికల ప్రచారసభ మిషన్ కాంపౌండ్‌లో జరిగింది. అందరూ కష్టపడి గెలవాలని పెద్ది రెడ్డి సూచించారు.

News April 21, 2024

గుంటూరు: అమర్నాథ్ యాత్రికులకు వైద్య పరీక్షలు

image

ఈ ఏడాది గుంటూరు జిల్లా నుంచి అమర్నాథ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో ప్రతి మంగళ, గురు వారాల్లో వైద్యపరీక్షలు నిర్వహించి మెడికల్ సర్టిఫికెట్ జారీ చేస్తామని ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధీర్ బాబు శనివారం తెలిపారు. ఈ యాత్రకు వెళ్లేందుకు 13 నుంచి 75 ఏళ్లలోపు వయస్సు వారు మాత్రమే అర్హులని ఆయన తెలిపారు.