Andhra Pradesh

News April 21, 2024

రేపు నామినేషన్ వేయనున్న రఘురామకృష్ణరాజు

image

ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కనుమూరు రఘురామకృష్ణరాజు రేపు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పెదమిరం గ్రామంలోని ఆయన స్వగృహం నుంచి ఉండి ఎమ్మార్వో ఆఫీస్, ఎన్నికల అధికారి కార్యాలయం వరకు భారీ ర్యాలీ జరుగుతుందని పేర్కొన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

News April 21, 2024

రాజోలు జనసేన అభ్యర్థికి సెకండ్ హ్యాండ్ కారు

image

☞ విద్యార్హతలు: MSC(బోటనీ), రిటైర్ట్ IAS
☞ కేసులు: లేవు
☞ చరాస్తులు: నగదు రూ.10,50,000. బ్యాంకుల్లో డిపాజిట్లు రూ.2,21,04,207. సెకండ్ హ్యాండ్ క్రీటా కారు (రూ.15 లక్షలు).
☞ బంగారం: భార్య పేరున 550గ్రా గోల్డ్ (రూ.2,49,64,207).
☞ స్థిరాస్తి: దిండిలో 50 సెంట్ల వ్యవసాయ భూమి, అమరావతి సమీప ఐనవోలులో 4,500చ. అడుగుల వ్యవసాయేతర భూమి. HYDలో 275చ. గజాల స్థలంలో 4000చ. అడుగుల్లో భవనం.
☞ అప్పులు: రూ.10,65,943.

News April 21, 2024

పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఆస్తుల వివరాలు

image

➤ నియోజకవర్గం: మాచర్ల
➤ అభ్యర్థి: పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి(YCP)
➤ భార్య: రమాదేవి
➤ విద్యార్హతలు: B.COM
➤ చరాస్తి విలువ: రూ.2.87 కోట్లు
➤ కేసులు: 4
➤ అప్పులు: రూ.4.36కోట్లు
➤ చేతిలో ఉన్న డబ్బులు: రూ.5 లక్షలు
➤ బంగారం: 100 గ్రాములు, భార్యకు 300 గ్రాములు
NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి.

News April 21, 2024

ఒంటిమిట్ట: 22న ట్రాఫిక్ ఆంక్షలు

image

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా 22న జరగనున్న కళ్యాణోత్సవం సందర్భంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి కడప పట్టణం, ఒంటిమిట్ట మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. కడప నుంచి తిరుపతి వెళ్లే వాహనాలు ఇర్కాన్ సర్కిల్, ఊటుకూరు సర్కిల్, రాయచోటి మీదుగా తిరుపతికి వెళ్లాలని, తిరుపతి నుంచి కడపకు వచ్చే వాహనాలు రేణిగుంట నుంచి రాయచోటి మీదుగా కడపకు రావాలన్నారు.  

News April 21, 2024

విజయవాడలో నవ వరుడు ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులతో నవ వరుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జక్కంపూడి కాలనీలో చోటు చేసుకుంది. అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా శనివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జక్కంపూడి కాలనీ బ్లాక్ నంబర్ 24లో మేరీ గ్రేసీ, వెంకట్ నివాసం ఉంటున్నారు. నెల రోజుల కిందటే గ్రేసీ, వెంకట్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News April 21, 2024

SKLM: యువకుడి ఆత్మహత్యాయత్నం

image

మెలియాపుట్టికి చెందిన ఆర్ జగదీశ్వరరావు అనే యువకుడు ఆదివారం ఉదయం పీక కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కార్పెంటర్‌గా జీవనం సాగిస్తున్న అతని ఉదయం మెడ భాగంలో కోసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన యువకుడిని కుటుంబసభ్యులు చికిత్స కోసం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో 108లో శ్రీకాకుళం తీసుకెళ్లారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు.

News April 21, 2024

రాచర్ల: అమ్మ డబ్బులు ఇవ్వలేదని సూసైడ్

image

పురుగుమందు తాగి ఒకరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని గౌతవరంలో శనివారం జరిగింది. ఎస్సై హరిబాబు కథనం మేరకు.. గ్రామానికి చెందిన వెంకటకిషోర్(39) తన కూతురు ఫంక్షన్ కోసం తల్లిని డబ్బులు అడిగారు. ఆమె నిరాకరించడంతో మనస్తాపానికి గురై పురుగు మందు తాగారు. మార్కాపురం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతునికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 21, 2024

విశాఖ: రికార్డు స్థాయిలో ప్రత్యేక రైళ్లు

image

వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని భారతీయ రైల్వే రికార్డు స్థాయిలో ప్రత్యేక రైళ్లను నడుపుతోందని వాల్తేర్ డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్ తెలిపారు. దేశ వ్యాప్తంగా 9,111 ట్రిప్పులను నడుపుతుండగా, గతేడాది కంటే 2,742 ట్రిప్పులు అధికమన్నారు. వాల్తేర్ డివిజన్‌లో 52 వేసవి ప్రత్యేక సర్వీసులు తిరుగుతున్నాయని, మరో 12 జతలు అదనంగా అందుబాటులోకి వస్తాయన్నారు.

News April 21, 2024

VJA: బాలికను వేధిస్తున్న యువకుడిపై కేసు

image

బాలికను వేధిస్తున్న ఓ యువకుడిపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం.. అజిత్ సింగ్ నగర్ ప్రాంతానికి చెందిన బాలిక(16)ను లూనా సెంటర్ ప్రాంతానికి చెందిన కళ్యాణ్ అనే యువకుడు వేధింపులకు గురిచేసినట్లు సమాచారం. శనివారం కూడా కళ్యాణ్ బాలికను వేధింపులకు గురి చేయడంతో బాలిక తల్లిదండ్రులు అజిత్ సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 21, 2024

అనంత: ఎన్నికల ఫిర్యాదులు కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్‌ ఏర్పాటు

image

అనంతపురం జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్లోని జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదులు తెలియజేయవచ్చని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్ కుమార్ తెలిపారు. సెక్టోరియల్ అధికారుల పర్యవేక్షణ కోసం 08554-232922, 6300907233, పోలింగ్ సిబ్బంది పర్యవేక్షణ కోసం 08554 – 231922, 6300923894 నెంబర్లు ఏర్పాటు చేశామన్నారు.