Andhra Pradesh

News April 21, 2024

తాటిపూడి APRJC లెక్చరర్ సూసైడ్!

image

అనకాపల్లిలో శనివారం ఓ మహిళ మృతిచెందింది. మృతురాలి తండ్రి నూకరాజు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి శారదా నగర్ ముత్రాసి కాలనీలో నివాసం ఉంటున్న APRJC లెక్చరర్ ఉమాదేవి(32), శనివారం అర్ధరాత్రి తన ఇంట్లో కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విజయనగరం జిల్లాలో లెక్చరర్‌గా ఈమె పనిచేస్తున్నారు. 2021లో వివాహమైన ఉమాదేవికి భర్తతో గొడవలు ఉన్నాయని ఆయన తెలిపారు.

News April 21, 2024

అనకాపల్లిలో లెక్చరర్ సూసైడ్!

image

అనకాపల్లిలో శనివారం ఓ మహిళ మృతిచెందింది. మృతురాలి తండ్రి నూకరాజు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి శారదా నగర్ ముత్రాసి కాలనీలో నివాసం ఉంటున్న APRJC లెక్చరర్ ఉమాదేవి(32), శనివారం అర్ధరాత్రి తన ఇంట్లో కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విజయనగరం జిల్లాలో లెక్చరర్‌గా ఈమె పనిచేస్తున్నారు. 2021లో వివాహమైన ఉమాదేవికి భర్తతో గొడవలు ఉన్నాయని ఆయన తెలిపారు.

News April 21, 2024

అనంత: ట్రాక్టరు నుంచి కిందపడి యువకుడి మృతి

image

ఉరవకొండ-గుంతకల్లు ప్రధాన రహదారిలోని గూళ్యపాళ్యం శివారులో శనివారం ట్రాక్టరు నుంచి కిందపడి కొనకొండ్లకు చెందిన విశ్వాసరావు(19) మృతి చెందాడు. అతడు శుక్రవారం తరిమెల గ్రామంలో మిత్రుడి వివాహానికి హాజరయ్యాడు. శనివారం గ్రామానికి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ నుంచి జారి కింద పడ్డాడు. తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై నరేశ్ తెలిపారు.

News April 21, 2024

పోస్టల్ బ్యాలెట్ కు రేపే చివరి రోజు: కలెక్టర్

image

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఏప్రిల్ 22వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించినట్లు జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డాక్టర్ జి.సృజన ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఎన్నికల విధుల కేటాయింపు ఉత్తర్వు, ఓటరు గుర్తింపు కార్డు జిరాక్స్ కాపీలతో కలపి ఫారం-12ను అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్వో కార్యాలయాల్లో అందజేయాలని సూచించారు.

News April 21, 2024

బీసీ యువజన పార్టీ MLA అభ్యర్థుల మూడో లిస్ట్

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బీసీ యువజన పార్టీ తరఫున పోటీ చేయనున్న MLA అభ్యర్థుల మూడో జాబితాను ఆ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ శనివారం ప్రకటించారు. భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పిప్పేటి వడ్డీకాసులు, కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా సోమ గోపాల్, కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా కె.నిరీక్షణ రావును బరిలో దింపుతున్నట్లు పేర్కొన్నారు.

News April 21, 2024

అనపర్తి నుంచి BJP అభ్యర్థిగా నల్లమిల్లి పోటీ..?

image

అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ దాదాపు ఖరారైంది. కానీ.. పోటీ చేసే పార్టీ మారనున్నట్లు సమాచారం. అనపర్తి సీటు BJPకి వెళ్లగా.. అప్పటికే TDP టికెట్ పొందిన నల్లమిల్లి నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో BJP నుంచే నల్లమిల్లిని బరిలో దింపాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జెండా ఏదైనా ఎజెండా గెలవాలని చంద్రబాబు సైతం ఆయనకు నచ్చజెప్పినట్లు సమాచారం. నల్లిమిల్లి నుంచి ప్రకటన రావాల్సి ఉంది.

News April 21, 2024

టీడీపీలో చేరిన పుత్తూరు మాజీ ఎంపీపీ

image

YCP బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి, పుత్తూరు మాజీ MPP ఏలుమలై అలియాస్ అమ్ములు TDPలో చేరారు. ఆయనతో పాటు DCCB మాజీ డైరెక్టర్ లక్ష్మీపతి, బిల్డర్ వెంకటమునికి నగరి MLA అభ్యర్థి గాలి భానుప్రకాశ్ సమక్షంలో చంద్రబాబు పసుపు కండువా కప్పారు. నగరి నియోజకవర్గంలో మొదలియార్ సామాజికవర్గ ఓటర్లు 32 వేల మంది ఉన్నారు. అదే సామాజికవర్గానికి చెందిన ఏలుమలై YCPని వీడటం ఆ పార్టీకి నష్టమేనని పలువురు భావిస్తున్నారు.

News April 21, 2024

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో నేడు గరుడ సేవ

image

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన ఆదివారం ఉదయం శ్రీ కోదండ రామస్వామి మోహిని అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. అనంతరం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ఊంజల్ సేవ, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు గరుడసేవ జరుగుతుంది.

News April 21, 2024

జిల్లాలో స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతలు

image

అనంతపురం జిల్లాలో శనివారం పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గినట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. యాడికిలో అత్యధికంగా 40.4 డిగ్రీలు, శింగనమలలో 39.5, నంబులపూలకుంట 39.4, ధర్మ వరం 38.7, కదిరి 38.5, తాడిపత్రి 38.4, అనంతపురం 38, యల్ల నూరు 37.9, తనకల్లు 37.7, కనగానపల్లి, గాండ్లపెంట 37.5, రాప్తాడు 37. 4, పుట్లూరు 37. 3 డిగ్రీలుగా నమోదైందన్నారు.

News April 21, 2024

ఉమ్మడి తూ.గో.లో మిగిలిన సీట్ల భర్తీకి కౌన్సెలింగ్

image

ఉమ్మడి తూ.గో జిల్లాలోని బాలికల గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో మిగిలిన సీట్ల భర్తీకి ధవళేశ్వరంలోని బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ఈ నెల 23న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని పాఠశాల ప్రిన్సిపల్ ఎ.వాణి తెలిపారు. ఉమ్మడి తూ.గో జిల్లా పరిధిలో 351 ఖాళీలు ఉన్నాయన్నారు. SC-220, BC-31, BC-67, ST-23, OC-10 సీట్లు ఉన్నాయని, ఆయా కేటగిరీలకు చెందినవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.