Andhra Pradesh

News April 21, 2024

గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆస్తుల వివరాలు

image

➤ నియోజకవర్గం: నరసరావుపేట
➤ అభ్యర్థి: గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి (YCP)
➤ భార్య: సుస్మిత రెడ్డి
➤ విద్యార్హతలు: MS(Ortho)
➤ చరాస్తి విలువ: రూ.1.14 కోట్లు
➤ భార్య చరాస్తి విలువ: రూ.1.44కోట్లు
➤ కేసులు: లేవు
➤ అప్పులు: రూ.3.24కోట్లు
➤ చేతిలో ఉన్న డబ్బులు: రూ.15 లక్షలు
➤ బంగారం: రూ.19లక్షలు విలువైన, భార్యకు రూ.58లక్షల విలువైన బంగారం ఉంది.
NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి.

News April 21, 2024

నెల్లూరు: రేపటి నుంచి టెక్నికల్ పరీక్షలు

image

డ్రాయింగ్, హ్యాండ్ లూమ్ వీవింగ్, టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ, లోయర్, హయ్యర్ గ్రేడ్ టైపింగ్ తదితర టెక్నికల్ కోర్సుల పరీక్షలను సోమవారం నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు నెల్లూరు ఆర్ఐఓ శ్రీనివాసులు తెలిపారు. హాల్ టికెట్లను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రానికి హాల్‌టికెట్‌తో పాటు ప్రభుత్వం నిర్దేశించిన గుర్తింపు కార్డు తీసుకురావాలన్నారు.

News April 21, 2024

టెక్కలి: ఆర్ధో వైద్యుడిపై దాడి.. కారు ధ్వంసం

image

టెక్కలి జిల్లా ఆసుపత్రిలో ఆర్ధో వైద్యునిగా విధులు నిర్వహిస్తున్న రాజేష్‌పై శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. ఒక స్థలానికి సంబంధించి చోటుచేసుకున్న వివాదం నేపథ్యంలో అతడు శ్రీకాకుళం వెళ్తున్న నేపథ్యంలో కారు ఆపి అద్దం ధ్వంసం చేశారు. కారులో ఉన్న వైద్యుడిని కిందకి దింపి గొడవ చేశారు. ఘటనపై టెక్కలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News April 21, 2024

నేడు మాంసం దుకాణాలు బంద్: విఎంసి కమిషనర్

image

మహావీర్ జయంతి సందర్భంగా ఆదివారం నగరంలో మాంసం విక్రయాలపై నిషేధం విధించినట్లు.. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. కబేళాకు సెలవని పేర్కొన్నారు. నగరంలోని అన్ని మాంసం దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించి మాంసం విక్రయించే దుకాణ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుకాణ యజమానులు, ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.

News April 21, 2024

కంచరపాలెం: గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

image

కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఊర్వశి జంక్షన్ జాతీయ రహదారి సమీపంలో శనివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది. స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. సీఐ భాస్కరరావు నేతృత్వంలో ఏఎస్సై కనకరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 21, 2024

అనంత: పిడుగుపాటుకు గురై వ్యక్తి మృతి

image

పుట్టపర్తి మండలం దిగువ చెర్లోపల్లికి చెందిన ఆకుల వీరప్ప పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. శనివారం సాయంత్రం మేకలను మేపుకొని ఇంటికి వస్తుండగా వర్షం రావడంతో వీరప్ప మర్రిచెట్టు కిందకి వెళ్ళాడు. ఆ సమయంలో చెట్టుపై పిడుగు పడడంతో వీరప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News April 21, 2024

మూడోరోజు ఉమ్మడి విజయనగరం జిల్లాలో 9 మంది నామినేషన్

image

మూడో రోజున శనివారం 9 మంది నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీర భద్ర స్వామి, యుగతులసి పార్టీ నుంచి ఒక నామినేషన్ వేశారు. చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయన కుమారుడు బొత్స సందీప్ వేశారు. నెల్లిమర్లలో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ వేశారు. బొబ్బిలిలో కాంగ్రెస్ అభ్యర్థి, స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ వేశారు. అరకు ఎంపీకి పి రంజిత్ కుమార్, కురుపాంలో స్వతంత్ర అభ్యర్థి వేశారు.

News April 21, 2024

కడప: అసంతృప్తి నేతలతో బుజ్జగింపులు

image

అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ MLA వీరశివారెడ్డి అసంతృప్తిపై అధిష్ఠానం బుజ్జగింపులు చేపట్టింది. TDP నేత రవిచంద్రయాదవ్, ఎమ్మల్సీ రాంగోపాల్ రెడ్డి ఇద్దరు శివారెడ్డితో భేటీ అయ్యారు. ఎన్నికల అనంతరం నామినేటెడ్ పదవి ఇస్తామనడంతో ఆయన మెత్తబడినట్లు సమాచారం. మరోవైపు ఉక్కు ప్రవీణ్ తో వ్యవహారం కూడా కొలిక్కి వచ్చినట్లు సమాచారం. దీంతో వీరు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దుతు తెలపనున్నారు.

News April 21, 2024

బల్లికురవ: రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం

image

బల్లికురవ మండలంలోని కొప్పెరపాడు జంక్షన్ వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయపడిన వ్యక్తిని నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. మృతుడు మండలంలోని కూకట్పల్లి గ్రామానికి చెందిన అంజయ్యగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 21, 2024

కర్నూలు: నేడు ఆదర్శ పాఠశాలలకు ప్రవేశ పరీక్ష

image

కర్నూలు జిల్లాలోని ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాలకు నేడు పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శ్యామూల్ తెలిపారు. ఉదయం 10గంటల నుంచి 12గంటల వరకు నిర్వహిస్తున్నామన్నారు. వెబ్ సైటు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొని పరీక్షలకు హాజరుకావాలన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్, బ్లూ, బ్లాక్ పెను, పరీక్ష ప్యాడ్ తో ఉదయం 9 గంటలకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు.