Andhra Pradesh

News August 26, 2025

కడప: 190 మంది కానిస్టేబుల్ అభ్యర్థుల ధృవీకరణ పత్రాల వెరిఫికేషన్

image

కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం 190 మంది కానిస్టేబుల్ అభ్యర్థుల ధ్రువపత్రాలను అధికారులు పరిశీలించారు. ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వెరిఫికేషన్ జరిగింది. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సరియైన సర్టిఫికెట్లు ఉన్నవారికి ఉద్యోగం వస్తుందని స్పష్టం చేశారు. తప్పుడు సర్టిఫికెట్ల ఎవరైనా తీసుకొస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News August 26, 2025

అనంతపురం: పోలీసుల గ్రీవెన్స్‌కు 60 ఫిర్యాదులు

image

అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు 60 ఫిర్యాదులు అందినట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ వెల్లడించారు. ఫిర్యాదుదారులతో ఆయన మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఫిర్యాదుల పరిష్కరానికి సంబంధిత పోలీసు అధికారులకు వినతులు పంపారు. గడువులోగా బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

News August 26, 2025

SKLM: సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్

image

శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 13న జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ జరగనుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జూనైద్ అహ్మద్ మౌలానా ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, మోటారు వాహన ప్రమాదాలు, ప్రీ-లిటిగేషన్ కేసులు ఈ లోక్ అదాలత్‌లో పరిష్కరించబడనున్నాయన్నారు.

News August 26, 2025

హైదరాబాద్ హాఫ్ మారథాన్‌లో కర్నూలు వాసి సత్తా

image

హైదరాబాద్‌లో జరిగిన హాఫ్ మారథాన్ రన్ రేస్‌లో కర్నూలు నగరానికి చెందిన హిమబిందు ప్రతిభ కనబరిచారు. మూడు ప్రధాన ఫ్లైఓవర్ల మీదుగా 21 కిలోమీటర్లు పరిగెత్తి, కేవలం 2 గంటల 53 నిమిషాల్లోనే పూర్తి చేశారు. హిమబిందు విజయంతో జిల్లాలోని క్రీడాభిమానులు, క్రీడాసంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. హిమబిందు ప్రదర్శన నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని వారు అభినందించారు.

News August 26, 2025

పాతపట్నం ఎమ్మెల్యే అస్వస్థతకు గురి.. పరామర్శించిన కేంద్ర మంత్రి

image

పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. ఇటీవల కాలంలో పని ఒత్తిడి కారణంగా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించడంతో అనారోగ్యానికి గురి అయ్యారు. విశాఖ పట్నంలో చికిత్స పొందుతున్న ఆయనకు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సమాచారం అందుకొని ఆయనను పరామర్శించారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటూ ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.

News August 26, 2025

‘తల్లికి వందనం పెండింగ్ క్లైమ్‌ల పరిష్కారానికి చర్యలు’

image

జిల్లాలో తల్లికి వందనం పెండింగ్ క్లైమ్‌ల పరిష్కారానికి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పలు అంశాలపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. తల్లికి వందనం ఖాతాలో నగదు జమ చేయడానికి ఇబ్బందిగా ఉన్న అంశాల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.

News August 26, 2025

విశాఖ సీపీ కార్యాలయానికి 110 ఫిర్యాదులు

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా పోలీస్ కమీషనరేట్‌లో సోమవారం 110 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా ఆయన మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి చట్టపరంగా సమస్య పరిష్కారించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్‌లో ఒకసారి నమోదైన ఫిర్యాదు పునరావృతం కాకుండా చూడాలన్నారు.

News August 25, 2025

అనంత: ముగిసిన కానిస్టేబుళ్ల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్

image

అనంతపురం జిల్లాలో సివిల్, ఏపీఎస్పీ విభాగాలకు ఎంపికైన 488 మంది అభ్యర్థులు వెరిఫికేషన్ ప్రక్రియకు హాజరవ్వాల్సి ఉండగా 470 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాగా మిగిలిన 18 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపారు. సివిల్ -278 మంది గానూ 266, APSP- 210 మందికి గానూ 204 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వెరిఫికేషన్ ప్రక్రియ కోసం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మొత్తం 10 కౌంటర్లు ఏర్పాటు చేశారు.

News August 25, 2025

విశాఖ పోర్టు రోడ్డులో భారీ వాహనాలకు అనుమతి లేదు

image

కేంద్ర రక్షణశాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం విశాఖలో పర్యటించనున్నారు. మ.12.30 నిమిషాలకు I.N.S సర్కార్‌కు చేరుకొని ఉదయగిరి, హిమగిరి అనే నౌకలను ప్రారంభించనున్నారు. ఆయన ప్రసంగించిన తర్వాత సాయంత్రం 5.25 నిముషాలకు తిరిగి బయలుదేరుతారు. V.V.I.P రాక సందర్భంగా విశాఖపట్నం పోర్ట్ రోడ్డులో రేపు భారీ వాహనాలకు అనుమతి లేదని పోర్టు అధికారులు తెలిపారు.

News August 25, 2025

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ పేర్ని నానిపై ఎంపీ బాలశౌరి ఫైర్
☞ HYD-MTM పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే: బాలశౌరి
☞ మంగినపూడి బీచ్ వద్ద పటిష్ట నిఘా వ్యవస్థ
☞ పోరంకిలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి, MLA
☞ కృష్ణా జిల్లా కలెక్టరేట్ వద్ద దివ్యాంగుల ధర్నా
☞కృష్ణా: విగ్రహాలు అనుమతికి మంగళవారం లాస్ట్ డేట్