Andhra Pradesh

News April 21, 2024

24 గంటల్లోగా అతిథి గృహంలో సదుపాయాలు కల్పించండి: కలెక్టర్

image

24 గంటల్లోగా రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో పూర్తి స్థాయి సదుపాయాలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమీషనర్, ఆర్అండ్బీ అధికారులను కలెక్టర్ డా.జి.సృజన అదేశించారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో జరుగుతున్న మరమ్మత్తు పనులను మున్సిపల్ కమీషనర్ భార్గవ తేజతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వ అతిథి గృహ ఆవరణంలో పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

News April 21, 2024

సరిహద్దు చెక్ పోస్టులను తనిఖీ చేసిన ఎస్పీ

image

గుమ్మఘట్ట మండలం కొత్తపల్లికుంట దొడ్డి అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టును అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వెహికల్ మూవ్మెంట్ రిజిస్టర్‌ను పరిశీలించారు. కర్నాటక నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చెక్ పోస్టు గుండా వెళ్లొచ్చే రహదారికి ప్రత్యామ్నాయంగా ఉన్న దారులపై ప్రత్యేక నిఘా వేసి అక్రమాలకు కళ్లెం వేయాలన్నారు.

News April 21, 2024

కడప: సుధా లావణ్యకు డాక్టరేట్

image

వైవీయూ మనోవిజ్ఞాన శాస్త్ర శాఖ స్కాలర్ డి.సుధా లావణ్యకు వైవీయూ డాక్టరేట్ ను ప్రకటించింది. ఆ శాఖ సహ ఆచార్యులు డావి లాజర్ పర్యవేక్షణలో “వంధ్యత్వం ఉన్న మహిళల్లో వైవాహిక సర్దుబాటు, మానసిక ఆరోగ్యంపై ఒత్తిడి, జీవన నాణ్యత ప్రభావం” అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంధాన్ని వైవీయూ పరీక్షలు విభాగానికి సమర్పించారు. డాక్టర్ ప్రొసీడింగ్స్ ను వైవీయూ సీఈ ఆచార్య ఎన్.ఈశ్వర్ రెడ్డి జారీ చేశారు.

News April 21, 2024

యాదవులకు వైసీపీలో సముచిత స్థానం: మంత్రి కొట్టు

image

వైసీపీలో యాదవ సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పించామని ఆ పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. శనివారం సాయంత్రం పట్టణంలో యాదవ సంఘ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేటెడ్ పదవులిచ్చి సీఎం జగన్ గౌరవించారన్నారు. అప్సడా వైస్ ఛైర్మన్ రఘురామ్ నాయుడు, సంపత్ కుమార్ పాల్గొన్నారు.

News April 21, 2024

తిరుపతి జిల్లా పరిధిలో 20 నామినేషన్లు

image

తిరుపతి జిల్లా పరిధిలోని ఒక పార్లమెంటు స్థానం, ఏడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మూడవరోజు శనివారం 20 నామినేషన్లు దాఖలైనట్లు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. తిరుపతి పార్లమెంటు స్థానానికి మూడు నామినేషన్లు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 17 నామినేషన్లు దాఖలైనట్లు ఆయన చెప్పారు. ఆదివారం సెలవు కావడంతో నామినేషన్ల స్వీకరణ లేదన్నారు. ఈనెల 25 వరకు అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.

News April 21, 2024

నీటి ఎద్దడి నివారణకు టోల్ ఫ్రీ నెంబర్: కలెక్టర్

image

ప్రకాశం జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు కలెక్టరేట్ లో 9100121605 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాగర్ జలాలు ఈనెల 10న జిల్లాలోకి ప్రవేశించాయని, ఈ సాగర్ జలాలు వృథా కాకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని ఏ ప్రాంతంలోనైన ప్రజలు తాగునీటి సమస్య ఉందని ఫోన్ చేస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు.

News April 21, 2024

నరసరావుపేట: పోటీ చేసే అభ్యర్థులు వివరాలు పొందుపరచాలి

image

సార్వత్రిక ఎన్నికలలో అభ్యర్థుల రాజకీయ పార్టీల ఖర్చులు వివరాలను సంబంధిత రిజిస్టర్లలో ఎన్నికల నియమావళి నిబంధనల ప్రకారం నమోదు చేయాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు గౌతమన్ , జోసఫ్ జార్జ్ తెలపారు. శనివారం సాయంత్రం నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో, అసిస్టెంట్ ఎక్స్‌పెండిచర్ అధికారులతో ఎలక్షన్ ఎక్స్‌పెండిచర్ మానిటరింగ్‌పై ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. 

News April 20, 2024

బంటుమిల్లిలో రోడ్డు ప్రమాదం.. వీఆర్ఓ మృతి

image

బంటుమిల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వీఆర్ఓ వెంకట వరప్రసాద్(62) మృతి చెందారు. చోరంపూడి వీఆర్ఓగా విధులు నిర్వర్తిస్తున్న ప్రసాద్ శనివారం ఉదయం మచిలీపట్నం నుంచి తన ద్విచక్ర వాహనంపై చోరంపూడి వస్తుండగా కొర్లపాడు వద్ద జాతీయ రహదారిపై వెనుక నుంచి వస్తున్న మారుతి కారు ఢీకొట్టింది. స్థానికులు వెంటనే అతడిని మచిలీపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ.. మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

News April 20, 2024

22తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలి: కలెక్టర్ నాగలక్ష్మి

image

ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ పొందేందుకు దరఖాస్తులను 22వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా అందజేయాలని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లను పొందేందుకు అర్హత ఉన్నవారికి సంబంధిత దరఖాస్తు ఫారాలను అందజేయడం జరిగిందన్నారు. వాటిని పూర్తిగా నింపి సోమవారం సాయంత్రంలోగా సంబంధిత నియోజకవర్గ కేంద్ర తహశీల్దార్ కార్యాలయంలో అందజేయాలన్నారు.

News April 20, 2024

గుంటూరు: సాగర్ కుడి కాలువలో ముగ్గురు పిల్లలు గల్లంతు

image

దుర్గి మండలం అడిగొప్పుల గ్రామంలో సాగర్ కుడి కాలువలో శనివారం ముగ్గురు పిల్లలు గల్లంతయ్యారు. పుట్టినరోజు వేడుకల సందర్భంగా సాగర్ కాలువ వద్ద ముగ్గురు పిల్లలు సెల్ఫీలు దిగుతున్నారు. ఈ క్రమంలో కాలువలో ముగ్గురు పడి కొట్టుకుపోయారు. ఘటనలో ఒకరిని స్థానికులు కాపాడారు. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.