Andhra Pradesh

News April 20, 2024

గరివిడి: వేధింపులు భరించలేక భర్తను చంపిన భార్య 

image

గరివిడి మండలంలో శుక్రవారం రాత్రి దారుణం జరిగింది. వెదుళ్లవలస గ్రామానికి చెందిన అప్పన్న(30) తాగుడుకు బానిసై నిత్యం భార్యతో గొడవపడేవాడు. ఈ క్రమంలో వేధింపులు భరించలేని భార్య దేవి, మామ సన్యాసిరావుతో కలిసి భర్తను ఉరి వేసి చంపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోస్టు మార్టం నిమిత్తం బాడీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

News April 20, 2024

పాలకొండ: విద్యుత్ షాక్‌తో రైతు మృతి

image

పాలకొండ మండలంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. అంపిలి గ్రామానికి చెందిన అప్పలనాయుడు (58) తన పొలానికి నీరు పెట్టడానికి వెళ్లి, కరెంట్ షాక్‌తో  మృతి చెందాడని ఏఎస్ఐ రాజారావు తెలిపారు. భార్య నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

News April 20, 2024

అనకాపల్లి: పార్లమెంటుకు ఒకటి, అసెంబ్లీకి 5 నామినేషన్లు

image

అనకాపల్లి జిల్లాలో శనివారం పార్లమెంటుకు జై భారత్ నేషనల్ పార్టీ తరపున ఆడారి శరత్ చంద్ర నామినేషన్ వేశారు. చోడవరం నుంచి సూర్య నాగ సన్యాసి రాజు (టిడిపి), మాడుగుల నవ భారత్ నిర్మాణ సేవ పార్టీ నుంచి తాళ్ల రవి, నామినేషన్లు వేశారు. అనకాపల్లి నుంచి ఇండిపెండెంట్ గా ఆళ్ల సత్తిరాజు, ఎలమంచిలి నుంచి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున బి.అమాజమ్మ, కాంగ్రెస్ నుంచి సుందరపు ఈశ్వరరావు నామినేషన్లు వేశారు

News April 20, 2024

చిత్తూరు: కారు- బైక్ ఢీ

image

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి గాయాలైన సంఘటన నిమ్మనపల్లి మండలంలో జరిగింది. స్థానిక ఇందిరమ్మ కాలనీ వద్ద రాయచోటి నుంచి పీలేరు వైపు కారు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బైక్‌ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు షౌకత్ ఆలీకి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన చికిత్స కోసం పీలేరు తరలించారు.

News April 20, 2024

కర్నూలు: విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతి

image

విద్యుత్ షాక్‌కు గురై తాయప్ప(35) అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పత్తికొండ పట్టణ శివారులోని రామకృష్ణారెడ్డి నగర్లో శనివారం జరిగింది. శుక్రవారం రాత్రి కురిసిన వర్షపు నీటిని తాయప్ప తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగకు తగిలాడని స్థానికులు తెలిపారు. దీంతో అతడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు తెలిపారు.

News April 20, 2024

మోడల్ స్కూల్ ఎంట్రన్స్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి: డీఈఓ

image

విజయనగరం జిల్లాలో ఆదివారం జరగనున్న 6వ తరగతి మోడల్ స్కూల్ ఎంట్రన్స్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశామని డీఈఓ ప్రేమ్ కుమార్ శనివారం తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 14 సెంటర్లలో 3,669 మంది పరీక్షలు రాయనున్నారన్నారు. ఉదయం 10గం నుంచి 12 వరకు పరీక్ష ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రనికి 30 నిమిషాల ముందే చేరుకోవాల్సి ఉందని తెలిపారు. https://cse.ap.gov.in/లో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.

News April 20, 2024

పులివెందుల: అన్నపై తమ్ముడు కత్తితో దాడి

image

పులివెందులలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పొలం గట్టు విషయంలో అన్నదమ్ముల ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో అన్న రఘనాథరెడ్డిపై తమ్ముడు రాజశేర్ రెడ్డి కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో రఘునాథరెడ్డి పులివెందుల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 20, 2024

ఆక్రమ రవాణాపై ఉక్కు పాదం జిల్లా ఎస్పీ ఆరీఫ్

image

ఎన్నికల నేపథ్యంలో అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టినట్లు నెల్లూరు ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. శనివారం జిల్లాలో సైదాపురం పరిధిలో-20, KP పోర్ట్-9, కొండాపురం-15, సంగం-11, దుత్తలూరు-7, జలదంకి-25, చేజెర్ల-10 మరియు SEB-217 మద్యం బాటిల్స్ లను సీజ్ చేసామన్నారు. ఎక్కడైనా ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే సి-విజిల్ యాప్ , టోల్ ఫ్రీ నంబర్ డయల్ 112 ఫిర్యాదు చేయవచ్చన్నారు.

News April 20, 2024

కమలాపురం హైవేపై ట్రాక్టర్ బోల్తా

image

తప్పెట్ల గ్రామ సమీపాన ఉన్న కడప-తాడిపత్రి జాతీయ రహదారి బ్రిడ్జి వద్ద కడ్డీల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ట్రాక్టర్ బోల్తా పడడంతో జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించిపోయాయి. ఈమేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

News April 20, 2024

గుంటూరు: విధుల్లో పాల్గొనే విలేకర్లకు పోస్టల్ బ్యాలెట్ 

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విధుల్లో పాల్గొనే విలేకర్లకు, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించడం జరిగిందని కలెక్టర్ శివశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్షన్ అథారిటీ లేఖలు పొందిన విలేకర్లు మాత్రమే, కలెక్టర్ కార్యాలయంలోని మీడియా సెంటర్లో ఫార్మ్-12డి పొంది పూర్తిచేసి, వాటితో పాటు ఓటర్ ఐడి, అక్రిడిటేషన్ నకలు జతచేసి ఈ నెల 21సాయంత్రం 6గంటలలోగా అందజేయాలన్నారు.