Andhra Pradesh

News April 20, 2024

శ్రీకాకుళం: కంట్రోల్ రూమ్ ను పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు

image

ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులు, విశ్రాంత ఐ.అర్.ఎస్ అధికారి నీనా నిగమ్, ఎన్నికల పరిశీలకులు కోమల్ జిత్ మీనా, శరవణ కుమార్, నవీన్ కుమార్ సోనీలతో కలసి నూతన కలెక్టరేట్ సముదాయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కేంద్రాన్ని శనివారం సందర్శించారు. మీడియా మానిటరింగ్, మోడల్ కోడ్ కమిటీ, సోషల్ మీడియా, జిల్లా ఎక్స్పెండిచర్ కమిటీ, కంప్లైంట్స్, రిపోర్టింగ్, మీడియా సెంటర్ విభాగాలను పరిశీలించారు.

News April 20, 2024

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకు వడ దెబ్బ

image

మంగళగిరి ఎన్నికల ప్రచారంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో శనివారం గణపతి నగర్‌లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు చికిత్స నిమిత్తం వెళ్లారు. ఎమ్మెల్యేకు వడదెబ్బ తగిలినట్టు వైద్యాధికారిణి పి. అనూష తెలిపారు. ప్రస్తుతానికి సెలైన్ ఎక్కించినట్లు తెలిపారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News April 20, 2024

తిరుపతి: ITEP ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు

image

జాతీయ సంస్కృత యూనివర్సిటీ (NSU)లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం (ITEP) ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ రమశ్రీ పేర్కొన్నారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా నాలుగు సంవత్సరాల B.A, B.Edలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలియజేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://nsktu.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 30.

News April 20, 2024

పులివెందుల కాంగ్రెస్ అభ్యర్థిగా ధ్రువ కుమార్ రెడ్డి

image

పులివెందుల కాంగ్రెస్ అభ్యర్థిగా ధ్రువ కుమార్ రెడ్డిని నియమించినట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల నుంచి బీఫామ్ అందుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియోజకవర్గంలో విస్తృతంగా తిరిగి పార్టీని బలోపేతం చేస్తామని వెల్లడించారు. తనకు బాధ్యతలు అప్పగించిన వైఎస్ షర్మిలకు కృతజ్ఞతలు చెప్పారు.

News April 20, 2024

ప్రకాశం: ‘హెచ్చరిక.. పిడుగులు పడే అవకాశం’

image

‘హెచ్చరిక… హెచ్చరిక.. హెచ్చరిక మీ పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్లు, టవర్స్, పోల్స్, పొలాలు ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదు. సురక్షితమైన. భవనాల్లో ఆశ్రయంపొందాలి.’ అంటూ APSDMA హెచ్చరిక చేసింది. దీంతో శనివారం ప్రకాశం జిల్లాలోని ప్రజలకు అలర్ట్ మెసేజులు రావడంతో ఒక్కసారిగా భయాందోళన చెందారు. కావున జాగ్రత్తగా ఉండండి.

News April 20, 2024

శ్రీకాకుళం: ఎన్నికల పరిశీలకులను కలిసిన కలెక్టర్, ఎస్పీ

image

రాష్ట్ర ఎన్నికల వ్యయ పరిశీలకులు నినా నిగమ్ జిల్లా పర్యటనకు వచ్చారు. శనివారం ఉదయం గౌరవ పూర్వకంగా ఆమెకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజిర్ జిలాని సమూన్, ఎస్పీ జి.ఆర్.రాధిక ఆహ్వానం పలికారు. అనంతరం జిల్లాలోని అనుసరిస్తున్న ఎన్నికల నియమావళి ప్రక్రియను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో ప్రతీ అధికారి అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని సూచించారు.

News April 20, 2024

వాల్మీకీపురంలో పెన్షన్ సొమ్ము ఇవ్వలేదని తల్లిపై కొడుకు దాడి

image

పెన్షన్ డబ్బు ఇవ్వలేదని తల్లిపై కొడుకు కర్రతో దాడిచేసి కాలు విరిచిన ఘటన శనివారం వాల్మీకిపురం మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని పత్తెపురానికి చెందిన వెంకటరమణమ్మ పెన్షన్ డబ్బు, కొడుకు లక్ష్మన్నకు ఇవ్వలేదని ఆగ్రహించాడు. ఇంట్లోని గొడ్డలి కట్టెతో తల్లి వెంకటరమణమ్మపై దాడి చేయడంతో ఆమె కాలు విరిగి తీవ్రంగా గాయపడింది. బాధితురాలిని మదనపల్లికి తరలించి, అక్కడి నుంచి రుయాకు తీసుకెళ్లారు.

News April 20, 2024

అనంత: పిల్లల మధ్య చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు

image

టీడీపీ అధినేత చంద్రబాబు పిల్లల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకొన్నారు. రాయదుర్గం నియోజక వర్గం కనేకల్ క్యాంపు సైట్‌లో టీడీపీ జిల్లా అధ్యక్షుడు కాల్వ శ్రీనివాసులుతో కలిసి జరుపుకొన్నారు. కేకులు కత్తిరించి పిల్లలకి పంపిణీ చేశారు. పిల్లలు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.

News April 20, 2024

కుంభోత్సవం సందర్భంగా జీవహింస పూర్తిగా నిషేధం: ఈవో పెద్దిరాజు

image

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఏప్రిల్ 26న కుంభోత్సవం సందర్భంగా జంతు, పక్షి బలులు, జీవహింస పూర్తిగా నిషేధమని ఈవో పెద్దిరాజు తెలిపారు. ఈమేరకు పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులకు సూచించారు. నిషేధం అమలుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని దేవస్థానం తరపున పూర్తి సహకారాలు అందించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. సున్నిపెంటలో రెండు రోజులు పాటు మద్యం షాపుల బంద్‌కు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేస్తామన్నారు.

News April 20, 2024

శ్రీకాకుళం: ప్రచార ఖర్చులపై నిరంతర నిఘా

image

ఎన్నికల ప్రచారానికి వ్యయ పరిమితికి మించి వెచ్చించే అవకాశం ఉన్న అభ్యర్థుల ఖర్చులపై నిరంతర నిఘా ఉంచాలని ఎన్నికల వ్యయ ప్రత్యేక పరిశీలకులు, విశ్రాంత ఐ.అర్.ఎస్ అధికారి నీనా నిగమ్ ఆయా నోడల్ ఏజెన్సీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఆమె సమావేశం నిర్వహించారు. ఓటర్లకు లంచం ఇచ్చే ప్రయత్నంలో నగదు, బహుమతుల పంపిణీపై సీ- విజిల్ లాంటి అప్లికేషన్ల ద్వారా ఫిర్యాదులు స్వీకరించాలన్నారు.