Andhra Pradesh

News April 20, 2024

ఉమ్మడి తూ.గో.లో రెండో రోజు 26 నామినేషన్లు

image

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రెండో రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా వ్యాప్తంగా ప్రధాన అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా నామపత్రాలు సమర్పించారు. శుక్రవారం ఉమ్మడి జిల్లా మొత్తంగా 26 నామినేషన్ల రాగా.. తూ.గో జిల్లాలో 12 (MP-1, MLA-11), అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 10, కాకినాడ జిల్లాలో 4 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.

News April 20, 2024

ఆత్మకూరు : 22న ఆనం నామినేషన్

image

ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ఆనం రామనారాయణ రెడ్డి ఏప్రిల్ 22వ తేదీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 9 గంటలకు ఆత్మకూరు సత్రం సెంటరు నుంచి ర్యాలీగా బయలుదేరి ఆర్టీసీ బస్టాండ్, పోలీస్ స్టేషన్, మీదుగా మున్సిపల్ ఆఫీసుకు చేరుకుంటారని ఆనం కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.

News April 20, 2024

శ్రీకాకుళం: రూ.1.37 లక్షల సొమ్ము సీజ్

image

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బెండి గేటు సమీపంలో సాధారణ ఎన్నికల్లో భాగంగా ప్లయింగ్ స్క్వాడ్ శుక్రవారం అటుగా వచ్చిన వాహనాలను తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ కారులో ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న రూ.1.37 లక్షలు సొమ్మును సీజ్ చేసి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన సొమ్మును వజ్రపుకొత్తూరు పోలీసులకు అందజేశామని ఫ్లైయింగ్ స్క్యాడ్ సిబ్బంది తెలిపారు.

News April 20, 2024

శ్రీవారి మెట్ల మార్గంలో హీరోయిన్ సంయుక్త మీనన్

image

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం శనివారం ఉదయం శ్రీవారి మెట్ల మార్గం ద్వారా సినీ నటి సంయుక్త మీనన్ తిరుమలకు చేరుకున్నారు. ఆమెకు అధికారులు బస, దర్శనం ఏర్పాట్లు చేశారు. ఆమె ముందుగా వరాహ స్వామిని దర్శించుకుని అనంతరం స్వామివారిని దర్శించుకోనున్నారు.

News April 20, 2024

అయ్యన్న పాత్రుడిపై 17 క్రిమినల్ కేసులు

image

☞ అభ్యర్థి: అయ్యన్నపాత్రుడు☞ పార్టీ: టీడీపీ☞నియోజకవర్గం: నర్సీపట్నం☞ కేసులు: 17 ( క్రిమినల్ కేసులు)☞ చరాస్తులు: రూ.1.13 కోట్లు☞ స్థిరాస్తి రూ.5,04కోట్లు☞ భార్య పేరిట స్థిరాస్తి: రూ.4.79 కోట్లు☞ భార్య పేరిట చరాస్తులు: రూ.10.8కోట్లు☞ భార్య పేరిట బంగారం: కేజీ☞ అప్పులు: రూ.2.86 కోట్లు➠ అయ్యన్నపాత్రుడు శుక్రవారం నామినేషన్ వేయగా, అఫిడవిట్‌లో వివరాలను వెల్లడించారు.

News April 20, 2024

సీఎం జగన్ అనంత జిల్లాకు ఏం చేశారు: చంద్రబాబు

image

టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం రాత్రి కనేకల్లులో ప్రజాగళం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ బిడ్డను అని చెప్పుకొనే జగన్.. ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలన్నారు. టీడీపీ హాయంలో రూ.4,500కోట్లతో హంద్రీనీవా ప్రారంభించామన్నారు. కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి తుంగభద్ర నుంచి హెచ్‌ఎల్సీ నీరు తెచ్చామన్నారు. బైరవానితిప్ప, ఉంతకల్లు ప్రాజెక్టులపై జగన్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

News April 20, 2024

ప్రకాశం జిల్లాకు రానున్న షర్మిలా రెడ్డి

image

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంకు ఈనెల 22న వైఎస్ షర్మిల పర్యటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా 22న ఉదయం 10 గంటలకు బూదాల అజిత్ రావు ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారని తెలిపారు. అదేరోజు చీరాలలో కూడా పర్యటించనున్నట్లు వెల్లడించారు. కావున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు.

News April 20, 2024

తెనాలి శ్రావణ్ కుమార్ ఆస్తుల వివరాలు ఇవే

image

➤ నియోజకవర్గం: తాడికొండ
➤ అభ్యర్థి: తెనాలి శ్రావణ్ కుమార్ (TDP)
➤ విద్యార్హతలు: MSC, MA, LLB
➤ మొత్తం చరాస్తి విలువ: రూ.1,47 కోట్లు
➤ స్థిరాస్తి విలువ: రూ.3.89 కోట్లు
➤అప్పులు: రూ.22.75 లక్షలు
➤ కేసులు: 08 కేసులు (పెండింగ్‌లో ఉన్నాయి.)
➤ భార్యపేరు: పద్మావతి
NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి

News April 20, 2024

నంద్యాల: పిడుగుపాటుతో ఒకరి మృతి

image

గడివేముల మండలం చిందుకూరు గ్రామ సమీపంలోని పంట పొలాల్లో గొర్రెలను మేపుకుంటున్న గొర్రెల కాపరి శేఖర్ పిడుగుపాటుకు గురై మృతి చెందిన ఘటన శుక్రవారం జరిగింది. ఆయన మండలంలోని డోన్ గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. దీంతోపాటు గడిరేవుల గ్రామంలో పిడుగుపాటుకు గురై 25 గొర్రెలు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.

News April 20, 2024

నెల్లూరు MP అభ్యర్థి ఆస్తి రూ.11.55 కోట్లేనంట..!

image

➤నియోజకవర్గం : నెల్లూరు పార్లమెంటు
➤అభ్యర్థి : కొప్పుల రాజు (కాంగ్రెస్ పార్టీ)
➤విద్యార్హత : ఎంఫిల్
➤వృత్తి : విశ్రాంత ఐఏఎస్ అధికారి
➤కుటుంబ ఆస్తి: 11.55 కోట్లు
➤అప్పులు: రూ.1.02 కోట్లు
నోట్ : ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం ఈ వివరాలు నమోదు అయ్యాయి.