Andhra Pradesh

News April 20, 2024

పలాస: అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

image

పలాస రైల్వే స్టేషన్‌లో స్థానిక జీఆర్పీ పోలీసులు శుక్రవారం బిహార్‌కు చెందిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నారు. భువనేశ్వర్ నుంచి విశాఖ వెళుతున్న ఇంటర్‌సీటీ ఎక్స్‌ప్రెస్ రైలులో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా ఐదుగురు యువకులను జీఆర్పీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి వద్ద ఉన్న బ్యాగులు క్షుణ్ణంగా పరిశీలించగా 27 గ్రాముల బంగారం, ఐదు తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు.

News April 20, 2024

బొత్స సత్యనారాయణ ఆస్తుల వివరాలు ఇవే..

image

☞ అభ్యర్థి: బొత్స సత్యనారాయణ
☞ పార్టీ: వైసీపీ
☞ చరాస్తులు: రూ.3.78 కోట్లు
☞ బంగారం: 31 తులాలు
☞ స్థిరాస్తి: రూ.6.75 కోట్లు
☞ అప్పులు: రూ.4.24 కోట్లు
☞ భార్య పేరిట చరాస్తులు: రూ.4.75 కోట్లు
☞ భార్య పేరిట స్థిరాస్తి: రూ.4.46 కోట్లు
☞ భార్య పేరిట బంగారం: 325 తులాలు
➠ బొత్స సత్యనారాయణ శుక్రవారం నామినేషన్ దాఖలు చేయగా, అఫిడవిట్‌లో ఈ వివరాలను వెల్లండించారు.

News April 20, 2024

కడప జిల్లాలో అమానుష ఘటన

image

ఉమ్మడి జిల్లాలోని గాలివీడు మండలం చిలకలూరిపేటలో విషాదం చోటుచేసుకుంది. భర్తతో గొడవ పడి ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెలిగల్లు సమీపంలోని గండిమడుగు నీటిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఒడ్డున చెప్పులు, సెల్ఫోన్ ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నీటిలో తేలియాడుతున్న మృతదేహాలను పోలీసులు బయటకు తీసి కేసు నమోదు చేశారు.

News April 20, 2024

యలమంచిలి: రమణమూర్తి రాజు ఆస్తుల వివరాలు

image

☞ అభ్యర్థి: ఉప్పల పాటి రమణమూర్తిరాజు (కన్నబాబు రాజు)☞ కేసులు: క్రిమినల్ కేసులు లేవు☞ చరాస్తులు: రూ.16.05 కోట్లు☞ స్థిరాస్తి: రూ.20.67☞ అప్పులు: రూ.12.21 కోట్లు☞ భార్య పేరిట చరాస్తులు: రూ.6.39 కోట్లు☞ భార్య పేరిట స్థిరాస్తి: రూ.8.17 కోట్లు☞ భార్య పేరిట అప్పులు: రూ.3.22 కోట్లు➠ ఈయన పేరిట సొంత కారు లేదని అఫిడవిట్‌లో తెలిపారు.

News April 20, 2024

కంగాటి శ్రీదేవి ఆస్తి వివరాలు

image

పత్తికొండ వైసీపీ ఎమ్మల్యే అభ్యర్థి కంగాటి శ్రీదేవి అఫిడవిట్‌లో తన ఆస్తి వివరాలను వెల్లడించారు. 2019లో రూ.3.06 కోట్ల స్థిర, చరాస్తులను చూపిన ఆమె ఈసారి రూ.2.55 కోట్ల సాగుభూమి, రూ.66 లక్షల విలువైన ఇళ్ల స్థలాలు చూపారు. ఆమెకు హైదరాబాద్‌లో ఇల్లు, కర్నూలు, వెల్దుర్తిలో ఇళ్ల స్థలాలు ఉన్నాయి. రూ.3.94 కోట్ల అప్పు చూపారు. తనకు వ్యవసాయం ద్వారా తప్ప వేరే వనరుల ద్వారా ఆదాయం లేదని పేర్కొన్నారు.

News April 20, 2024

ఉషశ్రీ చరణ్ ఆస్తుల వివరాలు

image

ఉషశ్రీ చరణ్‌కు రూ.4.16 కోట్ల చరాస్తులు, రూ.1.54 కోట్ల స్థిరాస్తులున్నాయి. 5.27 కేజీల బంగారం, 78 కిలోల వెండి ఉంది. 2 క్రిమినల్ కేసులున్నాయి. భర్త శ్రీచరణ్ స్థిర,చరాస్తులు రూ.44.93, 1.607 కేజీల బంగారం, 48 కిలోల వెండి, ఓ బస్సు, ఇతర వాహనాలు ఉన్నాయి. 2019 అఫిడవిట్ ప్రకారం ఉష స్థిర,చరాస్తులు రూ.1.52కోట్లు, 4.150 కేజీల బంగారం ఉంది. ఆమె భర్త స్థిర, చరాస్తులు రూ.7.61కోట్లు. 1.5కేజీల బంగారం ఉంది.

News April 20, 2024

ప్రకాశం: నామినేషన్ కార్యక్రమంలో విషాదం.. ఒకరి మృతి

image

యర్రగొండపాలెం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు నామినేషన్ కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన త్రిపురాంతకం మండలం నీళ్ళ గంగవరం గ్రామానికి చెందిన కందుల బాషయ్య (30) అనే వ్యక్తి వడదెబ్బ కారణంగా మృతి చెందాడు. విషయం తెలుసున్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు మృతున్ని సందర్శించి.. కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

News April 20, 2024

గోదావరిలో దూకి 26ఏళ్ల యువతి సూసైడ్

image

కొవ్వూరు రోడ్డు, రైలు వంతెనపై నుంచి గోదావరిలో దూకి యువతి మృతి చెందింది. రాజమండ్రి శాటిలైట్‌ సిటీ ఏరియాకు చెందిన భార్గవి(26) ఓ బ్యాంకులో పనిచేస్తోంది. కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం కోచింగ్ తీసుకుంటోంది. ఈ క్రమంలో గురువారం ఇంటి నుంచి బయల్దేరి వెళ్లిన భార్గవి తిరిగి రాలేదని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోదావరిలో ఎవరో దూకినట్లు సమాచారం అందడంతో గాలింపు చర్యలు చేపట్టగా ఆమె మృతదేహం లభ్యమైంది.

News April 20, 2024

కందుల దుర్గేష్ మాతృమూర్తి కన్నుమూత

image

ఉమ్మడి తూ.గో జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు, నిడదవోలు నియోజవర్గ కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్ మాతృమూర్తి మేడా పద్మావతి(78) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఆమె భౌతికకాయాన్ని రాజమండ్రిలోని జెండా పంజారోడ్డులో ఉన్న స్వగృహానికి తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు. నిడదవోలు టీడీపీ ఇన్‌ఛార్జి బూరుగుపల్లి శేషారావు, తదితరులు దుర్గేష్, ఆయన సోదరుడు గురుదత్త ప్రసాద్‌ను పరామర్శించి సానుభూతి తెలిపారు.

News April 20, 2024

జీవీ ఆంజనేయులు ఆస్తుల వివరాలు ఇవే

image

➤ నియోజకవర్గం: వినుకొండ
➤ అభ్యర్థి: జీవీ ఆంజనేయులు (TDP)
➤ విద్యార్హతలు: BSC
➤ చరాస్తి విలువ: రూ.50,99 లక్షలు
➤ స్థిరాస్తి విలువ: రూ.119.07 కోట్లు
➤అప్పులు: రూ.29.98 కోట్లు
➤ కేసులు: 18 క్రిమినల్ కేసులు ఉన్నాయి.
➤ బంగారం: 5,909 గ్రాములు ఉంది.
NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి