Andhra Pradesh

News April 20, 2024

నెల్లిమర్ల జనసేన అభ్యర్థి ఆస్తి ఎంతంటే..

image

☞ అభ్యర్థి: లోకం నాగమాధవి
☞పార్టీ: జనసేన
☞ విద్యార్హతలు: ఇంజినీరింగ్
☞ కేసులు: లేవు
☞ కుటుంబ ఆస్తి: 894.92 కోట్లు
☞ అప్పులు: లేవు
➠ మాధవి కుటుంబానికి రూ.800 కోట్లకు పైగా విలువైన సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంది.
➠ శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన మధవి అఫిడవిట్‌లో ఈ వివరాలను వెల్లడించారు.

News April 20, 2024

జేసీ అస్మిత్ రెడ్డి ఆస్తుల వివరాలు ఇలా..!

image

తాడిపత్రిలో నామినేషన్ మొదలైన తొలిరోజు పలు పార్టీల అభ్యర్థులు వారి ఆస్తి, విద్యార్హత, కేసుల వివరాల ఆఫిడవిట్ దాఖలు చేశారు. ఆ వివరాలు సంక్షిప్తంగా ఇలా..
అభ్యర్థి : జెసి అస్మిత్ రెడ్డి 
 పార్టీ : టీడీపీ
నియోజకవర్గం: తాడిపత్రి 
విద్యార్హత: ఎంబీఏ, స్కాట్లాండ్ 
కేసులు: 30 
చరాస్తులు : రూ. 27.75కోట్లు
 స్థిరాస్తులు:రూ.147 కోట్లు 
అప్పులు: 26.87 కోట్లు 
బంగారం: 604 గ్రాములు, వజ్రాలు

News April 20, 2024

దువ్వాడ శ్రీనివాస్‌ ఆస్తుల వివరాలు

image

టెక్కలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ క్రిమినల్ కేసులు, తీవ్ర ఆర్థిక నేరారోపణలు ఉన్నాయి. ఒడిశా ప్రభుత్వానికి వ్యాట్, జీఎస్టీ, మైనింగ్ ఛార్జీల కింద రూ.19.03 కోట్ల అప్పులున్నాయి. శ్రీనివాస్ పేరిట రూ.4.41 కోట్లు, భార్య మీద రూ.49 లక్షల చరాస్తులున్నాయి. వీరి స్థిరాస్తుల విలువ రూ.5.50 కోట్లు, రుణం రూ.1.36 కోట్లు. బంగారం 4.6 కిలోలు, వెండి 7.9 కిలోల ఉంది. చేతిలో నగదు రూ.15లక్షలు. *NOTE:ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం.

News April 20, 2024

ముంచంగిపుట్టు: ప్రిన్సిపల్‌కి ఐదేళ్ల జైలు శిక్ష

image

2018లో ముంచంగిపుట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నరసింహమూర్తి ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహించారు. ఆ సమయంలో ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ఆమె జవాబు పత్రాలు మార్చేసి పరీక్షలో ఫెయిల్ అవ్వడానికి కారణమయ్యారు. దీనిపై బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2018లో కేసు నమోదైంది. విచారణ అనంతరం విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు ప్రిన్సిపల్‌కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50వేల జరిమానా విధించింది.

News April 20, 2024

మురుగుడు లావణ్య ఆస్తుల వివరాలు ఇవే

image

➤ నియోజకవర్గం: మంగళగిరి
➤ అభ్యర్థి: మురుగుడు లావణ్య (YCP)
➤ విద్యార్హతలు: BSC
➤ చరాస్తి విలువ: రూ.42.54 లక్షలు
➤ భర్త చరాస్తి విలువ: రూ.85.01 లక్షలు
➤ బంగారం: 450 గ్రాములు, భర్త పేరుతో 100 గ్రాములు
NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి

News April 20, 2024

అద్దంకి వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపిన కన్నడ హీరో

image

ప్రముఖ కన్నడ సినిమా ఇండస్ట్రీ హీరో, దర్శకుడు రాజా రవివీర అద్దంకి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి హనిమిరెడ్డితో శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైసీపీకి తన సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, అద్దంకి గడ్డపై హనిమిరెడ్డి ప్రభంజనాన్ని చూపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

News April 20, 2024

ఉండి MLA రామరాజుకు CBN నుంచి పిలుపు

image

ఉమ్మడి ప.గో.లో ‘ఉండి’ హాట్ టాపిక్‌గా మారింది. ఓ వైపు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా.. ఇక్కడ టీడీపీ టికెట్‌పై మాత్రం క్లారిటీ రావడం లేదు. ఉండిలో ఎంపీ రఘురామ తరఫున శుక్రవారం నామినేషన్ దాఖలు కాగా.. రామరాజు 22న నామినేషన్ వేస్తానని ప్రకటించారు. నిన్న కేడర్ రామరాజు సమావేశం కాగా.. అంతలోనే చంద్రబాబు నుంచి ఫోన్ వచ్చిందని, శనివారం ఆయనను కలిసిన తర్వాత నిర్ణయం వెల్లడిస్తానని రామరాజు నేతలకు తెలిపారు.

News April 20, 2024

అనంత: 21న నీట్, ఐఐటీ అకాడమీల్లో ప్రవేశ పరీక్ష

image

సాంఘిక సంక్షేమ అంబేడ్కర్
గురుకులాల ప్రవేశ పరీక్షలో ప్రతిభను కనబరిచిన విద్యార్థులు రెండో విడతలో నీట్, ఐఐటీ అకాడమీల్లో ప్రవేశానికి ఈనెల 21న నిర్వహించనున్న పరీక్షకు హాజరు కావాలని ఉమ్మడి జిల్లా గురుకుల విద్యాలయాల సమన్వయకర్త ఎ.మురళీకృష్ణ తెలిపారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు పరీక్ష కేంద్రానికి గుర్తింపు కార్డు లేదా ఆధార్‌తో హాజరు కావాలన్నారు. ఉదయం 10 నుంచి పరీక్ష కురుగుంట గురుకులంలో జరుగుతుందన్నారు.

News April 20, 2024

వైభవంగా సింహాద్రి అప్పన్న వార్షిక కళ్యాణం

image

సింహాచలం ఆలయంలో సింహాద్రి అప్పన్న వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అప్పన్నవరుడిగా శ్రీదేవి భూదేవి వధువుగా దర్శనమిచ్చారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి కళ్యాణాన్ని జరిపించారు. ఎదురు సన్నాయి ఉత్సవాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఆలయ ఛైర్మన్ అశోక్ గజపతిరాజు పాల్గొన్నారు.

News April 20, 2024

అంగరంగ వైభవంగా సింహాద్రి అప్పన్న వార్షిక కళ్యాణం

image

సింహాచలం ఆలయంలో సింహాద్రి అప్పన్న వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అప్పన్న పెండ్లి కుమారుడిగా శ్రీదేవి భూదేవి పెళ్లి కుమార్తెలుగా దర్శనమిచ్చారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి కళ్యాణాన్ని జరిపించారు. ఎదురు సన్నాయి ఉత్సవాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఆలయ చైర్మన్ అశోక్ గజపతిరాజు పాల్గొన్నారు.