Andhra Pradesh

News April 20, 2024

కోటంరెడ్డి ఆస్తులు రూ.2.45 కోట్లు

image

➤ నియోజకవర్గం: నెల్లూరు రూరల్
➤ అభ్యర్థి: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(టీడీపీ)
➤ విద్యార్హత: డిగ్రీ డిస్ కంటిన్యూ
➤ ఆస్తుల విలువ: రూ.1.20 కోట్లు
➤ కుటుంబ ఆస్తి: రూ.2.45 కోట్లు
➤ అప్పులు: రూ.16.90 లక్షలు
➤ వృత్తి : రియల్ ఎస్టేట్
➤ వాహనాలు: 2 (ఫార్చూనర్, ఇన్నోవా)
➤ కేసులు: 4 (ఒకటి బెట్టింగ్ కేసు)
NOTE: ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం .

News April 20, 2024

అనంత: నాడు ప్రత్యర్థులు.. నేడు సన్నిహితులు

image

హిందూపురం నియోజకవర్గంలో 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఉన్న ఇక్బాల్, నందమూరి బాలకృష్ణ 2024 ఎన్నికల్లో స్నేహితులయ్యారు. గత ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణకు ప్రత్యర్థిగా వైసీపీ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం వైసీపీని వీడి టీడీపీలో చేరి ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు ప్రచారాల్లో పాల్గొననున్నారు.

News April 20, 2024

YS అవినాష్ రెడ్డి అప్పు రూ.9.11 కోట్లు

image

➤ పార్లమెంట్ స్థానం: కడప
➤విద్యార్హత: MBA
➤ ఆస్తి విలువ: రూ.25.51 కోట్లు
➤ అప్పులు: రూ.9.11 కోట్లు
➤ భార్య పేరిట ఆస్తి విలువ: రూ.7.34 కోట్లు
➤ భార్యకు ఉన్న భూమి: 33.90 ఎకరాలు
➤ బంగారం: అవినాష్ దగ్గర 355 గ్రాములు, భార్య దగ్గర 1,310 గ్రాములు
➤ కేసులు: 3

News April 20, 2024

ఐదేళ్లలో పెరిగిన రోజా ఆస్తులు

image

గత ఐదేళ్లలో మంత్రి రోజా ఆస్తులు పెరిగాయి. 2019లో ఆమె చరాస్థులు రూ.2.74 కోట్లు కాగా ఇప్పుడు రూ.4.58 కోట్లయ్యాయి. స్థిరాస్తులు రూ.4.64కోట్లు ఉండగా రూ.6.05 కోట్లకు చేరాయి. 2019లో ఆరు కార్లు, ఓ బైకు ఉండగా.. ఇప్పుడు 9 కార్లు ఉన్నాయి. నగరి నియోజకవర్గంలో భర్త పేరుపై 6.39 ఎకరాలు కొన్నారు. కేసులు లేవు, ఆమె దగ్గర 986 గ్రాములు, భర్త దగ్గర 485 గ్రాముల బంగారం ఉంది. అప్పులు రూ.1.66 కోట్లుగా అఫిడవిట్‌లో చూపారు.

News April 20, 2024

నంద్యాల: నాడు ప్రత్యర్ధులు.. నేడు మిత్రులు

image

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు.. తాత్కాలికమే అనే వ్యాఖ్యకు ఈ చిత్రం దర్శనం ఇస్తుంది. రెండు దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్ధులు ఒక్కటాయిన దృశ్యం ఇది. శ్రీశైలం నియోజకవర్గంలో బుడ్డా, ఏరాసు కుటుంబాల మధ్య రాజకీయ పోరు నడిచింది. 1994లో బుడ్డావెంగళరెడ్డి ఏరాసు ప్రతాప్ రెడ్డి పోటీ ప్రారంభమైంది. 1999, 2004, 2009లో పోటీపడ్డగా 3సార్లు కాంగ్రెస్ తరపున ఏరాసు ప్రతాప్‌రెడ్డి గెలుపొందారు.

News April 20, 2024

విశాఖ: జగన్ బస్సుయాత్ర షెడ్యూల్ ఇదే

image

సీఎం జగన్ బస్సు యాత్ర షెడ్యూల్‌ని వైసీపీ నేతలు విడుదల చేశారు. ఈరోజు ఉ.9 గంటలకు గొడిచర్ల రాత్రి బస నుంచి బయలుదేరి నక్కపల్లి, యలమంచిలి బైపాస్ మీదుగా అచ్యుతాపురం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం నరసింగపల్లి మీదుగా సా.3:30 గంటలకు చింతపాలెం వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం అనకాపల్లి బైపాస్, అస్కపల్లి మీదుగా చిన్నయపాలెం రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.

News April 20, 2024

కొడాలి నాని నామినేషన్ తేదీల్లో మార్పులు 

image

ఈనెల 22వ తేదీ జరగాల్సిన ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల నామినేషన్ అనివార్య కారణాల వల్ల 25వ తేదీకి మారిందని గుడివాడ వైసీపీ కార్యాలయం తెలిపింది. యథావిధిగా ఈ నెల 25వ తేదీ గురువారం ఉదయం 9 గంటలకు రాజేంద్రనగర్‌లోని ఇంటి వద్ద నుంచి ర్యాలీగా ప్రారంభం అవుతుందని తెలిపారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి వైసీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్ని విజయవంతం చేయాలని పార్టీ నేత లు కోరారు. 

News April 20, 2024

గుంటూరులో నామినేషన్ వేసిన అభ్యర్థులు వీరే

image

గుంటూరు ఈస్ట్ అసెంబ్లీ స్థానానికి శుక్రవారం పలువురు నామినేషన్ దాఖలు చేశారు. షేక్ నూరి ఫాతిమా(YCP), గూడవల్లి మణికుమారి (బహుజన్ సమాజ్ పార్టీ), షేక్ రజాక్ (నవతరం పార్టీ), షేక్ దుర్రే షహవర్ (స్వతంత్ర), కాజా రాఘవేంద్ర సంజీవరావు (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా). గుంటూరు పార్లమెంట్ స్థానానికి కిలారి రోశయ్య (వైసీపీ), షేక్ అస్లాం అక్తర్(స్వతంత్ర), అక్కిశెట్టి శ్రీకృష్ణ (స్వంతత్ర) అభ్యర్థులుగా నామినేషన్ వేశారు.

News April 20, 2024

కోడ్ ఉల్లంఘనపై 532 ఫిర్యాదులు: కడప కలెక్టర్

image

జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై 535 ఫిర్యాదులు అందాయని కలెక్టర్ విజయరామరాజు అన్నారు. 532 ఫిర్యాదులకు పరిష్కారం అందించామన్నారు సీ.విజిల్ ద్వారా మొత్తం 336 కేసులు నమోదు కాగా, అందులో 203 నిజనిర్ధారణ కాగా, 133 నిరాధారమైనవని గుర్తింమన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,011 ఎఫ్.ఐ.ఆర్. కేసులు నమోదు చేశామన్నారు.

News April 20, 2024

అనుమతి లేకుండా రాజకీయ ప్రకటనలొద్దు: కలెక్టర్

image

ఎంసీఎంసీ కమిటీల ముందస్తు అనుమతి లేకుండా ప్రింట్ మీడియాలో ఎలాంటి రాజకీయ ప్రకటనలను ప్రచురించకూడదని ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. గతంలో పలు సందర్భాల్లో ప్రింట్ మీడియాలో అభ్యంతరకరమైన, తప్పుదారి పట్టించే ప్రకటనలు ప్రచురితమైనట్లు ఎలక్షన్ కమిషన్ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టామన్నారు.