India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదని, జిల్లాకు సరిపడా యూరియా ఇప్పటికే అందుబాటులో ఉందని కలెక్టర్ అంబేడ్కర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు 36 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా 32 వేల మెట్రిక్ టన్నుల వరకు పంపిణీ చేశామన్నారు. మరో 3 వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని తెలిపారు. భవిష్యత్తు అవసరాల కోసం రైతులే నిల్వ చేస్తున్నట్లు తెలుస్తోందన్నారు.
P4 మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ మార్గదర్శిలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో పీ4 కార్యక్రమం పురోగతిపై నియోజకవర్గాల ప్రత్యేక అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుతం 53,759 పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా గుర్తించామని, వాటిలో 48,549 కుటుంబాలను 4,294 మంది మార్గదర్శిలకు దత్తత ఇచ్చేలా అనుసంధానం చేశామన్నారు.
జిల్లాలో సోమవారం 5,616 స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశామని జేసీ మయూర్ అశోక్ తెలిపారు. ఈనెల 31 వరకు సచివాలయాల సిబ్బంది ద్వారా స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు ఇంటి వద్దనే పంపిణీ చేస్తామన్నారు. సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు సంబంధిత రేషన్ దుకాణాల వద్ద పంపిణీ చేస్తామన్నారు. పాత బియ్యం కార్డు, ఆధార్ అనుసంధానమైన మొబైల్ నంబరుతో సచివాలయ సిబ్బంది నుంచి స్మార్ట్ కార్డులు తీసుకోవాలన్నారు.
నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను కలెక్టర్ ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు బొకే అందించి స్వాగతం పలికారు. జిల్లాలో నెలకొన్న పలు రెవెన్యూ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం టీడీపీ నేత గిరిధర్ రెడ్డి ఆయన్ను కలిశారు.
ఫోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.7వేల జరిమానాను విధిస్తూ ఒంగోలు ఫోక్సో కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. నిందితుడికి జైలు శిక్ష ఖరారుకావడంలో సరైన ఆధారాలు ప్రవేశపెట్టిన పోలీసులను ఎస్పీ దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు. హనుమంతునిపాడు మండలానికి చెందిన ఓ వ్యక్తి, 2000 సంలో మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీనితో కేసు నమోదు కాగా, సదరు వ్యక్తికి మూడేళ్ల శిక్ష ఖరారైంది.
భూగర్భ జలవనరులను పెంపొందించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఇందుకోసం జలవనరులు, గ్రామీణ నీటిపారుదల, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ శాఖల సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాలని ఆమె ఆదేశించారు. సోమవారం భూగర్భ జలవనరుల పరిరక్షణ, ఈపీటీఎస్, స్వామిత్వా, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కార్యక్రమాలపై మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ప్రకాశం జిల్లాలో నేటి నుంచి సెప్టెంబర్ 8 వరకు జరుగు నేత్రదాన పక్షోత్సవాలను జయప్రదం చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో 40 జాతీయ పక్షోత్సవాల కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. నేత్రదానం చేయండి.. ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించండి అనే నినాదంతో కార్యక్రమం నిర్వహించాలన్నారు. మరణానంతరం 6-8 గంటల్లో నేత్రదానం చేయవచ్చని కలెక్టర్ తెలిపారు.
తెనాలిలోని మల్లెపాడుకు చెందిన శతాధిక వృద్ధుడు భూషయ్య దీనావస్థలో కాలం వెళ్లదీస్తున్నాడు. వ్యవసాయం చేస్తూ ముగ్గురు పిల్లలను పెంచి ప్రయోజకులను చేసిన ఈయన, ప్రస్తుతం వారి ఆదరణకు నోచుకోక జీవచ్ఛవంలా బతుకుతున్నారు. ఆలపాటి ధర్మారావు హయాంలో యడ్లపల్లి పంచాయతీ మెంబరుగా పనిచేశారు. భూషయ్యకు వేలిముద్రలు పడకపోవడం వల్ల పింఛను కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ మీకోసం కార్యక్రమానికి 80 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటించింది. జిల్లా ఎస్పీ దామోదర్ మీకోసం కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదుదారుల సమస్యలను, ఫిర్యాదులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ అధికారులకు వెంటనే ఫిర్యాదులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రభుత్వ ఉద్యోగం పేరిట ఓ వ్యక్తి తమను మోసంచేసినట్లు పలువురు బాధితులు సోమవారం జిల్లా ఎస్పీ దామోదర్‌కు ఫిర్యాదు చేశారు. కొనకనమిట్లలో గల ఒక ప్రైవేటు ఏజెన్సీలో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగమని నమ్మించి, రూ.5 లక్షలు తీసుకొని మోసం చేసినట్లు బాధితులు వాపోయారు. 16 నెలలపాటు పనిచేసిన తర్వాత ఉద్యోగం తొలగించారని, ప్రభుత్వ ఉద్యోగమని నమ్మి తాము మోసపోయామని, న్యాయం చేయాలని వారు కోరారు.
Sorry, no posts matched your criteria.