Andhra Pradesh

News April 20, 2024

విజయవాడ: పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లా స్థాయి ఫుట్ బాల్ పోటీలు

image

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల క్రీడా మైదానంలో ఏప్రిల్ 21న ఆదివారం హంటింగ్ టైగర్స్ ఫుట్బాల్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అండర్ 14 బాలుర ఫుట్బాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శివప్రసాద్ నాయక్ శుక్రవారం తెలిపారు. ఈ పోటీలకు జిల్లాలో ఆసక్తిగలవారు ఎవరైనా జట్టుగా వచ్చి పోటీ చేయవచ్చని అన్నారు. ఈ పోటీలు ఉదయం 6 గంటలకు మొదలవుతాయని అదే రోజు సాయంత్రం విజేతలకు బహుమతులు కూడా అందజేస్తామన్నారు.

News April 19, 2024

గుంటూరులో రోడ్డు ప్రమాదం.. స్పాట్ డెడ్

image

గుంటూరులో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గుజ్జనగుండ్ల సెంటర్ నుంచి పలకలూరు వెళ్లే రోడ్డులో శుక్రవారం రాత్రి ఒక కారు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించామని చెప్పారు. అనంతరం ఘటపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 19, 2024

అక్రమ రవాణాపై ఉక్కు పాదం: నెల్లూరు ఎస్పీ

image

ఎన్నికల నేపథ్యంలో అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టినట్లు నెల్లూరు ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వాహన తనిఖీల్లో భాగంగా కావలి వన్ టౌన్ పరిధిలో రూ.4లక్షలు, బాలాజీ నగర్‌లో 2లక్షల 13 వేల నగదుతో పాటు 655 టీ కప్ సెట్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేపీ పోర్ట్ పరిధిలో పేకాట ఆడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రూ.4,500 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు.

News April 19, 2024

బాలికపై అఘాయిత్యం.. వృద్ధుడికి జీవిత ఖైదు

image

ఏలూరు జిల్లా పోక్సో కోర్టు శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. గోపాలపురం మండలం పెద్దగూడెంకు చెందిన సంపత్‌రావు(81) అనే వృద్ధుడు 2017లో ఆరేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేరం రుజువు కావడంతో పోక్సో కోర్టు అతడికి జీవిత ఖైదుతో పాటు రూ.1000 జరిమానా విధించిందని, బాలికకు రూ.2,50,000 పరిహారం చెల్లించాలని ఆదేశించిందని పోలీసులు పేర్కొన్నారు.

News April 19, 2024

విజయనగరం: లారీ ఢీకొని ఒకరు మృతి

image

పూసపాటిరేగ మండలంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కందివలస సంత వద్ద శ్రీకాకుళం నుంచి వైజాగ్ వెళ్తున్న లారీ ఢీకొని రెల్లివలస గ్రామానికి చెందిన పతివాడ అప్పయ్యమ్మ (62) అక్కడక్కడ స్పాట్‌లో మృతి చెందింది. పూసపాటిరేగ ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 19, 2024

సత్యసాయి జిల్లాలో 16 మంది నామినేషన్ల దాఖలు

image

శ్రీ సత్య సాయి జిల్లాలోని రాప్తాడు, మడకశిర, హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి నియోజకవర్గాల నుంచి 16మంది నామినేషన్లు వేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి అరుణ్ బాబు పేర్కొన్నారు. రాప్తాడు నుంచి ముగ్గురు, మడకశిర నుంచి ఒకరు, హిందూపురం నుంచి ఇద్దరు, పెనుకొండ నుంచి ఇద్దరు, పుట్టపర్తి నుంచి నలుగురు, ధర్మవరం నుంచి ఒకరు, కదిరి నుంచి ముగ్గురు నామినేషన్లు వేసినట్టు కలెక్టర్ పేర్కొన్నారు.

News April 19, 2024

రామసముద్రం: కూలీల ఆటోను ఢీకొన్న కారు

image

రామసముద్రం మండలంలో కారు ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో 14మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. రామసముద్రం ఎస్సై చంద్రశేఖర్ కథనం.. సింగిరిగుంటకు చెందిన కూలీల ఆటోలో రామసముద్రం మండలం, మినికికు కూలి పనులు చేయడానికి బయలుదేరారు. మినికి వద్ద ఆటోను వెనుకనుంచి వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో 12మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 19, 2024

శ్రీకాకుళం జిల్లాలో రెండో రోజు అసెంబ్లీ నామినేషన్లు వేసింది వీరే..

image

➤ శ్రీకాకుళం: BCYP అభ్యర్థిగా P.ప్రసాద్
➤ పలాస:TDP అభ్యర్థులుగా G.శిరీష, INCP అభ్యర్థిగా M.త్రినాధ్ బాబు
➤ ఎచ్చెర్ల: YCPఅభ్యర్థిగా G.కిరణ్ కుమార్, BSP అభ్యర్థిగా G.రామారావు
➤టెక్కలి: INCP అభ్యర్థిగా K.కృపారాణి, YCP D.శ్రీనివాస్,
➤పాతపట్నం:TDP అభ్యర్థిగా మామిడి గోవిందరావు, ➤ఆమదాలవలస:TDP అభ్యర్థిగా K. రవికుమార్ నామినేషన్లు వేశారు.

News April 19, 2024

YVU: రేపటి నుంచే డిగ్రీ పరీక్షలు

image

యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోని బీఎస్సీ, బిఏ, బీకాం, బి.బి.ఏ, బి.సి.ఎ, ఒకేషనల్ 1,2,4,6 సెమిస్టర్ల పరీక్షలు శనివారం నుంచి జిల్లాలోని 57 కేంద్రాలలో ప్రారంభమవుతున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొ. ఎన్ ఈశ్వర్ రెడ్డి తెలిపార. మట్లాడుతూ.. 31,830 మంది విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయన్నారు. విద్యార్థులు సంబంధిత కళాశాల నుంచి హాల్ టికెట్లు పొందాలన్నారు. 

News April 19, 2024

విజయనగరం జిల్లా వ్య‌య‌ ప‌రిశీల‌కుల నంబ‌ర్లు ఇవే

image

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో వ్య‌య ప‌రిశీల‌కులు సెల్ నంబ‌ర్ల‌ను జిల్లా యంత్రాంగం ప్ర‌క‌టించింది.
➤ ప్ర‌భాక‌ర్ ప్ర‌కాష్ రంజ‌న్ (విజ‌య‌న‌గ‌రం పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం): 9030311714
➤ఆనంద్‌కుమార్ (రాజాం, బొబ్బిలి, చీపురుప‌ల్లి, గ‌జ‌ప‌తిన‌గ‌రం): 9959211714
➤ఆకాష్ దీప్ (నెల్లిమ‌ర్ల‌, విజ‌య‌న‌గ‌రం, శృంగ‌వ‌ర‌పుకోట‌): 9963411714