Andhra Pradesh

News April 19, 2024

జనసేన అమలాపురం పార్లమెంట్ ఇన్‌ఛార్జి రాజీనామా

image

అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి డీఎంఆర్ శేఖర్ శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజమహేంద్రవరంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో రాజీనామా పత్రాన్ని శేఖర్ విడుదల చేశారు. 2019 నుంచి తాను జనసేన పార్టీలో సిన్సియర్ కార్యకర్తగా పని చేశానన్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయాల పట్ల తీవ్ర అసంతృప్తితో రాజీనామా చేశానని లేఖలో స్పష్టం చేశారు. అమలాపురం జనసేన టికెట్‌ను శేఖర్ ఆశించారు.

News April 19, 2024

గుంటూరు: ఇప్పటి వరకు రూ.2,24,28,410 సీజ్

image

జిల్లాలో శుక్రవారం ప్లయింగ్ స్క్వాడ్ నిర్వహించిన తనిఖీలలో మంగళగిరి నియోజకవర్గ పరిధిలో రూ.3,20,700లు, తాడికొండ నియోజకవర్గ పరిధిలో రూ.1.91లక్షల నగదు పట్టుబడింది. గుంటూరు పశ్చిమలో 2,280 విలువ గల 3.06లీటర్ల లిక్కర్‌ని స్వాధీనం చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో జరిగిన తనిఖీలలో శుక్రవారం వరకు రూ.2,24,28,410ల నగదు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

News April 19, 2024

వర్షపు నీటిని సంరక్షించుకోవాలి: శివశంకర్‌‌

image

రానున్న సౌత్ వెస్ట్ మాన్సూన్ నాటికి వచ్చే వర్షం నీటిని ఫామ్ పాండ్‌లో ఒడిసి పట్టడంలో చర్యలు చేపట్టాలని కలెక్టర్ శివశంకర్‌‌లో మండల పరిషత్ అభివృద్ధి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంపై మండల అభివృద్ధి అధికారులతో కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంటో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News April 19, 2024

R.K బీచ్‌లో గుర్తు తెలియని మృతదేహం

image

విశాఖ ఆర్.కె బీచ్ నోవాటెల్ ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని మహారాణిపేట పోలీసులు శుక్రవారం గుర్తించారు. మృతుడు సర్ఫ్ కలర్ షర్ట్, బ్లూ కలర్ జీన్ పాంట్ వేసుకున్నాడని, వయసు 55 సంవత్సరాలు ఉండొచ్చని అంచనా వేశారు. మృతుని వివరాలు తెలిసిన వారు మహారాణిపేట పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు. మహారాణిపేట సీఐ, ఎస్.ఐ నెంబర్లు 94407 96010, 94407 96052కు సమాచారం ఇవ్వాలన్నారు.

News April 19, 2024

కుంభోత్సవం “క్షేత్ర రక్షణ” కోసం నిర్వహించే ఉత్సవం : ఈవో

image

శ్రీశైల క్షేత్రంలో ఏప్రిల్ 26న కుంభోత్సవం నిర్వహిస్తున్నట్లు, ఈ కుంభోత్సవం “క్షేత్ర రక్షణ” కోసం నిర్వహించే ఉత్సవం అని ఈవో పెద్దిరాజు పేర్కొన్నారు. కుంభోత్సవ నిర్వహణ ఏర్పాట్లపై స్థానిక రెవెన్యూ, పోలీస్, దేవస్థాన శాఖాధిపతులు, అన్ని విభాగాల పర్యవేక్షకులు, దేవస్థాన వైదిక సిబ్బంది తదితర అధికారులతో శుక్రవారం ఆయన సమన్వయ సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలను చర్చించారు.

News April 19, 2024

ఎంపీ RRR తరుఫున సతీమణి, కొడుకు నామినేషన్

image

ఉండి నియోజకవర్గ MLA అభ్యర్థిగా ఎంపీ రఘురామకృష్ణరాజు తరుఫున నామినేషన్ దాఖలు చేశారు. RRR సతీమణి రమాదేవి ఉండి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రవీణ్ ఆదిత్యకు ఈరోజు ఒక సెట్ నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆమె వెంట రఘురామకృష్ణరాజు తనయుడు భరత్, తదితరులు ఉన్నారు. రఘురామకు ఎక్కడి టికెట్ కేటాయిస్తారనే దానిపై ఉత్కంఠ వీడకపోవడంతో ఆయన తన సతీమణి, కుమారుడితో నామినేషన్ దాఖలు చేయించినట్లు తెలుస్తోంది.

News April 19, 2024

విజయనగరం: ఊపందుకున్న నామినేషన్లు

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలో నామినేష‌న్ల ప‌ర్వం ఊపందుకుంది. రెండో రోజు విజ‌య‌న‌గ‌రం ఎంపీ స్థానానికి 6, అసెంబ్లీ స్థానాల‌కు 31 నామినేష‌న్లు దాఖ‌ల‌య్యాయి. విజయనగరం-4, గజపతినగరం-8, చీపురుపల్లి-3, ఎస్.కోట-4, నెల్లిమర్ల-6, బొబ్బిలి-6 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారులు తెలిపారు. అటు మన్యం జిల్లాలో అరకు ఎంపీ స్థానానికి 4, కురుపాం-1, సాలూరు-2, పార్వతీపురం-2 నామినేషన్లు దాఖలయ్యాయి.

News April 19, 2024

ఎంపీ RRR తరుఫున సతీమణి, కొడుకు నామినేషన్

image

ఉండి నియోజకవర్గ MLA అభ్యర్థిగా ఎంపీ రఘురామకృష్ణరాజు తరుఫున నామినేషన్ దాఖలు చేశారు. RRR సతీమణి రమాదేవి ఉండి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రవీణ్ ఆదిత్యకు ఈరోజు ఒక సెట్ నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆమె వెంట రఘురామకృష్ణరాజు తనయుడు భరత్, తదితరులు ఉన్నారు. రఘురామకు ఎక్కడి టికెట్ కేటాయిస్తారనే దానిపై ఉత్కంఠ వీడకపోవడంతో ఆయన తన సతీమణి, కుమారుడితో నామినేషన్ దాఖలు చేయించినట్లు తెలుస్తోంది.

News April 19, 2024

నంద్యాల: జిల్లాలో రెండో రోజు ఆరుగురు నామినేషన్లు

image

నామినేషన్లలో భాగంగా రెండో రోజైన శుక్రవారం జిల్లాలోని శ్రీశైలం, నందికొట్కూరు, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆరుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. అందుకు సంబంధించిన పత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారని జిల్లా ఎన్నికల అధికారి, డా.కె. శ్రీనివాసులు శుక్రవారం తెలిపారు. నంద్యాల పార్లమెంట్, ఆళ్లగడ్డ, డోన్, బనగానపల్లె అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులు ఎవరు వేయలేదని తెలిపారు.

News April 19, 2024

రాజాంలో ప్రచారరథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు

image

రాజాం పట్టణంలో వైసీపీ ప్రచారరథం ఢీకొని భరద్వాజ్(10) అనే బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రచార రథాన్ని నడిపిన నిర్లక్ష్యం నడిపి.. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ అందించలేని వైసీపీ పాలనా నిర్లక్ష్యం మరొకటని మండిపడ్డారు. భరద్వాజ్ కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.