Andhra Pradesh

News April 19, 2024

ఒంటిమిట్ట: రాములోరి కళ్యాణానికి 1.20 ల‌క్ష‌ల లడ్డూలు

image

ఒంటిమిట్ట శ్రీ సీతారాముల‌ కళ్యాణానికి వచ్చే భ‌క్తుల‌కు అందించేందుకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు సిద్ధమయ్యాయి. ఏప్రిల్ 22వ తేదీ సాయంత్రం 6.30 నుంచి 8.30 గంటల మధ్య అత్యంత వైభ‌వంగా శ్రీ సీతారాముల‌ కళ్యాణంలో పాల్గొనే భక్తులకు ఈ లడ్డూలను అందజేయనున్నారు. దాదాపు 250 మంది శ్రీ‌వారి సేవ‌కులు 1.20 ల‌క్ష‌ల లడ్డూలను సిద్ధం చేశారు. 

News April 19, 2024

విజయనగరం: కడుపునొప్పి తాళలేక యువకుడి మృతి

image

కడుపునొప్పి తాళలేక బాడంగి మండలం అనవరం గ్రామానికి చెందిన తూముల విజయకుమార్(23) గత మూడు సంవత్సరాల నుంచి కడుపునొప్పితో బాధపడుతున్నాడు. జీవితం విరక్తిచెంది గ్రామ సమీపంలో అరటితోట పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు మెరుగైన వైద్య చికిత్సకోసం విజయనగరం సర్వజన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై జయంతి కేసును దర్యాప్తు చేస్తున్నారు.

News April 19, 2024

నరసాపురం పార్లమెంట్ పరిధిలో 6 సెట్ల నామినేషన్లు

image

నరసాపురం పార్లమెంట్ (09) పరిధిలో 2వ రోజు నలుగురు అభ్యర్థులు 6 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. YCP తరఫున గూడూరి ఉమా బాల 2 సెట్లు, YCP తరపు గూడూరి జగదీష్ కుమార్ 1 సెట్, స్వతంత్ర అభ్యర్థిగా మహబూబాబాద్‌కు చెందిన గోటేటి లక్ష్మీ నరసింహారావు 2 సెట్లు, స్వతంత్ర అభ్యర్థిగా తణుకుకు చెందిన ఉందుర్తి  ప్రసన్నకుమార్ 1 సెట్ నామినేషన్ దాఖలు చేశారన్నారు.

News April 19, 2024

ఆర్థిక లావాదేవీలపై పటిష్ట నిఘా ఉంచాలి: కలెక్టర్

image

ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆర్థిక లావాదేవీలు, ఖర్చులు, ఇతర వ్యయాలపై పటిష్ట నిఘా ఉంచాలని జిల్లా అధికారులను రాష్ట్ర వ్యయ పరిశీలకులు నీనా నిగం ఆదేశించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని సూచించారు. ఆర్థిక లావాదేవీలు, నగదు బట్వాడా, బహుమతులు, ఇతర వస్తువులు తరలింపు, మద్యం రవాణా తదితర అంశాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. జిల్లాలో చేపట్టిన చర్యలను కలెక్టర్ వివరించారు.

News April 19, 2024

పల్నాడు జిల్లా వైసీపీ ఎస్సీ సెల్ జాయింట్ సెక్రటరీగా డేగల

image

పల్నాడు జిల్లా వైసీపీ ఎస్సీ సెల్ జాయింట్ సెక్రటరీగా రెంటచింతల మండలానికి చెందిన డేగల మహేశ్‌ను నిమితులయ్యారు. ఈ మేరకు నియామక ఉత్తర్వులను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్లలోని కార్యాలయంలో శుక్రవాం మహేశ్‌కు అందజేశారు. మహేశ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి జిల్లా పదవి బాధ్యతలు అప్పగించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

News April 19, 2024

అరకు ఎంపీ స్థానానికి నలుగురు నామినేషన్

image

అరకు పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నిశాంత్ కుమార్‌కు శుక్రవారం నలుగురు ఎంపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు పత్రాలను అందజేశారు. వీరిలో నిమ్మక జయరాజు, పాలక రంజిత్ కుమార్ ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయగా.. పాచిపెంట అప్పలనరస సీపీఐ(M) నుంచి అభ్యర్థి నామినేషన్ వేయగా, వైసీపీ అభ్యర్థి గుమ్మ తనూజా రాణి కూడా నామినేషన్ దాఖలు చేశారు.

News April 19, 2024

ఏలూరులో మే 13న దుకాణాలు బంద్: శ్రీనివాస్

image

పోలింగ్ దృష్ట్యా ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 సెక్షన్ 135B (1) ప్రకారం ఏపీ దుకాణములు, సంస్థల చట్టం-1988 సెక్షన్ 31(2) ప్రకారం మే 13న దుకాణాలు, సంస్థలకు సెలవు ప్రకటించినట్లు ఏలూరు ఉప కార్మిక కమిషనర్ పి.శ్రీనివాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పై నిబంధన జిల్లాలోని వ్యాపారులు అందరూ తప్పనిసరిగా పాటించాలని కోరారు. అతిక్రమించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. SHARE IT..

News April 19, 2024

గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి షాక్

image

గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం పార్టీకి గ‌ట్టి షాక్ త‌గిలింది. ఆ పార్టీకి చెందిన ప‌లువురు కీల‌క నేత‌లు శుక్ర‌వారం రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఆధ్వ‌ర్యంలో, ముఖ్య‌మంత్రి జగన్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరారు.ఈ సందర్భంగా వారిని సీఎం జ‌గ‌న్ ఆప్యాయంగా ప‌లక‌రించి, వైసీపీ కండువాలు క‌ప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

News April 19, 2024

ఈనెల 30న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం

image

ఈనెల 30వ తేదీన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి ఎం.పోలినాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున, ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి ఆరోజు మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన, జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఈ సమావేశం నిర్వహించబడుతుందని వెల్లడించారు.

News April 19, 2024

కర్నూలు టీడీపీ అభ్యర్థి ఆస్తుల విలువ ఎంతంటే..?

image

కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బస్తిపాడు నాగరాజు, ఆయన భార్య జయసుధ గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. నాగరాజు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన
అఫిడవిట్‌లో తన చర, స్థిరాస్తుల వివరాలను ప్రకటించారు. తనకు, తన భార్యకు కలిపి మొత్తం రూ.8,54,79,900 స్థిర, చరాస్తులు ఉన్నాయని
అఫిడవిట్‌లో పేర్కొన్నారు.