Andhra Pradesh

News April 19, 2024

విశాఖ: మే 11న జాతీయ లోక్ అదాలత్

image

విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మే 11న జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. ఈ లోక్ ఆదాలత్‌లో జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సివిల్, క్రిమినల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్టపరిహారాలు కేసులను పరిష్కరించుకోవచ్చు. పారిశ్రామిక వివాదాలు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు పరిష్కరించుకోవచ్చు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News April 19, 2024

ముఖ్య మంత్రులను అందించిన డోన్ గడ్డ

image

డోన్ రాష్ట్ర రాజకీయాల కేంద్ర బిందువుగా ఉన్న డోన్ గడ్డ ఇద్దరు ముఖ్యమంత్రులను అందించింది. 1952 సంవత్సరంలో డోన్ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నీల సంజీవ రెడ్డి గెలుపొంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా డోన్ నుంచి ఎన్నికైన నీల సంజీవరెడ్డి పనిచేశారు. అలాగే 1994 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం హోదాలో డోన్ నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి బుగ్గన డోన్ ఎమ్మెల్యే

News April 19, 2024

విశాఖ: సంబల్ పూర్-ఈరోడ్డు మధ్య ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీన్ దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైలు నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డిసిఎం ఏ.కే.త్రిపాఠి తెలిపారు. సంబల్పూర్-ఈరోడ్డు ప్రత్యేక రైలు మే 1 నుంచి జూన్ 26 వరకు ప్రతి బుధవారం దువ్వాడ మీదుగా నడపనున్నట్లు పేర్కొన్నారు. అలాగే మే 3వ తేదీ నుంచి నుంచి జూన్ 28 వరకు ప్రతి శుక్రవారం ఈరోడ్డు నుంచి దువ్వాడ మీదుగా సంబల్పూర్ నడపనున్నట్లు పేర్కొన్నారు.

News April 19, 2024

దాచేపల్లి వద్ద వ్యక్తి మృతదేహం లభ్యం

image

దాచేపల్లి మండల పరిధిలోని నాయుడుపేట సమీపంలో శుక్రవారం గుర్తు వ్యక్తి తెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు వడ్డెర కాలనీకి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. మృతుడి వయసు సుమారు 30 సంవత్సరాలు ఉంటుందన్నారు. హత్యా? లేక ఆత్మహత్యా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News April 19, 2024

అనంతపురం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌‌గా వినూత్న

image

అనంతపురం జిల్లా నూతన అసిస్టెంట్ కలెక్టర్‌గా బొల్లిపల్లి వినూత్న శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ కార్యాలయంలోని అసిస్టెంట్ కలెక్టర్ ఛాంబర్‌లో వినూత్న బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం వినూత్న కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ అసిస్టెంట్ కలెక్టర్ వినూత్నకు శుభాకాంక్షలు తెలిపారు.

News April 19, 2024

పుట్టినరోజున నెల్లూరుకు చంద్రబాబు

image

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఇదే రోజు నెల్లూరు జిల్లాలో పర్యటించబోతున్న ఆయనకు వినూత్నరీతిలో శుభాకాంక్షలు తెలియజేసేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో రేపు చంద్రబాబు పర్యటన సాగనుంది.

News April 19, 2024

కనిగిరి: బైకుపై నుంచి పడి వ్యక్తి మృతి

image

కనిగిరి మండలంలోని సుల్తానపురానికి చెందిన లక్కిరెడ్డి పెద్ద అంజయ్య (56) శుక్రవారం మృతి చెందారు. మాచవరం వద్ద బైకుపై నుంచి ప్రమాదవశాత్తు పడి తీవ్ర గాయాలయ్యాయి. ఎన్నికల నిమిత్తం అటుపై వెళ్తున్న సీఐ రామనాయక్ స్పందించి పెద్ద అంజయ్యను తన వాహనంలో కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. హాస్పిటల్ కి వచ్చిన కొద్దిసేపు తర్వాత పెద్ద అంజయ్య మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

News April 19, 2024

పెనుకొండ టీడీపీ అభ్యర్థిగా సవిత నామినేషన్

image

సార్వత్రిక ఎన్నికలలో భాగంగా పెనుకొండ టీడీపీ అభ్యర్థిగా సవిత నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆమె నామినేషన్ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News April 19, 2024

రూ.4.2 కోట్ల విలువైన నగదు, లిక్కర్ సీజ్: కలెక్టర్

image

జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి మాట్లాడుతూ.. జిల్లాలో మార్చి 16 నుంచి నేటి వరకు 92 లక్షల నగదు, 42 లక్షల విలువైన లిక్కర్, 29 లక్షల విలువైన డ్రగ్స్, 1 కోటి 81 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులు 74 లక్షల విలువైన ఇతర సామాగ్రిని కలిపి 4.2 కోట్లను సీజ్ చేశామన్నారు. ఫిర్యాదులను స్వీకరించడానికి జిల్లా వ్యయ కమిటి , సి విజిల్ , మీడియా మానటరింగ్ తదితర విభాగాలను ఏర్పాటు చేశామన్నారు.

News April 19, 2024

హిందూపురం టీడీపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ నామినేషన్

image

హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరదేవితో కలిసి శుక్రవారం మధ్యాహ్నం నామినేషన్ వేశారు. హిందూపురం కార్యాలయంలో రిటర్నింగ్ ఆఫీసర్ అభిషేక్ కుమార్‌కు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆయన మాట్లాడుతూ..
హిందూపురంలో కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.. కూటమి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నామినేషన్ కేంద్రం వరకు ఊరేగింపుగా వచ్చారు.