Andhra Pradesh

News April 19, 2024

కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల నామినేషన్

image

కాంగ్రెస్ పార్టీ కడప పార్లమెంట్ అభ్యర్థిగా పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల శనివారం ఉదయం నామినేషన్ వేయనున్నారు. భారీ ర్యాలీతో కడపకు చేరుకుని కడపలోని వివిధ సర్కిల్స్ మీదుగా కాంగ్రెస్ పార్టీకి కార్యాలయానికి చేరుకుంటారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం చేరుకొని తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కడపలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

News April 19, 2024

జగన్మోహన్‌ వాచ్ విలువే రూ.7.75 లక్షలు

image

➤ నియోజకవర్గం: చిత్తూరు
➤ అభ్యర్థి: గురజాల జగన్మోహన్ (TDP)
➤ స్థిరాస్తి విలువ: రూ.88.22 కోట్లు
➤ చరాస్తి విలువ: రూ.5.14 కోట్లు
➤ భార్య ప్రతిమ స్థిరాస్తి: రూ.36.67 కోట్లు
➤ బంగారం: 3.67 కేజీలు
➤ కేసులు: లేవు
➤ వాహనాలు: 4(3 కార్లు, హ్యార్లీ డేవిడ్సన్ బైక్)
➤ అప్పులు: రూ.17.52 కోట్లు
NOTE: రూ.7.75 లక్షల విలువైన వాచ్‌తోపాటు బెంగళూరులో కమర్షియల్ స్థలాలు, బిల్డింగ్‌లు ఉన్నట్లు అఫిడవిట్‌లో చూపారు.

News April 19, 2024

ప.గో.: జిల్లాలో ఫస్ట్ డే నిల్ నామినేషన్స్

image

ఉమ్మడి ప.గో. జిల్లాలో తొలి రోజు ఒక్క నామినేషన్‌ మాత్రమే దాఖలైంది. నరసాపురం పార్లమెంటు అభ్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి అత్తిలి మండలం ఆరవల్లికి చెందిన సత్తి సూర్యనారాయణరెడ్డి ఒక సెట్‌ దరఖాస్తును కలెక్టరు సుమిత్‌కుమార్‌కు అందజేశారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడా నామినేషన్లు దాఖలు కాలేదని తెలిపారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఎక్కువ మంది నేడు నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు.

News April 19, 2024

కాకినాడ: వైసీపీలోకి మాజీ మేయర్

image

కాకినాడ మాజీ మేయర్ సరోజ ఇటీవల జనసేనకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో YCPలో చేరారు. ఈ మేరకు ఆయన పార్టీ కండువా కప్పి ఆహ్వనించారు. ఈ సందర్భంగా సరోజ మాట్లాడుతూ.. శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన తనకు జనసేనలో సరైన స్థానం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. BC వర్గానికి మెజారిటీ సీట్లు ఇచ్చిన జగన్ వెంట నడుద్దామని నిర్ణయించుకుని పార్టీలో చేరానని తెలిపారు. 

News April 19, 2024

సర్వేపల్లిలో సీబీఎన్ టూర్ షెడ్యూల్ ఇదే

image

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం సర్వేపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గూడూరు నుంచి హెలికాఫ్టర్ లో బయలుదేరి మధ్యాహ్నం 2.25 గంటలకు మర్రిపల్లిలోని హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. 3 గంటల నుంచి 4.30 గంటల వరకు గేటు సెంటర్ లో జరిగే ప్రజాగళం సభలో పాల్గొంటారు. సాయంత్రం 4.50 గంటలకు మర్రిపల్లి హెలిపాడ్ నుంచి సత్యవేడుకు బయలుదేరుతారు.

News April 19, 2024

శ్రీకాకుళం: తొలి రోజు వాళ్లదే బోణీ

image

శ్రీకాకుళం జిల్లాలో తొలి రోజు స్వతంత్ర అభ్యర్థులే నామినేషన్లు వేశారు. ప్రధాన పార్టీల నుంచి ఎవరూ వేయలేదు. ఇక శ్రీకాకుళం స్థానానికి ఒక్క నామినేషన్ కూడా పడలేదు. జిల్లాలో 8 స్థానాలు ఉంటే నాలుగుస్థానాల్లో మాత్రమే నామినేషన్లు దాఖలు కాగా.. అందులో 6 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. మిగిలిన నాలుగింటిలో ఒక్క నామినేషన్ కూడా పడలేదు.

News April 19, 2024

ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థికి రూ.77.82 లక్షల అప్పులు

image

➤ నియోజకవర్గం: ఎమ్మిగనూరు
➤ అభ్యర్థి: బీవీ జయనాగేశ్వరరెడ్డి ( టీడీపీ)
➤చరాస్తుల విలువ : రూ.1.42 కోట్లు
➤స్థిరాస్తుల విలువ: రూ.3.85 కోట్లు
➤బంగారం : 200 గ్రాములు
➤పొలాలు: 22.97 ఎకరాలు
➤ కేసులు:3
➤ అప్పులు: రూ.77.82 లక్షలు

News April 19, 2024

ప్రకాశం: నామినేషన్ వేసిన భార్యా, భర్త

image

జిల్లాలోని దర్శి YCP MLA అభ్యర్థి బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డితో పాటు ఆయన సతీమణి నందిని రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. వీరిద్దరికి కలిపి రూ.29.3 కోట్ల మేర ఆస్తి ఉన్నట్లు అఫిడవిట్లో పొందుపర్చారు. ఇక చరాస్తుల విలువ సుమారు రూ.10.66 కోట్లు, రూ.45 లక్షలు విలువ గల బంగారం, ఒక బీఎండబ్ల్యూ, ఇన్నోవా, రూ.45 లక్షల మీని కూపర్ కారు ఉన్నట్లు పేర్కొన్నారు. వీరిద్దరిపై ఎటువంటి కేసులు లేవని వివరించారు.

News April 19, 2024

నేదురుమల్లికి రూ.17.50 కోట్ల విలువైన ఇల్లు

image

➤ నియోజకవర్గం: వెంకటగిరి
➤ అభ్యర్థి: నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి (YCP)
➤ ఆస్తుల విలువ: రూ.52.96 కోట్లు
➤ భార్య స్వప్న ఆస్తి: రూ.12.28 కోట్లు
➤ చేతిలో ఉన్న డబ్బులు: రూ.1.18 లక్షలు
➤ కేసులు: లేవు
➤ అప్పులు: రూ.2.40 లక్షలు
➤ బంగారం: లేదు, భార్యకు 1.86 కేజీలు
➤ వాహనాలు: రెండు కార్లు
NOTE: HYD సోమాజిగూడలోని ఓ ఇల్లు విలువే రూ.17.50 కోట్లుగా తన అఫిడవిట్‌లో చూపారు.

News April 19, 2024

నంద్యాల జిల్లాలో షర్మిల పర్యటన

image

నంద్యాల పట్టణంలో ఈనెల 21వ తేదీన వైఎస్ షర్మిల పర్యటించనున్నట్లు ఆ పార్టీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి గోకుల కృష్ణారెడ్డి వెల్లడించారు. నంద్యాల జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి షర్మిల పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. పట్టణంలో రోడ్ షో, బహిరంగ సభ ఉంటుందన్నారు.