Andhra Pradesh

News April 19, 2024

బాపట్లలో 7 ఎమ్మెల్యే, 2 ఎంపీ అభ్యర్థులు నామినేషన్

image

నామినేషన్ల ప్రారంభమైన గురువారం నాడే బాపట్లలో అభ్యర్థుల నామినేషన్ల పర్వం కొనసాగింది. బాపట్లలో ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులు, ఇరువురు ఎంపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్లు బాపట్ల జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రంజిత్ బాష చెప్పారు. ఎమ్మెల్యే అభ్యర్థులు తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయగా.. ఎంపీ అభ్యర్థులు కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసినట్లు చెప్పారు.

News April 19, 2024

ప.గో.జిల్లాలో ఒకటి.. ఏలూరు జిల్లాలో 6

image

ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడటంతో నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారం ప్రారంభమైంది. తొలిరోజు ఏలూరు జిల్లాలో ఆరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. ఉమ్మడి పశ్చిమలో రాజకీయ సందడి తారస్థాయికి ఉంది. అన్ని పార్టీల అభ్యర్థుల హోరాహోరీ ప్రచారం, పాదయాత్రలతో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది.

News April 19, 2024

‘ఒంటిమిట్ట’ అనే పేరు ఎలా వచ్చిందంటే?

image

ఒంటుడు, మిట్టుడు అనే ఇద్దరు రామ భక్తులు ఈ ఆలయాన్ని నిర్మించారు. నిర్మాణం పూర్తయిన తర్వాత వారు తమ జీవితాలని అంతం చేసుకున్నారు. వారి శిలా విగ్రహాలు ఆలయంలో ప్రవేశించటానికి ముందు చూడవచ్చు. వారి పేర్ల మీద ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందని అంటారు. ఈ ఆలయంలోని విగ్రహాలు ఒకే శిలలో మలచబడ్డాయి. అందుకే దీనికి ఏక శిలా నగరమనే పేరు వచ్చింది. దేశంలో ఆంజనేయస్వామి లేకుండా రాములవారు ఉన్న ఆలయం ఇదొక్కటే.

News April 19, 2024

ప్రకాశం: బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం

image

బల్లికురవ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన ఓ ఆటో డ్రైవర్ రెండు రోజులు క్రితం అత్యాచారం చేశాడు. ఈ విషయం బుధవారం రాత్రి బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో విచారించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఒంగోలు ఆసుపత్రికి తరలించారు.

News April 19, 2024

శింగనమల: బండారు శ్రావణికి ఎంత అప్పు ఉందో తెలుసా..?

image

శింగనమలలో నామినేషన్ వేసిన బండారు శ్రావణి శ్రీ ఆస్తిపాస్తులు, విద్యార్హత, కేసుల వివరాలను అఫిడవిట్ లో పేర్కొన్నారు. శ్రావణి ఎంఎస్ చదివారు. కాగా ఆమె పేరిట చరాస్తులు- రూ. 89.67 లక్షలు, బంగారం- 612.5 గ్రాములు, అప్పులు- రూ.22.59 లక్షలు ఉన్నట్లు పేర్కొన్నారు.

News April 19, 2024

ఉమ్మడి తూ.గో.లో తొలిరోజు నామినేషన్ల సందడి

image

ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి తూ.గో. జిల్లాలో తొలిరోజే ఆ సందడి కనిపించింది. దశమి గురువారం కావడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు, స్వతంత్రులు కూడా నామపత్రం సమర్పించారు. ప్రధాన పార్టీల నుంచి తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఒకరు నామినేషన్లు దాఖలు చేయగా కాకినాడ జిల్లా నుంచి ప్రధాన పార్టీల నుంచి ఒక్కరు కూడా నామినేషన్‌ వేయలేదు.

News April 19, 2024

బుట్టా రేణుక ఆస్తులు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

image

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక ఆర్థికంగా అంతంత మాత్రమే నని సీఎం జగన్ ఓ సభలో అన్నారు. అయితే ఆమె అఫిడవిట్ లో పేర్కొన్న ఆస్తి వివరాలు మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఆమె భర్త శివ నీలకంఠ పేరిట చరాస్తులు రూ.141.46 కోట్లు, స్థిరాస్తులు రూ.18.75 కోట్లు ఉన్నాయి. అప్పులు రూ.7.82 కోట్లు ఉన్నాయి. కాగా 2014లో వీరి ఆస్తుల విలువ రూ. 242.60 కోట్లు ఉండేది.

News April 19, 2024

చిత్తూరు: ఆన్‌లైన్‌లో హాల్ టికెట్లు

image

గురుకుల పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి ఈనెల 25న రాతపరీక్ష నిర్వహించనున్నారు. సంబంధిత హాల్ టికెట్లు ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్నాయని గురుకులాల జిల్లా సమన్వయకర్త ఆంజనేయ రాజు ఓ ప్రకటనలో తెలిపారు. 5, 6, 7, 8వ తరగతులకు 25న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

News April 19, 2024

శ్రీకాకుళం: చెడు వ్యసనాలకు బానిసై.. ఆత్మహత్య

image

కుటుంబకలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కోటబొమ్మాళి మండలం చీపుర్లపాడు పంచాయితీ ఊడికలపాడులో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన నేతింటి రమేష్(36) చెడు వ్యసనాలకు బానిసగా మారాడు. కుటుంబకలహాలతో గురువారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది.

News April 19, 2024

నెల్లిమర్ల: బడ్డుకొండ సంపద రూ.11.25 కోట్లు

image

నెల్లిమర్ల అసెంబ్లీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఆయన భార్య పద్మావతితో కలిపి స్థిర, చరాస్తుల విలువ రూ.11,25,32,036 గా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈయనకు వివిధ వ్యాపారాలపై 2022-23లో రూ.4,37,980, ఆయన భార్యకు రూ.6,09,320 వచ్చింది.