Andhra Pradesh

News April 19, 2024

వేమిరెడ్డి దంపతుల ఆస్తులు రూ.715 కోట్లు

image

టీడీపీ కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నిన్న నామినేషన్ వేశారు. ఈక్రమంలో తమ ఉమ్మడి ఆస్తుల విలువ రూ.715.62 కోట్లుగా చూపారు. ఇందులో ప్రశాంతిరెడ్డి పేరుతో రూ.76.35 కోట్లు, భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరిట రూ.639.26 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. అప్పులు రూ.197.29 కోట్లని చెప్పారు. రూ.6.96 కోట్ల విలువైన 19 కార్లు ఉన్నాయని వెల్లడించారు. అలాగే ప్రశాంతిపై ఎలాంటి కేసులు లేవు.

News April 19, 2024

ప.గో.: సెంటిమెంట్.. ఇక్కడికెళ్తే ఎన్నికల్లో గెలుపు పక్కా

image

ఎన్నిక ఏదైనా ప.గో. జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే నాయకులకు ఓ సెంటిమెంట్ కొనసాగుతూ వస్తోంది. ప్రచారం ప్రారంభించేందుకు ముందు నాయకులు మండలంలోని నందమూరులో కొలువైన వెంకన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. స్వామి ఆశీస్సులు ఉంటే విజయం తథ్యమని విశ్వాసం. మాజీ CM జలగం వెంగళరావు గతంలో ఏడాదికి ఒకసారైనా ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకునేవారు.
– మీ ప్రాంతాల్లో ఇలా ఏదైనా సెంటిమెంట్ ఉందా..?

News April 19, 2024

చీరాల: అనుమానంతో భార్యపై భర్త దాడి

image

నిత్యం అనుమానంతో వాలంటీరును వేధిస్తూ.. గృహ హింస పెడుతున్న భర్తపై ఈపూరుపాలెం పోలీస్ స్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సునీత, వెంకటరావు భార్యాభర్తలు. సునీత వాలంటీరుగా పనిచేస్తుండగా.. వెంకటరావు మందుల దుకాణంలో పని చేస్తున్నారు. బుధవారం ఇంటికి వచ్చి భార్యపై భౌతిక దాడికి దిగాడు. గాయపడిన సునీత ఫిర్యాదు మేరకు వెంకటరావుపై గృహహింస కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News April 19, 2024

శ్రీకాకుళం: ఈనెల 24 చివరి గడువు

image

ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ, బెటర్మెంట్ పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లింపునకు ఈనెల 24తో గడువు ముగిస్తుందని శ్రీకాకుళం ఆర్ఐఓ పి. దుర్గారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు ఆన్లైన్ ద్వారా ఈనెల 24లోగా అప్లై చేసుకోవాలని సూచించారు. ప్రాక్టికల్స్ లో ఫెయిల్ అయిన వారికి మే 1 నుంచి 4 వరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

News April 19, 2024

భీమిలి నుంచే పోటీ చేస్తున్నా: అవంతి

image

ఈ ఎన్నికల్లో తాను భీమిలి నుంచే పోటీ చేస్తానని.. నియోజకవర్గం మారే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విశాఖ కార్పొరేషన్ 5వ వార్డు సాయిరాం కాలనీలో ఆయన గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తన ప్రత్యర్థి గంటా శ్రీనివాసరావే తనపై దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. తమ క్యాడర్లో అయోమయం సృష్టిస్తున్నారని.. అనకాపల్లి నుంచి తాను ఎంపీగా పోటీ చేయడమనేది అవాస్తవమని చెప్పారు.

News April 19, 2024

గన్నవరం గడ్డపై పాగా వేసేదెవరో..

image

గన్నవరంలో టీడీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు, సిట్టింగ్ MLA వంశీ వల్లభనేని వైసీపీ నుంచి బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలో దిగిన యార్లగడ్డ 838 ఓట్ల తేడాతో ఓడారు. వంశీ వైసీపీలో చేరడంతో యార్లగడ్డ టీడీపీలో చేరి గన్నవరం MLA టికెట్ దక్కించుకుని నేడు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. రానున్న ఎన్నికల సమరంలో గన్నవరంలో వంశీ ఆధిక్యత చాటుకుంటారో, యార్లగడ్డ గెలుపు తీరాలకు చేరుకుంటారో మీ కామెంట్.

News April 19, 2024

జీడీనెల్లూరు టీడీపీ అభ్యర్థి మార్పు..?

image

చిత్తూరు జిల్లాలో ఓ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్పు జరిగేటట్లు తెలుస్తోంది. ప్రముఖ డాక్టర్ వీఎం థామస్‌కు చంద్రబాబు జీడీనెల్లూరు టికెట్ కేటాయించారు. ఆయన మత మార్పిడి కారణంగా ఎస్సీ సామాజికవర్గంలోకి రారని.. నామినేషన్ చెల్లదన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా మాజీ ఎమ్మెల్యే ఆర్.గాంధీ గురువారం జీడీనెల్లూరు టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయన 1994లో వేపంజేరి MLAగా గెలిచారు.

News April 19, 2024

కడప: భూపేశ్ రెడ్డి ఆస్తి వివరాలు

image

కడప పార్లమెంట్‌కు TDP ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన భూపేశ్ రెడ్డి తనపై ఉన్న కేసులను ప్రస్తావించారు. జమ్మలమడుగు PCలో నమోదైన SC, ST కేసులో పోలీసులు ఛార్జ్ సీటు వేయలేదని, జమ్మలమడుగు కోర్టులో నడుస్తున్న మరో రెండు కేసులు పెండింగ్లో ఉన్నాయి. శిక్ష పడిన కేసులు లేవని వెల్లడించారు. రూ.9.60 లక్షల జీవిత బీమా, రెండు లక్షల బ్యాంకు డిపాజిట్లు చూపించారు. రూ.62.17 లక్షల స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు.

News April 19, 2024

24 గంటలు అందుబాటులో ఉండేలా పోలీసు హెల్ప్ లైన్ నంబర్స్

image

24 గంటలు అందుబాటులో ఉండేలా ప్రత్యేకంగా ఎన్నికలకు పోలీసు హెల్ప్ లైన్ నంబర్స్- 9440796385, 9392903413, 0861-2328400 ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ
K.ఆరీఫ్ హఫీజ్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగపరంగా కల్పించబడిన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసిందన్నారు .

News April 19, 2024

ఏలూరు జిల్లాలో రూ.6,52,000 నగదు సీజ్

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 145.6 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకోగా.. దాని విలువ ₹.4,340 ఉంటుందన్నారు. అలాగే FST వారు స్వాధీనం చేసిన నగదు ₹.6,52,000 ఉన్నట్లు తెలిపారు.