Andhra Pradesh

News April 18, 2024

మర్రిపాడు: అదుపుతప్పి కారు బోల్తా.. తప్పిన ప్రమాదం

image

మర్రిపాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ సమీపంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు నుంచి దేకూరుపల్లికి వెళ్తున్న ఒక కారు అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు కారులో ఉన్నవారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు ఉన్నట్లు సమాచారం.

News April 18, 2024

కర్నూలు: మోటర్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్‌తో రైతు మృతి

image

చిప్పగిరి మండల కేంద్రానికి చెందిన కొండా చంద్ర అనే రైతు గురువారం కరెంట్ షాక్‌తో మృతి చెందారు. గ్రామ సమీపంలోని పొలం వద్ద మిరప పంటకు నీరు పెట్టేందుకు మోటర్ ఆన్ చేస్తుండగా
చంద్ర ఒక్కసారిగా కరెంట్ షాక్‌ గురై చనిపోయాడని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రైతు మృతిపై దర్యాప్తు చేస్తున్నామని చిప్పగిరి పోలీసులు వెల్లడించారు.

News April 18, 2024

విశాఖ: అక్కడ 2 గంటల ముందే ముగియనున్న పోలింగ్

image

నోటిఫికేషన్ విడుదల కావడంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎన్నికల సందడి నెలకొంది. ఉమ్మడి విశాఖలో జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. రెండు నియోజకవర్గాలు మినహా మిగతా 13 స్థానాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏజెన్సీ ప్రాంతాలు కావడంతో అరకు, పాడేరు నియోజకవర్గాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకే పోలింగ్ ఉంటుంది. ఓటర్లు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరారు.

News April 18, 2024

జీడీ నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

image

గంగాధరనెల్లూరు మండలం నెల్లేపల్లి బస్టాండ్ వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కొత్తపల్లి మిట్టకు చెందిన గణేష్, వరదరాజపురానికి చెందిన చిన్నబ్బ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News April 18, 2024

కడప జిల్లాలో మొదటి రోజు ఎంత మంది నామినేషన్ వేశారంటే?

image

సార్వత్రిక ఎన్నికలు – 2024 కు సంబంధించి కడప జిల్లాలో నేడు మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా ప్రారంభం అయిందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కడప పార్లమెంట్ కు 2, అసెంబ్లీకి 3, జమ్మలమడుగుకు 2, ప్రొద్దుటూరుకి 1, మైదుకూరుకు 3 నామినేషన్ దాఖలు కాగా, బద్వేలు, పులివెందుల, కమలాపురం పరిధిలో ఇప్పటి వరకు నామినేషన్ దాఖలు కాలేదన్నారు.

News April 18, 2024

ఓటరు దరఖాస్తులను ఈనెల 24 లోగా పరిష్కారం

image

జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఓటరు దరఖాస్తులను ఈనెల 24 లోగా పరిష్కరించి తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ వెల్లడించారు.
గురువారం ఎస్‌ఆర్ శంకరన్ వీసీ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు 20,53,397 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారని అన్నారు.

News April 18, 2024

విజయవాడలో 133 మందికి జరిమానా

image

విజయవాడ నగర పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 133 మందికి న్యాయస్థానం గురువారం జరిమానా విధించింది. ఈ మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో పట్టుబడిన వీరిని న్యాయస్థానంలో హాజరుపరచగా, 133 మందికి రూ.10వేల చొప్పున మెట్రోపాలిటన్ కోర్టు న్యాయమూర్తులు లెనిన్ బాబు, సురేశ్ బాబులు జరిమానా విధించారని పోలీస్ కమీషనరేట్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

News April 18, 2024

జనసేన తీర్థం పుచ్చుకున్న వట్టి పవన్ కుమార్

image

మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ కుటుంబానికి చెందిన వట్టి పవన్ కుమార్ గురువారం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. భీమడోలు మండలం ఏం.ఏం పురం గ్రామానికి చెందిన వట్టి పవన్ కుమార్ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ కండువా భుజాన వేసి సాదరంగా ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో, ఆయన ఆశయాలకు అనుగుణంగా కృషి చేస్తానని వట్టి పవన్ కుమార్ స్పష్టం చేశారు.

News April 18, 2024

విజయనగరం: అక్కడ గంట ముందే ముగియనున్న పోలింగ్

image

నోటిఫికేషన్ విడుదల కావడంతో ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎన్నికల సందడి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. రెండు నియోజకవర్గాలు మినహా మిగతా 7 స్థానాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏజెన్సీ ప్రాంతం కావడంతో సాలూరు, కురుపాం నియోజకవర్గాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకే పోలింగ్ ఉంటుంది. ఓటర్లు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరారు.

News April 18, 2024

ముద్రగడ ఓ పెద్ద దరిద్రం: నటుడు పృథ్వీరాజ్

image

పిఠాపురంలో సినీ నటుడు పృథ్వీరాజ్ పర్యటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ భారీ మెజార్టీతో గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముద్రగడపై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ పై ముద్రగడ చేస్తున్న చెడు ప్రచారాన్ని ఖండించారు. ముద్రగడ పద్మనాభం కాపు జాతికే కలంకం, ఆయనో పెద్ద దరిద్రం అంటూ మండిపడ్డారు.