Andhra Pradesh

News September 19, 2024

ప.గో: అమెరికాలో గుండెపోటుతో విద్యార్థి మృతి

image

నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంకి చెందిన తెలుగు విద్యార్థి ముత్తిన రమేశ్ గురువారం అమెరికాలో గుండెపోటుతో మృతి చెందారు. అమెరికాలో ఎంఎస్‌ చదివేందుకు రమేశ్ వెళ్లారు. అతని మరణ వార్త తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గడిచిన నాలుగు నెలల కాలంలో ఇదే నియోజకవర్గానికి చెందిన ముగ్గురు ఎంఎస్‌ విద్యార్థులు మృతి చెందారు.

News September 19, 2024

నంద్యాల: సీఎం సహాయ నిధికి రూ.2.22 కోట్ల విరాళం

image

శ్రీశైలం నియోజకవర్గం ప్రజలు అందించిన విరాళాలు రూ.2,22,70,749ను సీఎం సహాయ నిధికి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అందజేశారు. మంగళగిరిలో సీఎం చంద్రబాబుకు ఈ మొత్తాన్ని అందజేశారు. నియోజకవర్గ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు, వ్యాపారవేత్తలు, పొదుపు మహిళలు, విద్యార్థులు అందించిన మొత్తం సొమ్మును లెక్క చూపి ఆయనకు అందజేశారు. ప్రజలకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

News September 19, 2024

సిక్కోలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన రద్దు

image

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం రాజపురం గ్రామంలో రేపు జరగాల్సిన సీఎం చంద్రబాబు పర్యటన రద్దు చేయబడినట్లు అధికారికంగా గురువారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలం లేనందున ఈ పర్యటన రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం సీఎం చంద్రబాబు పర్యటనకు కావలసిన ఏర్పాట్లు పూర్తి చేసిన విషయం తెలిసిందే.

News September 19, 2024

ఉచిత ఇసుకను పారదర్శకంగా అందించేందుకు ఏర్పాట్లు: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లాలోని ఇసుక పాయింట్ల వద్ద నుంచి ఉచిత ఇసుకను పారదర్శకంగా అందించేందుకు ఏర్పాటు చేసినట్టు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయం నుంచి గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన అధికారులతో మాట్లాడారు. ఉచిత ఇసుక కోసం ప్రజలు ఆన్లైన్లో సులభతరంగా నమోదు చేసుకుని ప్రక్రియను క్రమబద్ధమైన రీతిలో రూపొందించామన్నారు.

News September 19, 2024

అమరావతి: పాఠశాలలకు దసరా సెలవులు ఎప్పటినుంచి అంటే?

image

రాష్ట్రంలో పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 2 నుంచి 14 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 15న తిరిగి స్కూళ్లు ప్రారంభమవుతాయని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

News September 19, 2024

కృష్ణా: డిగ్రీ విద్యార్థులకు ALERT

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో డిగ్రీ విద్యార్థులకై నిర్వహించే 7వ సెమిస్టర్(హానర్స్) రెగ్యులర్ &సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు ఈ నెల 27 నుంచి అక్టోబర్ 14లోపు అపరాధ రుసుము లేకుండా నిర్ణీత ఫీజు చెల్లించాలని, ఈ పరీక్షలు నవంబర్ 4 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ తెలిపింది. ఫీజు,షెడ్యూల్ వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని కోరింది. Share it

News September 19, 2024

మార్చి నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తికావాలి: హౌసింగ్ ఎండి

image

జిల్లాలో నిర్మాణం ప్రారంభించిన ఇళ్ల‌న్నింటినీ మార్చి నెలాఖ‌రులోగా శ‌త‌శాతం పూర్తిచేయాల‌ని రాష్ట్ర గృహ‌నిర్మాణ సంస్థ ఎం.డి. పి.రాజాబాబు హౌసింగ్ ఇంజ‌నీర్ల‌ను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాల‌ను కాలవ్య‌వ‌ధి ప్ర‌కారం పూర్తిచేయాల‌ని స్ప‌ష్టంచేశారు. గురువారం జిల్లాలో పర్యటించిన ఆయన గుంక‌లాం తదితర ఇళ్ల కాల‌నీలను సంద‌ర్శించి ఇళ్ల నిర్మాణ ప్ర‌గ‌తిని ప‌రిశీలించారు.

News September 19, 2024

చిరుతను పట్టుకునేందుకు 100 ట్రాప్ కెమెరాలు: భరణి

image

చిరుత పులిని పట్టుకునేందుకు 100 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని తూ.గో. జిల్లా అటవీ శాఖ అధికారి భరణి గురువారం తెలిపారు. గత రాత్రి శ్రీరాంపురం, పాలమూరు ప్రాంతాల్లో చిరుత సంచరించినట్లు వచ్చిన సమాచారం అవాస్తవమన్నారు. నిపుణుల బృందం పాదముద్రలు పరిశీలించగా అవి అడవి పిల్లి పాద ముద్రలుగా నిర్ధారణ జరిగిందన్నారు. ట్రాప్ కెమెరాలో అడవి పిల్లిని గుర్తించడం జరిగిందని తెలిపారు. అసత్య ప్రచారాలు నమ్మొద్దన్నారు.

News September 19, 2024

తిరుపతి జిల్లాలో 27 మంది పోలీస్ కానిస్టేబుళ్లు బదిలీ

image

తిరుపతి జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లను ఎస్పీ సుబ్బారాయుడు బదిలీ చేశారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారి చేశారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లనో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారికి స్థాన చలనం కల్పించారు. బదిలీ అయిన వారు వెంటనే రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

News September 19, 2024

శ్రీకాకుళం వైసీపీ అధ్యక్షునిగా ధర్మాన కృష్ణదాస్

image

మాజీ సీఎం, వైసీపీ అధినేత వై.యస్.జగన్ తాడేపల్లిలోని ఆపార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలతో సమావేశమయ్యారు. నియోజకవర్గాల్లో పరిస్థితులపై చర్చించారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షులుగా ధర్మాన కృష్ణదాస్, పార్లమెంటరీ అధ్యక్షులుగా తమ్మినేని సీతారాం ని ప్రకటించారు. వారికి మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, నియోజకవర్గాల సమన్వయకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.