Andhra Pradesh

News April 18, 2024

సీఎం జగన్ నాకు తీరని అన్యాయం చేశాడు: వెలగపల్లి

image

సీఎం జగన్ తనకు తీరని అన్యాయం చేశాడని తిరుపతి పార్లమెంటు బిజెపి అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు అన్నారు. వాకాడులో ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్లు ఎంపీగా, ఐదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తనను.. ఎవరో మాటలు విని తనకు టికెట్ ఇవ్వలేదని అన్నారు. దీంతో తాను బీజేపీ తరఫున తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్నానని అన్నారు. తనను గెలిపిస్తే గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి తొలి ప్రాధాన్యం ఇస్తానన్నారు.

News April 18, 2024

నెల్లూరు జిల్లాలో తొలి రోజు 9 మంది నామినేషన్లు

image

నెల్లూరు జిల్లాలో తొలి రోజు 8 నియోజకవర్గాల్లో 9 మంది 14 నామినేషన్లు, నెల్లూరు పార్లమెంట్‌కు ఒక నామినేషన్ వేసినట్లు కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. అలాగే జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను పరిశీలించడానికి వ్యయ పరిశీలకులు ఇప్పటికే జిల్లాకు వచ్చారన్నారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు, పోలీసు పరిశీలకులు 24న జిల్లాకు వస్తారని వెల్లడించారు. ఇప్పటివరకు జిల్లాలో రూ.1.78 కోట్ల నగదును సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.

News April 18, 2024

కర్నూలు: మెుదటి రోజు నామినేషన్ వేసింది వీరే

image

 కర్నూలు ఎంపీ అభ్యర్థులుగా టీడీపీ నుంచి బస్తిపాడు నాగరాజు, కె.జయసుధ, స్వతంత్ర అభ్యర్థిగా బీచుపల్లి నామినేషన్ వేశారు. ఎమ్మెల్యే అభ్యర్థులుగా కర్నూలు నుంచి ఖలీల్ అహ్మద్ సత్తార్(SDPI), అబ్దుల్ సత్తార్(అన్నా వైసీపీ). కోడుమూరు నుంచి దస్తగిరి(TDP), ఆదిమూలపు సతీశ్(YCP). ఎమ్మిగనూరు  బుట్టారేణుక(YCP), టీడీపీ నుంచి బీవీ జయనాగేశ్వరరెడ్డి, బైరెడ్డి నిత్యాదేవి. ఆదోని అసియా బాను(బీఎస్పీ) నామినేషన్ వేశారు.

News April 18, 2024

ఒంగోలు: ATM వ్యాన్ లో రూ.65 లక్షల నగదు చోరీ

image

ఒంగోలులో ATM కేంద్రాలకు నగదు తరలించే వాహనంలో రూ.65 లక్షల నగదు చోరీకి గురైన సంఘటన గురువారం చోటుచేసుకుంది. సీఎంఎస్ ఏజెన్సీకి సంబంధించిన వాహన సిబ్బంది భోజనం కోసం కర్నూలు రోడ్డులో వాహనాన్ని నిలుపుదల చేశారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు వాహనం తాళం పగలగొట్టి నగదు చోరీ చేశారు. దీంతో సమాచారం అందుకున్న ఏఎస్పీ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News April 18, 2024

శ్రీకాకుళం జిల్లాలో తొలిరోజు నామినేషన్లు వేసింది వీరే..

image

శ్రీకాకుళం జిల్లాలో తొలి రోజు నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇచ్ఛాపురం స్వతంత్ర అభ్యర్థిగా జె.సూర్య వరప్రసాదరావు, టెక్కలి స్వతంత్ర అభ్యర్థిగా రాజేష్, ఆమదాలవలస స్వతంత్ర అభ్యర్థులుగా జగదీశ్వరరావు, వెంకట రాజశేఖర్, ఎచ్చెర్ల స్వతంత్ర అభ్యర్థులుగా నేతల ఈశ్వరరావు, నడుపూరు ఈశ్వరరావు నామినేషన్లు వేశారు. కాగా.. ప్రధాన పార్టీల నుంచి ఏ ఒక్కరూ తొలిరోజు నామినేషన్ దాఖలు చెయ్యలేదు.

News April 18, 2024

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తరఫున నామినేషన్ దాఖలు

image

నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తరఫున మాజీ మేయర్ భానుశ్రీ నెల్లూరు రూరల్ రిటర్నింగ్ అధికారి మలోలకు గురువారం నామినేషన్ పత్రాలను అందజేశారు. ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా మాజీ మేయర్ భానుశ్రీతో పాటు టీడీపీ నేతలు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో 2014, 19 ఎన్నికల్లో కూడా కోటంరెడ్డి పోటీ చేశారు. ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం.

News April 18, 2024

కాకినాడ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

image

కాకినాడ జిల్లా పెద్దాపురం- రాజమండ్రి ఏడీబీ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బైక్‌ను వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు కాకినాడకు చెందిన వారిగా తెలుస్తుంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 18, 2024

శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గానికి నామినేషన్లు నిల్

image

శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మొదటి రోజు గురువారం ఎటువంటి నామినేషన్లు రాలేదని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలాని సమూన్ తెలిపారు. గురువారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ కోసం ఎవరు దాఖలాలు చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.

News April 18, 2024

చిత్తూరు: మొదటి రోజు నామినేషన్ వివరాలు

image

చిత్తూరు పార్లమెంటు స్థానానికి గురువారం ఒక నామినేషన్ దాఖలు అయినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. పుంగనూరు అసెంబ్లీ స్థానానికి నాలుగు, నగరిలో ఒకటి, జీడీ నెల్లూరులో రెండు, చిత్తూరులో రెండు, పలమనేరులో రెండు నామినేషన్లు దాఖలు అయినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. కుప్పం, పూతలపట్టు అసెంబ్లీ స్థానాలకు ఎటువంటి నామినేషన్లు దాఖలు కాలేదు.

News April 18, 2024

సీఎంగా విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం: బొత్స

image

వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎంగా జగన్మోహన్ రెడ్డి విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పరిపాలనను కూడా విశాఖ నుంచే ప్రారంభిస్తారని అన్నారు. మాట తప్పని వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని వెల్లడించారు. టీడీపీ అధికారంలో ఉండగా అమరావతి పేరిట చేసిన దోపిడీ అందరికీ తెలిసిందే అన్నారు.