Andhra Pradesh

News April 18, 2024

2024 ఎలక్షన్.. కర్నూలు అసెంబ్లీ రౌండప్

image

➤నియోజకవర్గం పేరు: కర్నూలు
➤పోలింగ్ బూత్‌ల సంఖ్య: 258
➤మొత్తం ఓటర్లు: 270942
➤పురుషులు: 131150
➤మహిళలు : 139760
➤ఇతరులు: 32
➤రిటర్నింగ్ అధికారి:
➤కర్నూల్ నగరపాలక సంస్థ కమిషనర్ భార్గవ్ తేజ
➤పోలింగ్ తేదీ: 13-05-2024
➤కౌంటింగ్ తేదీ: 4-06-2024

News April 18, 2024

టీడీపీ అభ్యర్థి ఆరిమిల్లితో వైసీపీ నేత భేటీ

image

టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో ఉన్న తణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణతో ఏఎంసీ మాజీ ఛైర్మన్, వైసీపీ సీనియర్ నాయకులు చిట్టూరి సునంద గురువారం భేటీ అయ్యారు. గత కొంతకాలంగా వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న సునంద తాజాగా రాధాకృష్ణతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఆమె పార్టీ వీడి టీడీపీలో చేరతారనే ప్రచారం ఇటీవల కాలంలో జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

News April 18, 2024

చిత్తూరు: వైసీపీకి సినీ విలన్ మద్దతు

image

చిత్తూరులో ఇవాళ నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైసీపీ చిత్తూరు MLA అభ్యర్థి విజయానందరెడ్డి ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో సినీ విలన్ కబాలి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనకు మద్దతుగా ప్రచారం చేశారు. రానున్న ఎన్నికల్లో విజయానందరెడ్డిని ఆశీర్వదించాలని కోరారు.

News April 18, 2024

అనంత: రాష్ట్రంలోనే మొట్ట మొదటి నామినేషన్ పయ్యావుల కేశవ్‌దే

image

రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్‌లకు మెుదటి రోజు కావడంతో పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్ట మొదటి నామినేషన్ వేసిన అభ్యర్థిగా ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పయ్యావుల కేశవ్ నిలిచారు.

News April 18, 2024

టెక్కలి ఎమ్మెల్యేగా దువ్వాడ వాణీ పోటీ..?

image

టెక్కలి ఎమ్మెల్యేగా జడ్పీటీసీ దువ్వాడ వాణీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 22న ఆమె నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. వైసీపీ సీనియర్ మహిళా నాయకురాలుగా ఉన్న ఆమె టెక్కలి వైసీపీ అసెంబ్లీ టికెట్‌ను ఆశించారు. టెక్కలి వైసీపీ అభ్యర్థిగా శుక్రవారం దువ్వాడ శ్రీనివాస్ నామినేషన్ వేయనుండగా.. ఆయన భార్య కూడా బరిలో ఉండనున్నట్లు వార్తలు వస్తున నేపథ్యంలో టెక్కలిలో రాజకీయం ఆసక్తిగా మారింది.

News April 18, 2024

తొమ్మిదో సారి ప్రసన్న నామినేషన్

image

కోవూరు MLA అభ్యర్థిగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తొమ్మిదో సారి నామినేషన్ దాఖలు చేశారు. 1993 ఉప ఎన్నికల్లో మొదటిసారిగా ఆయన టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. 1994, 1999, 2004, 2009 ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఒక్క 2004లో మాత్రం ఓడారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో YCP అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2014లో ఓడిపోగా 2019లో విజేతగా నిలిచారు. ఇప్పుడు మరోసారి బరిలో దిగారు.

News April 18, 2024

తిరుపతి: TTCలో ప్రవేశాలకు దరఖాస్తులు

image

టెక్నికల్‌ టీచర్స్‌ సర్టిఫికెట్‌(TTC) 42 రోజుల వేసవి ట్రైనింగ్‌ కోర్సుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మే 1 నుంచి జూన్‌ 11 వరకు శిక్షణ జరుగుతుంది. ఈనెల 25వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తిరుపతి జిల్లా విద్యాశాఖ కార్యాలయ అధికారులు ఓ ప్రకటనలో కోరారు. అర్హత, ఇతర వివరాలకు www.bse.ap.gov.in వెబ్‌సైట్‌ చూడాలని సూచించారు.

News April 18, 2024

బద్వేలు: రూ.5 కోట్ల విలువచేసే బంగారు, వెండి స్వాధీనం

image

బద్వేలులో భారీ మొత్తంలో బంగారు, వెండి పోలీసుల తనిఖీల్లో పట్టుబడింది. గోపవరం మండలం, పి.పి కుంట చెక్ పోస్టు వద్ద పోలీసుల తనిఖీలు నిర్వహించగా బొలెరో వాహనంలో తరలిస్తున్న రూ.5 కోట్ల విలువచేసే గోల్డ్ & సిల్వర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు నుంచి కడపకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇవి సీక్వెల్ లాజిస్టిక్స్ కంపెనీకి చెందినదిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 18, 2024

బండారు శ్రావణి నామినేషన్ దాఖలు

image

సింగనమల మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో గురువారం సింగనమల నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. కార్యక్రమంలో బండారు కిన్నెర శ్రీ, ద్విసభ్య కమిటీ సభ్యుడు అలం నరసానాయుడు పాల్గొన్నారు.

News April 18, 2024

తూ.గో: భవనం పైనుంచి పడి తాపీ మేస్త్రి మృతి

image

తాపీ మేస్త్రి ప్రమాదవశాత్తు బిల్డింగు పై నుంచి కిందపడి షేక్ అసిన్(35) మృతి చెందినట్లు ఎస్సై కే సతీష్ కుమార్ తెలిపారు. మండలంలోని భీమోలు గ్రామంలో ఉదయం10 గంటలకు దాబాపై తాపీ పని చేస్తుండగా దురదృష్టవశాత్తు పై నుండి కింద పడిపోయాడు. దీంతో తలకు బలమైన గాయాలు అవ్వడంతో గోపాలపురం ఆసుపత్రికి హుటాహుటిన తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.