Andhra Pradesh

News April 18, 2024

కడప: సెక్యూరిటీ డిపాజిట్ ఎంతంటే?

image

సార్వత్రిక ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనుండగా అభ్యర్థుల డిపాజిట్ ఫీజులను కలెక్టర్ విజయరామరాజు వివరించారు. ఎంపీకి పోటి చేసే జనరల్‌ అభ్యర్థికి రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.12,500 సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యేకు పోటీచేసే జనరల్‌ అభ్యర్థికి రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.5 వేలు చెల్లించాలని కలెక్టర్ వివరించారు.

News April 18, 2024

విశాఖ: నామినేషన్ దాఖలు చేసిన కేఏ పాల్

image

ప్రజాశాంతి పార్టీ తరఫున విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా, గాజువాక శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేఏ పాల్ నామినేషన్ దాఖలు చేశారు. కొద్దిసేపటి క్రితం తన మద్దతుదారులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జునకు తన నామినేషన్ పత్రాలను ఆయన అందజేశారు. ఒకే జిల్లా నుంచి పార్లమెంటుకు, శాసనసభకు రెండు స్థానాలకు కేఏ పాల్ పోటీ చేస్తున్నారు.

News April 18, 2024

నరసరావుపేట TDP MP అభ్యర్థిగా లావు నామినేషన్

image

జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేట MP స్థానానికి TDPఅభ్యర్థిగా గురువారం ఉదయం 11.20 గంటలకు లావు శ్రీకృష్ణ దేవరాయలు నామినేషన్ వేశారని అన్నారు. ఆయన మాట్లాడుతూ..
రెండు సెట్ల నామినేషన్ పత్రాలను లావు అందించారని తెలిపారు. ఎన్నికల సిబ్బంది పరిశీలించిన తరువాత నామినేషన్ స్వీకరించనున్నట్లు చెప్పారు.

News April 18, 2024

విజయనగరం జిల్లాలో ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ

image

విజయనగరం జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. విజయనగరం పార్లమెంట్ స్థానానికి యుగ తులసి పార్టీ అభ్యర్థిగా శంబాన శ్రీనివాస రావు నామినేషన్ వేశారు.
జిల్లా ఎన్నికల అధికారి, విజయనగరం పార్లమెంటు రిటర్నింగ్ అధికారి నాగలక్ష్మికి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను శ్రీనివాసరావు అందజేసారు. హెల్ప్ డెస్క్‌లో ముందుగా నామినేషన్ పత్రాలను ఏఆర్వో సుమబాల పరిశీలించారు.

News April 18, 2024

గోపాలపురం: గ్యాస్ సిలిండర్ లీక్

image

వంట గ్యాస్ లీకై, తల్లీ కుమార్తె గాయలపాలైన ఘటన వాదాలకుంట గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నామాల నిర్మల తన కుమార్తె కళ్యాణి వంట గదిలో ఉండగా.. గ్యాస్ సిలెండర్ నుంచి గ్యాస్ లీక్ అయ్యి మంటలు వ్యాపించాయి. దీంతో మంటల్లో వారు చిక్కుకున్న వారిని స్థానికులు గోపాలపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం రాజమండ్రికి తరలించారు.

News April 18, 2024

కర్నూలు ఎంపీ అభ్యర్థిగా నామినేషన్

image

కర్నూలులో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. టీడీపీ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బస్తిపాడు నాగరాజ్ కలెక్టర్ సృజనకు నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ నేపథ్యంలో కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ ఆంక్షలు విధించారు. ఇది తొలి సెట్ కావడంతో ఆయన ఎటువంటి ఆర్భాటం లేకుండా వచ్చారు. మరో సెట్ వేసేటప్పుడు కార్యకర్తలు, అభిమానులతో భారీ ర్యాలీ చేయనున్నారు.

News April 18, 2024

తూర్పు గోదావరిలో జగన్ బస్సుయాత్ర

image

సీఎం జగన్ బస్సు యాత్ర తేతలి నుంచి తణుకు మీదుగా రావులపాలెంలోకి సాగింది. తూ.గో జిల్లాలో సిద్దాంతం వంతెన నుంచి జిల్లాలోకి ప్రవేశించింది. రావులపాలెం, జొన్నాడ, పొట్టిలంక, రాజానగరం మీదుగా ఎస్టీ రాజపురం వరకు బస్సుయాత్ర సాగనుంది. ఎస్టీ రాజపురంలో రాత్రి సీఎం జగన్ బస చేయనున్నారు. అందరికి అభివాదం చేస్తూ
సీఎం జగన్ ముందుకు సాగుతున్నారు.

News April 18, 2024

అనంత: హాల్ టికెట్లు వచ్చేశాయ్..!

image

గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు ఈనెల 25వ తేదీన నిర్వహించే రాత పరీక్షలకు హాల్ టికెట్లు వచ్చాయని APRS, APRJC, DC – 2024 జిల్లా కోఆర్డినేటర్ విజయలత తెలిపారు. 5, 6, 7, 8 తరగతుల ప్రవేశాలకు APRS క్యాట్- 2024 పరీక్ష ఉదయం 10 – 12 గంటలకు, జూనియర్, డిగ్రీ కళాశాల ప్రవేశాలకు APRJC DC సెట్ మధ్యాహ్నం 2:30 – 5 గంటలకు ఉంటుందన్నారు. వివరాలకు https://aprs.apcfss.in సైట్ చూడాలన్నారు.

News April 18, 2024

అనంత: 108లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

అనంతపురం జిల్లాలో 108 వాహనాల్లో ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌ (ఈఎంటీ), డ్రైవర్‌, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్‌ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు 108 జిల్లా మేనేజర్‌ సంజీవరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి కల్గిన వారు ఈ నెల19వ తేదీ లోపు అనంతపురం సర్వజనాస్పత్రిలో 108 కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

News April 18, 2024

ఏలూరు: కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి తొలి నామినేషన్

image

దెందులూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆలపాటి నరసింహామూర్తి నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు గురువారం దెందులూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ లావణ్యవేణికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.