Andhra Pradesh

News April 18, 2024

ఉరవకొండ: పయ్యావుల కేశవ్ తరఫున సతీమణి నామినేషన్

image

ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ తరఫున ఆయన సతీమణి పయ్యావుల హేమలత నామినేషన్ వేశారు. గురువారం ఉదయం తనయుడు పయ్యావుల విజయ్ సింహ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆమె రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం నామినేషన్ పత్రాలను నియోజకవర్గ ఎన్నికల అధికారి కేతన్ గార్గ్‌కు అందజేశారు.

News April 18, 2024

గుంటూరు: కాలువలో మృతదేహం 

image

జిల్లాలోని నగరం మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని అఖిలేరు కాలవలో 30 నుంచి 40 సంవత్సరాల మధ్య గల గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. ఎస్సై కోటేశ్వరరావు తెలిపిన వివరాలు.. మృతుడు 5.5 అడుగుల ఎత్తు, ఫ్రెంచ్ గడ్డం, సిమెంట్ కలర్ కాటన్ ప్యాంట్, ఎరుపు, నలుపు రంగు చెక్స్ చొక్కా, నలుపు రంగు బెల్ట్ ధరించి, గోల్డ్ కలర్ బకిల్ కలిగి ఉందన్నారు. ఆచూకీ తెలిసిన వారు స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.  

News April 18, 2024

పట్టువదలని విశాఖ యువతి

image

విశాఖలోని కిర్లంపూడికి చెందిన హనిత సివిల్స్‌లో 887వ ర్యాంక్ సాధించారు. ఇంటర్ వరకు విశాఖలోనే చదివిన ఆమె 2012లో ఖరగ్‌పూర్‌లో ఇంజినీరింగ్‌లో చేరారు. 2013లో సడెన్‌గా పెరాలసిస్ రావడంతో రెండు కాళ్లు పడిపోయాయి. వీల్ ఛైర్‌కు పరిమితమైన ఆమె రెండేళ్ల పాటు డిప్రెషన్‌కి గురయ్యారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో డిస్టెన్స్‌లో డిగ్రీ పూర్తిచేసి 2020లో తొలిసారి సివిల్స్‌ రాశారు. నాలుగో ప్రయత్నంలో ర్యాంక్ సాధించారు

News April 18, 2024

శ్రీకాకుళం: నేడు, రేపు భానుడి భగభగలు

image

నిన్నటి వరకు మోస్తరు వర్షాలు, చలిగాలులతో ఉపశమనం పొందిన ప్రజలకు ఎండలు మళ్లీ దంచికొడుతున్నాయి. బుధవారం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్ పైగా నమోదయ్యాయి. గరిష్ఠంగా శ్రీకాకుళం(D) విజయనగరం, పార్వతీపురంమన్యం(D) సీతంపేట మండలాల్లో 42.7 డిగ్రీలు నమోదైంది. నేడు, రేపు ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు పెరగొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు.

News April 18, 2024

పట్టువదలని విశాఖ యువతి

image

విశాఖలోని కిర్లంపూడికి చెందిన <<13067957>>హనిత<<>> సివిల్స్‌లో 887వ ర్యాంక్ సాధించారు. ఇంటర్ వరకు విశాఖలోనే చదివిన ఆమె 2012లో ఖరగ్‌పూర్‌లో ఇంజినీరింగ్‌లో చేరారు. 2013లో సడెన్‌గా పెరాలసిస్ రావడంతో రెండు కాళ్లు పడిపోయాయి. వీల్ ఛైర్‌కు పరిమితమైన ఆమె రెండేళ్ల పాటు డిప్రెషన్‌కి గురయ్యారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో డిస్టెన్స్‌లో డిగ్రీ పూర్తిచేసి 2020లో తొలిసారి సివిల్స్‌ రాశారు. నాలుగో ప్రయత్నంలో ర్యాంక్ సాధించారు.

News April 18, 2024

అందరి చూపు మంత్రి పెద్దిరెడ్డి ఆస్తి వివరాలపైనే..!

image

నామినేషన్ల సమయంలో అభ్యర్థులు తమ ఆస్తి, కేసుల వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రూ.130 కోట్ల ఆస్తి, రూ.20 కోట్ల అప్పులు ఉన్నట్లు చూపారు. తనకు కారు లేదని చెప్పారు. తనకు 50 గ్రామల బంగారం, భార్యకు 1.5 కేజీల బంగారం ఉందని వెల్లడించారు. మరి తాజా ఎన్నికల్లో ఆయన తన ఆస్తి ఎంత చూపిస్తారనేది జిల్లా ప్రజల్లో ఆసక్తి రేపుతోంది.

News April 18, 2024

తూ.గో: ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య

image

రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని మోరంపూడి గాయత్రి నగర్‌కు చెందిన సుంకర నారాయణ(19) ప్రేమ విఫలమై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని సీఐ ఎండీ ఉమర్ బుధవారం తెలిపారు. 10 తరగతి వరకు చదివిన నారాయణ రోజువారి కూలి పనులు చేసుకుంటూ ఉంటాడన్నారు. గత కొద్ది రోజుల నుంచి తీవ్ర మనస్తాపంతో ఉంటున్నాడని, ప్రేమ వ్యవహారమే దీనికి కారణమని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News April 18, 2024

గుడ్లూరు: చెట్టును ఢీ కొట్టిన కూలీల ఆటో

image

గుడ్లూరు మండలం పొట్లూరు సమీపంలో రహదారిపై వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొంది. గురువారం ఉదయం జరిగిన ఘటనలో 14 మందికి తీవ్ర గాయాలు కాగా వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. కావలి మండలం అన్నగానిపాలెంకు చెందిన కూలీలు గుడ్లూరు మిర్చి కోతలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు బాధితులు తెలిపారు.

News April 18, 2024

బాపట్లలో సినిమా స్టూడియో ఏర్పాటు 

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో సినిమా స్టూడియో ఏర్పాటు చేయబోతున్నానని ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ తెలిపారు. గురువారం బాపట్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైజాగ్‌లో ఏర్పాటు చేయమని అక్కడ ఎంపీ అడిగినా, నా జన్మభూమి బాపట్లలోనే స్టూడియో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. బాపట్ల ప్రజల రుణం తీర్చుకోవాలనేది నా కోరిక అని చెప్పారు. 

News April 18, 2024

మంచి ముహూర్తం చూడండి స్వామి…!

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో నేటి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు పండితులు, స్వామీజీలను ఆశ్రయిస్తున్నారు. మంచి ముహుర్తాలు చూడాలని కోరుతున్నారు. పంచాంగం ప్రకారం ఈనెల 18, 19, 22, 23, 24 తేదీలు బాగున్నాయని పండితులు అంటున్నారు. కొందరు సెంటిమెంట్‌తో పాటు వారాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకు అనుగుణంగా శుభఘడియలు నిర్ణయించుకుంటున్నారు.