Andhra Pradesh

News April 18, 2024

గుంటూరు కలెక్టరేట్‌లో భద్రతా చర్యల పరిశీలన 

image

గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి అభ్యర్థులు నామినేషన్లు వేయటానికి కలెక్టరేట్లో కార్యాలయం ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. బుధవారం కలెక్టరేట్‌లో అభ్యర్థులకు ఏర్పాట్లు, ఇతరులు రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలోకి రాకుండా చేసిన భద్రతా చర్యలను జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించారు. పరిశీలనలో డీఆర్‌ఓ పెద్ది. రోజా, తదితరులు పాల్గొన్నారు. 

News April 18, 2024

బందోబస్తు పర్యవేక్షణకు పోలీసు అధికారులు

image

నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ప్రతి ఆర్వో ఆఫీసు వద్ద శాంతిభద్రతల పర్యవేక్షణ బాధ్యతలను DSPలకు అప్పగించారు. నెల్లూరు ఎంపీ నామినేషన్ కేంద్రం వద్ద ఏఎస్పీ సౌజన్య, నెల్లూరు సిటీలో శ్రీనివాసులు రెడ్డి, రూరల్‌లో రామకృష్ణాచారి , కోవూరులో శ్రీనివాసులు, సర్వేపల్లిలో వీరాంజనేయరెడ్డి, ఆత్మకూరులో కోటారెడ్డి, కావలిలో వెంకటరమణ, ఉదయగిరిలో సాయినాథ్ పర్యవేక్షిస్తారు.

News April 18, 2024

ఎర్నాకుళం-పాట్నా మధ్య ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఎర్నాకులం-పట్నా -ఎర్నాకుళం మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. ఈనెల 19 నుంచి జూన్ 28 వరకు ప్రతి శుక్రవారం దీనిని నడపనున్నట్లు తెలిపారు. ఇది దువ్వాడ మీదుగా పట్నా వెళుతుందన్నారు. అలాగే ఈనెల 22 నుంచి జులై 1 వరకు ప్రతి సోమవారం పట్నాలో బయలుదేరి దువ్వాడ మీదగా ఎర్నాకుళం వెళుతుందన్నారు.

News April 18, 2024

తూ.గో: డ్రగ్స్ విక్రయిస్తున్న యువకుల అరెస్టు

image

మాదాపూర్‌లో డ్రగ్స్‌ విక్రయిస్తున్న రాజమహేంద్రవరానికి చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థులు గుత్తుల శ్యామ్‌బాబు, కాటూరి సూర్యకుమార్‌లను ఎస్‌వోటీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.5.70 లక్షల విలువ చేసే 28 గ్రాముల ఎండీఎంఏ, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సూర్యకుమార్ గతేడాది డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడి జైలుకు పంపారు. అయినా అతనిలో మార్పు రాలేదు.

News April 18, 2024

ప్రకాశం జిల్లాలో నామినేషన్ కేంద్రాలు ఇవే..!

image

☞ ఒంగోలు MP: ఒంగోలు కలెక్టర్ ఆఫీసు
☞ ఒంగోలు MLA: ఒంగోలు RDO ఆఫీసు
☞ కనిగిరి MLA: కనిగిరి RDO ఆఫీసు
☞ మార్కాపురం MLA: ఉప కలెక్టర్ ఆఫీసు
☞ సంతనూతలపాడు MLA: చీమకుర్తి తహశీల్దార్ ఆఫీసు
☞ యర్రగొండపాలెం MLA: స్త్రీ శక్తి భవన్
☞ గిద్దలూరు MLA: గిద్దలూరు MRO ఆఫీసు
☞ కొండపి MLA: కొండపి MRO ఆఫీసు
☞ చీరాల MLA: చీరాల MRO ఆఫీసు
☞ పర్చూరు MLA: పర్చూరు RDO ఆఫీసు
☞ కందుకూరు MLA: సబ్ కలెక్టర్ ఆఫీసు

News April 18, 2024

ప.గో: ఈనెల 19న నామినేషన్లు వేసేది వీరే…

image

ప.గో.జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమై ఈనెల 25 వరకు కొనసాగనుంది.. ఈ క్రమంలో ఈ నెల 19న ఆరిమిల్లి రాధాకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్, ముదునూరి ప్రసాద్ రాజు, నిమ్మల రామానాయుడు, కాంగ్రెస్ నుంచి కొలుకులూరి అర్జునరావు, నరసింహారాజు, ఆచంటలో వైసీపీ, టీడీపీ అభ్యర్థులు ఈనెల 19న నామినేషన్ దాఖలు చేయనున్నారు.

News April 18, 2024

శ్రీకాకుళం: నామినేషన్.. ఇవి తప్పక గుర్తించుకోండి

image

* అసెంబ్లీ అభ్యర్థి నియోజకవర్గ పరిధిలో పార్లమెంట్ అభ్యర్థి జిల్లా కేంద్రంలో నామపత్రాలు పత్రాలు సమర్పించాలి. *నిబంధనల ప్రకారం అధికారిక సెలవు రోజుల్లో మిగిలిన అన్ని రోజుల్లోనూ నామపత్రాలను స్వీకరిస్తారు. * ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తీసుకుంటారు *రిటర్నింగ్ అధికారి గదిలో సీసీ కెమెరాలు ఉంటాయి. వీడియోగ్రఫీ చేస్తారు. * కార్యాలయానికి వంద మీటర్ల పరిధిలో మూడు వాహనాలను మాత్రమే అనుమతిస్తారు.

News April 18, 2024

అనంత: వందేభారత్‌పై రాళ్ల దాడి

image

కాచిగూడ- యశ్వంతపుర మధ్య నడిచే వందేభారత్ పై దాడి జరిగింది. పామిడి-కల్లూరు మధ్య బుధవారం ఉదయం వందేభారత్ రాగానే కొందరు ఆకతాయిలు సీ4 బోగీపై రాళ్లు రువ్వారు. దీంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. గతంలో ధర్మవరం- బత్తలపల్లి సమీపంలో దుండగులు రాళ్ల దాడికి పాల్పడగా, ఆ తర్వాత అనంతపురం సమీపంలో మరోసారి అదే రైలుపై రాళ్ల దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.

News April 18, 2024

స్వతంత్ర అభ్యర్థి‌గా నామినేషన్ వేస్తా: జయరాజు

image

బీజేపీ బహిష్కృత నేత, మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు స్వతంత్ర అభ్యర్థిగా నేడు (గురువారం) నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. ఈరోజు ఉదయం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా కురుపాంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అరకు పార్లమెంట్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నట్లు జయరాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి అభిమానులు హాజరవ్వాలని కోరారు. 

News April 18, 2024

తెనాలి: ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్‌నని బెదిరిస్తున్న వ్యక్తి.. కేసు నమోదు

image

పట్టణంలోని హోటల్ వ్యాపారస్థులకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అని ఫోన్ చేసి బెదిరిస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల తెలిపిన వివరాలు.. ఓ వ్యక్తి కొద్ది రోజుల నుంచి హోటల్ యాజమానులకు ఫోన్ చేసి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అని వ్యాపార వర్గాలను బెదిరిస్తున్నాడు. తెనాలి హోటల్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వాహకులు తెనాలి 2టౌన్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అతనిపై కేసు నమోదు చేశామన్నారు.