Andhra Pradesh

News April 18, 2024

నేటి నుంచే నామినేషన్: కడప కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికలకు ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విజయరామరాజు ప్రకటించారు. కడప కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నేటి నుంచి నామినేషన్ దాఖలుకు ఏర్పాట్లు పూర్తి చేశామని, అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయాలని, ఎంపీ అభ్యర్థి కడప కలెక్టర్ లో ఎన్నికల అధికారికి నామినేషన్ వేయవచ్చన్నారు. ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు.

News April 18, 2024

గుంటూరులో భారీగా నగదు, మద్యం సీజ్ 

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బుధవారం జిల్లాలో ప్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తాడికొండ నియోజకవర్గ పరిధిలో సరైన పత్రాలు చూపని రూ రూ.80వేల నగదు సీజ్ చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో జరిగిన తనిఖీలలో ఏప్రిల్ 17వ తేది సాయంత్రం 6 గంటల వరకు రూ.2,19,14,430లక్షల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు తెలిపారు. 

News April 17, 2024

అక్రమ రవాణ కట్టడికి పటిష్ఠ చర్యలు: ఎస్పీ

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టినట్లు నెల్లూరు ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. తనిఖీల్లో భాగంగా తగిన రశీదులు లేకుండా మనుబోలు పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 120 ఫ్యాన్లు, 24 కుక్కర్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఏఎస్ పేట పరిధిలో పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి 3500 నగదు, 255 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.

News April 17, 2024

స్థానిక సంస్థలను జగన్ నిర్వీర్యం చేశారు: ఎంపీ

image

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కీలకపాత్ర పోషించే స్థానిక సంస్థలను సీఎం జగన్ నిరంకుశ వైఖరితో నిర్వీర్యం చేసారని కూటమి ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ విమర్శించారు. సర్పంచుల పవర్ ఏంటో జగన్ కు రానున్న ఎన్నికల్లో తెలిసివస్తుందని ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురంలో బుధవారం ప్రజాగళం-బాబు సూపర్ సిక్స్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు.

News April 17, 2024

ఎన్నికలకు సిబ్బంది సిద్ధంగా ఉండాలి: ఎస్పీ రాధిక

image

ఈ నెల 18తేదిన నుంచి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నిర్వహణకు స్థానిక పోలీసు అధికారులు తగు జాగ్రత్తల చర్యలు చేపట్టాలని ఎస్పీ రాధిక ఆదేశించారు. ప్రశాంతంగా నామినేషన్ ప్రక్రియ పూర్తయిన వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్సైలు, సీఐలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సందర్శించాలన్నారు. క్షేత్రస్థాయిలో స్వయంగా ఆయా గ్రామాల కు వెళ్లి ప్రజలతో మమేకమవ్వాలన్నారు.

News April 17, 2024

తూ.గో: నామినేషన్లు స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి

image

తూ.గో జిల్లాలో గురువారం ఉదయం 11 గంటల నుంచి మ.3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించేందుకు అనుగుణంగా పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె.మాధవీలత తెలిపారు. పార్ల‌మెంటు స్థానాలకు పోటి చేసే అభ్య‌ర్ధులు ఆయా క‌లెక్ట‌రేట్‌లో, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్య‌ర్ధులు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌ధాన కేంద్రాల్లో నామినేష‌న్ల‌ను దాఖలు చేయాలన్నారు.

News April 17, 2024

శింగనమల: ఇసుక తవ్వకాలు ఆపండి.. రైతుల ఆవేదన

image

గార్లదిన్నె మండలం ఇల్లూరు గ్రామ పరిధిలో ఇసుక రవాణా చేస్తున్న వారిని గ్రామస్థులు అడ్డుకొని అక్కడ నుంచి టిప్పర్లు, హిటాచీలను తరలించారు. దయచేసి రైతులకు అన్యాయం చేయకండి.. ఇసుక లేకుంటే భూగర్భ జలాలు అడుగంటిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు  రైతుల గురించి అలోచించి ఇసుక రీచ్‌లకు అనుమతులివ్వకండి అని అధికారులు కోరుతున్నారు. ఇసుక తవ్వకాలు జరిగే చోటే తాగునీటి బోర్లు ఉన్నాయని తెలిపారు.

News April 17, 2024

ప.గో జిల్లాలో సీఎం జగన్ షెడ్యూల్ ఇలా

image

సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర గురువారం షెడ్యూల్ అధికారికంగా పార్టీ నాయకులు ప్రకటించారు. తణుకు మండలం తేతలి గ్రామ శివారులో బస చేసిన ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. తణుకు, పెరవలి, సిద్ధాంతం, రావులపాలెం, ఆలమూరు, కడియం మీదుగా కడియపులంక చేరుకుని అక్కడే మధ్యాహ్న భోజనం చేస్తారు.

News April 17, 2024

తిరుపతి MLA అభ్యర్థికి బీఫాం అందజేత

image

తిరుపతి జిల్లాలో గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈక్రమంలో జనసేన తిరుపతి MLA అభ్యర్థి శ్రీనివాసులు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా మంగళగిరిలో బీఫాం అందుకున్నారు. చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన వైసీపీని వీడి జనసేనలో చేరారు. ఆయనకే టికెట్ వచ్చింది. నాన్ లోకల్ అంటూ పలువురు ఆయన్ను వ్యతిరేకించినా అధినేత పవన్ అందరికీ సర్దిచెప్పారు.

News April 17, 2024

మాడుగుల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మారనున్నారా..?

image

మాడుగుల టీడీపీ అభ్యర్థిగా పైలా ప్రసాదరావును తప్పించి మాజీ మంత్రి బండారు సత్యనారాయణకు ఆసీటు కేటాయిస్తారని ఇటీవల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ తరుణంలో రేపు(గురువారం) మాడుగులలో బండారు పర్యటించనున్నట్లు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పీవీజీ కుమార్, మాజీ MLA గవిరెడ్డి రామానాయుడు తెలిపారు. ఆయన పర్యటన నేపథ్యంలో కార్యకర్తల్లో చర్చ మొదలైంది. కాగా.. ఆ సీటుపై రేపో ఎల్లుండో స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు సమాచారం.