Andhra Pradesh

News April 17, 2024

తూ.గో: వైసీపీకి ఇద్దరు ప్రముఖుల రాజీనామా

image

కమ్మ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పదవికి, వైసీపీ పార్టీ సభ్యత్వానికి కొటారు అశోక్ బాబా, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యుడు లంకసాని శ్రీనివాసరావు బుధవారం రాజీనామా చేశారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు ప్రెస్ క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ఇద్దరు నాయకులు త్వరలో టీడీపీలో చేరతామని వెల్లడించారు.

News April 17, 2024

VIDEO: సమస్యలను పరిష్కరించాలని విరుపాక్షిని  గ్రామస్థుల నీలదీత

image

ఆస్పరిలో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై వైసీపీ ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థి విరుపాక్షిని గ్రామస్థులు నిలదీశారు. వైసీపీ ప్రభుత్వంలో గ్రామంలో అభివృద్ధి జరగలేదని, సమస్యలను ఎందుకు పరిష్కరించలేదంటూ ఎన్నికల ప్రచారానికి
వచ్చిన విరుపాక్షిని ప్రశ్నించారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తానంటూ సముదాయించటానికి ప్రయత్నించినప్పటికీ
వినకపోవడంతో విరుపాక్షి అక్కడి నుంచి వెనుదిరిగారు.

News April 17, 2024

ఆనం చరిత్రహీనుడు: విజయసాయి రెడ్డి

image

మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డే టార్గెట్‌గా YCP నెల్లూరు MP అభ్యర్థి విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శులు చేశారు. ‘TDP నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఆనంకి రాజకీయంగా ప్రాధాన్యతనిచ్చి పెద్దోడిని చేసింది YSR. జగన్‌ను జైలుకు పంపిన కాంగ్రెస్‌ అధిష్ఠానం కుట్రలో భాగస్వామి అయ్యాడు. మళ్లీ జగన్ పంచన చేరి MLA అయినా వెన్నుపోటు గుణాన్ని పోనిచ్చుకోలేదు. ఈ వయసులో పార్టీ మారి చరిత్రహీనుడయ్యాడు’ అని ట్వీట్ చేశారు.

News April 17, 2024

నర్సీపట్నంలో టాలీవుడ్ హీరో ప్రచారం

image

మాకవరపాలెం మండలంలోని కొండల అగ్రహారంలో సినీ హీరో, ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ సోదరుడు సాయిరాం శంకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బుధవారం రాత్రి ఆయన ఇంటింటికి వెళ్లి ఈ ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యేగా గణేష్‌ను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీ సత్యనారాయణ, వైసీపీ నేతలు పాల్గొన్నారు.

News April 17, 2024

పిడుగురాళ్లలో గుర్తు తెలియని మృతదేహం కలకలం

image

మండలంలోని తుమ్మలచెరువు గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం పోలేరమ్మ గుడి వెనుక గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పిడుగురాళ్ల సీఐ ఆంజనేయులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వయస్సు 30 నుంచి 40 సంవత్సరాలు ఉంటుదని చెప్పారు. ఆచూకీ తెలిసిన వారు స్టేషన్‌కి సమాచారం ఇవ్వాలన్నారు. 

News April 17, 2024

తిరుపతి ప్రజల మనసులో ఏముందో..?

image

తిరుపతిలో గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే జనసేన,YCP అభ్యర్థులు శ్రీనివాసులు, భూమన అభినయ్ ప్రచారం చేస్తున్నారు. తొలుత జనసేన అభ్యర్థిని వ్యతిరేకించిన సుగుణమ్మ(TDP), కిరణ్ రాయల్(జనసేన) తదితర నేతలు సైతం ఇప్పుడు ఆయనకు మద్దతుగా ఇంటింటికీ తిరుగుతున్నారు. నాన్ లోకల్ వద్దు.. లోకల్ ముద్దు అని భూమన అంటున్నారు. ఎన్నికల నాటికి తిరుపతి ప్రజల నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి.

News April 17, 2024

నిబంధనలు తూచా తప్పక పాటించాలి: కడప కలెక్టర్

image

కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలను తూచా తప్పక పాటిస్తూ.. నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందని కడప జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.విజయ్ రామరాజు రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. సాధారణ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు గానీ, ప్రతిపాదకులు గానీ నామినేషన్లు దాఖలు చేసే సమయంలో నిబంధనలు పాటించాలన్నారు.

News April 17, 2024

కనిగిరి వ్యక్తికి యూపీఎస్సీ ఫలితాల్లో 504వ ర్యాంక్

image

కనిగిరికి చెందిన వంగిపురం రాహుల్ బుధవారం ప్రకటించిన యూపీఎస్సీ ఫలితాల్లో 504వ ర్యాంక్ సాధించారు. తల్లితండ్రులు వంగేపురం రతన్ కుమార్, వయోల రాణి, పెద్ద కుమారుడు రాహుల్ 1 నుంచి 5 వరకు కనిగిరిలో, 6-10 తరగతులు ఒంగోలులో, విజయవాడలో ఇంటర్ చదివారు. మొదటి ప్రయత్నంలోనే ర్యాంక్ సాధించిన రాహుల్ కు పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

News April 17, 2024

గుంటూరు: టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే 

image

తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే షేక్ నంబూరు సుభాని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో బుధవారం టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా  లోకేశ్ మాజీ ఎమ్మెల్యే నంబూరు సుభాని, పలువురు వైసీపీ నేతలు, మాజీ కార్పోరేటర్లకు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి మొహమ్మద్ నజీర్, తదితరులు పాల్గొన్నారు. 

News April 17, 2024

బిక్కవోలు: కాలువలో యువకుడి గల్లంతు

image

బిక్కవోలు మండలం కొమరిపాలెంలో కాలువలోకి దిగి ఓ యువకుడు గల్లంతైన ఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. అనపర్తి మండలం పీరా రామచంద్రపురానికి చెందిన మహేష్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు బిక్కవోలు మండలం కొమరిపాలెం వెళ్లారు. స్నేహితులతో కలిసి కాలవలోకి దిగిన మహేష్ గల్లంతయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు యువకుడి కోసం గాలిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.