Andhra Pradesh

News September 19, 2024

జిల్లాలో పారిశ్రామికాభివృద్ధిపై ప్రత్యేక చర్యలు: కలెక్టర్

image

నెల్లూరు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించి, జిల్లా పారిశ్రామికాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్‌ ఆనంద్‌ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లో పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. గత సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలను పరిశ్రమల శాఖ జీఎం సుధాకర్‌ కమిటీ సభ్యులకు వివరించారు.

News September 19, 2024

గుంటూరు: మాది మంచి ప్రభుత్వం: సీఎం

image

ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం అంకిత భావంతో నిర్ణయాలు తీసుకుంటున్న తమ ప్రభుత్వం మంచి ప్రభుత్వమని గురువారం సీఎం చంద్రబాబు ట్విట్టర్ లో పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయడమే కాకుండా అభివృద్ధికి సంబంధించి రాష్ట్రంలోని ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని నిర్ణయాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తున్నదన్నారు. 100 రోజుల్లో 100కు పైగా సంక్షేమ పథకాలు అమలు చేసిన మంచి ప్రభుత్వం అన్నారు.

News September 19, 2024

ఒంగోలు: వారంతా ఒక్కటయ్యారు.. ఫొటో వైరల్

image

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గురువారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. అయితే ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు రియాజ్, జనసేన రాష్ట్ర నాయకురాలు రాయపాటి అరుణను సైతం బాలినేని కలిశారు. ఈ కలయికతో జనసేనలో బాలినేని చేరికకు రియాజ్ అడ్డు తగులుతున్నారన్న వివాదానికి తెర పడింది. మొత్తం మీద వీరి కలయిక ఫొటో వైరల్‌గా మారింది.

News September 19, 2024

ఆంధ్రా-ఒడిశా అంతర్రాష్ట్ర రహదారిని విస్తరించండి: ఎంపీ

image

ఆంధ్ర- ఒడిశా అంతర్రాష్ట్ర రహదారిని నాలుగు లేన్ల రహదారిగా విస్తరించాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు, కేంద్ర రోడ్డు రవాణా& హైవేస్ మంత్రికి గురువారం వినతిపత్రాలు అందజేశారు. రామభద్రపురం-రాయగడ రహదారిని విస్తరించాలని, అలాగే, ప్రస్తుతం చాలా అధ్వానంగా ఉన్న కూనేరు-రాయగడ రహదారి మరమ్మతు పనులు చేపట్టాలని ఎంపీ కోరారు.

News September 19, 2024

స్వర్ణాంధ్ర-2047పై సమీక్ష నిర్వహించిన విశాఖ కలెక్టర్

image

స్వర్ణాంధ్ర-2047పై అందరికీ అవగాహన ఉండాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సూచించారు. కలెక్టరేట్లో గురువారం స్వర్ణాంధ్ర-2047పై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఐదేళ్లలో సాధించబోయే ప్రగతిపై ప్రణాళికలతో కూడిన నివేదికలను రూపొందించాలన్నారు. ప్రతి ఏటా 15% ఆర్థిక పురోగతి కనిపించాలన్నారు.

News September 19, 2024

శ్రీకాకుళంలో సీఎం పర్యటన వివరాలు

image

AP CM నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం పర్యటన షెడ్యూల్‌ను గురువారం సీఎం కార్యాలయం నుంచి ఒక ప్రకటనలో వెల్లడించారు. శుక్రవారం విశాఖపట్నం నుంచి హెలికాప్టర్‌లో మ.1:10కి కవిటి మండలం రాజపురం సమీపంలో వింధ్య గిరి వద్దకు చేరుకొని ముఖ్య నాయకులను కలుస్తారు. 1:45కు స్థానిక రామాలయాన్ని సందర్శిస్తారు. 2:15కు లబ్ధిదారులతో మాట్లాడుతారు. 3:15 వరకు రాజపురంలో సమావేశంలో పాల్గొంటారు.

News September 19, 2024

SKLM: విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ తాత్కాలిక వాయిదా

image

ఈ నెల సెప్టెంబరు 20వ తేదీ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరగనున్న విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్ కార్యక్రమం కొన్ని కారణాల వల్ల వాయిదా పడిందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. తిరిగి శుక్రవారం 27న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు వినతుల స్వీకరణ జరుగునని, ఈ తాత్కాలిక వాయిదాను (తేదీ మార్పును) విభిన్న ప్రతిభావంతులు గమనించాలని కోరారు.

News September 19, 2024

FLASH.. పవన్ కళ్యాణ్‌తో బాలినేని భేటీ

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కొద్దిసేపటి క్రితం విజయవాడలో కలిశారు. నిన్న YCPకి రాజీనామా చేసిన ఆయన ఇవాళ పవన్ కళ్యాణ్‌ను కలవడంతో జనసేనలో చేరుతారనే వార్తలకు బలం చేకూరాయి. ఈ నేపథ్యంలో ఆయన ఎప్పడు పార్టీలో చేరుతారు. ఈయనపై గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన జిల్లా జనసేన ఇన్‌ఛార్జ్ రియాజ్, MLA దామచర్ల ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది.

News September 19, 2024

రూ.33 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్ల అరెస్టు: ఎస్పీ

image

ధర్మవరంలో ముంబై పోలీసులమని చెప్పి సూర్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి నుంచి రూ.33 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ రత్న తెలిపారు. ధర్మవరం ఒకటో పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. నరేశ్ గోయల్ అనే వ్యక్తి రూ.500 కోట్లు బ్యాంక్‌లో రుణం తీసుకుని మీ ఖాతాకు రూ.20 లక్షలు మళ్లించారని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు వెల్లడించారు.

News September 19, 2024

సాగునీటి సలహా మండలి సమావేశం ప్రారంభం

image

అనంతపురం కలెక్టర్ కార్యాలయంలోని రెవెన్యూ భవనంలో సాగునీటి సలహా మండలి సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో సాగునీటి సలహా మండలి సమావేశం జరగగా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీశ్, జడ్పీ ఛైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, అనంతపురం, రాయదుర్గం, గుంతకల్లు, కళ్యాణదుర్గం, శింగనమల, తాడిపత్రి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.