Andhra Pradesh

News April 17, 2024

పెడన చేరుకున్న చంద్రబాబు.. మరికాసేపట్లో ప్రజాగళం సభ

image

టీడీపీ అధినేత చంద్రబాబు పెడన చేరుకున్నారు. ప్రజాగళం సభలో పాల్గొనేందుకు గాను చంద్రబాబు గన్నవరం నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో బయలుదేరి పెడన చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద మచిలీపట్నం, పెడన అభ్యర్థులు కొల్లు రవీంద్ర, కృష్ణప్రసాద్ ఆయనకు స్వాగతం పలికారు. హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గాన పెడన బస్టాండ్ సెంటర్‌లోని సభా స్థలికి చంద్రబాబు బయలుదేరి వెళ్లారు. మరికాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా రానున్నారని సమాచారం.

News April 17, 2024

18 నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది: కలెక్టర్

image

కర్నూలు కలెక్టరేట్‌లోని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో బుధవారం సాధారణ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల మీడియా సెంటర్‌ను కలెక్టర్ డాక్టర్ సృజన ప్రారంభించారు. అనంతరం నామినేషన్ ప్రక్రియ, ఎన్నికల సంసిద్ధతపై మీడియాతో మాట్లాడారు. 18వ తేదీ 11 గంటల నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. నామినేషన్‌కు 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంటుందన్నారు.

News April 17, 2024

బొల్లాపల్లి: అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

image

అప్పులబాధ తాళలేక పురుగు మందు తాగి రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల మేరకు బొల్లాపల్లి మండలం రేమిడిచర్లకు చెందిన వెంకటేశ్వర్లు (44) అప్పుల బాధతో పురుగు మందు తాగి చికిత్స పొందుతూ.. మృతిచెందాడు. వెంకటేశ్వర్లు ఏప్రిల్ 14న పురుగు మందు తాగగా.. కుటుంబ సభ్యులు అతనిని చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారన్నారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. రైతు మృతిచెందాడని చెప్పారు. 

News April 17, 2024

19న నామినేషన్ పెద్దిరెడ్డి నామినేషన్

image

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ పుంగనూరు MLA అభ్యర్థిగా ఈనెల 19న శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు తరలి రావాలని చౌడేపల్లి వైస్ ఎంపీపీ సుధాకర్ రెడ్డి కోరారు. ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి చౌడేపల్లెకు చేరుకోవాలని సూచించారు. అనంతరం భారీ ర్యాలీగా పుంగనూరుకు వెళ్తామన్నారు.

News April 17, 2024

పశ్చిమ ఏలేరు కాలువలో మృతదేహం అలజడి

image

సామర్లకోట పశ్చిమ ఏలేరు కాలువలో మృతదేహం అలజడి సృష్టించింది.గుర్రపు డెక్కల మధ్య మృతదేహం ఉన్నట్లు పశువుల కాపర్లు గుర్తించి, స్థానికులకు సమాచారం అందించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. మహిళ మృతదేహంగా గుర్తించారు. సామర్లకోట సీఐ సురేష్ ఎస్‌ఐ మౌనిక మూర్తి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఇటీవల సామర్లకోటలో ఒక వివాహిత అదృశ్యమైనట్లు ఫిర్యాదు రావడం, మృతదేహం లభించడంతో అదృశ్యమైన మహిళదిగా భావిస్తున్నారు.

News April 17, 2024

కావలి: ఐదుగురి మరణానికి కారణం అదే..!

image

నిన్న కావలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. జలదంకి(M) చామదల SC కాలనీకి చెందిన శ్రీనివాసులు HYDలో పనిచేస్తున్నారు. శ్రీరాముల కళ్యాణం జరిపించడానికి సొంతూరికి వచ్చారు. భార్య వరమ్మ, సోదరి లక్ష్మమ్మ, ఆమె కోడలు నీలిమ, మనవడు నందు(2)తో కలిసి కారులో కావలికి బయలుదేరారు. జలదంకి మీదుగా దగ్గరైనా.. రోడ్డు గుంతలమయంగా ఉండటంతో బిట్రగుంట మీదుగా వచ్చారు. ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో అందరూ చనిపోయారు.

News April 17, 2024

గూడూరు: జాతీయ రహదారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

image

మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారి గూడూరు వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి మచిలీపట్నం వైపు వస్తున్న ఓ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్రగాయాలు కాగా అతని భార్య అక్కడికక్కడే మృతి చెందింది. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని 108లో మచిలీపట్నం తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 17, 2024

ప.గో: బిల్డింగ్ పై నుంచి కింద పడి కార్మికుడు మృతి

image

గోపాలపురం మండలం బీమోలు గ్రామంలో పండగ నాడు విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో బిల్డింగ్ పైన పనులు చేస్తున్న కార్మికుడు ప్రమాదశాత్తు బిల్డింగ్ పై నుంచి కింద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. హుటాహుటిన క్షతగాత్రుణ్ణి గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు యాసిన్ (40)గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసునమోదు చేశారు.

News April 17, 2024

అండర్-14 బాలుర క్రికెట్ విజేత ఇచ్ఛాపురం

image

ఆల్ ఇండియా అండర్-14 బాలుర క్రికెట్ టోర్నమెంట్‌లో ఇచ్ఛాపురం క్రికెట్ క్లబ్ (ఆంధ్ర ప్రదేశ్) విజేతగా నిలిచింది. ఒడిశా రాష్ట్రం కుర్దాలో జరిగిన టోర్నమెంట్‌లో ఛత్తీస్‌గడ్, ఝార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, దిల్లీ, బీహార్, తమిళనాడు తరఫున జట్లు పాల్గొన్నాయి. ఇచ్ఛాపురం క్రికెట్ క్లబ్ (ఐసీసీ) ఫైనల్‌లో ఝార్ఖండ్ పై గెలిచి విజేతగా నిలిచినట్లు కోచ్ గోపి తెలిపారు.

News April 17, 2024

అనంత: Way2 News శ్రీరామనవమి స్పెషల్

image

లేపాక్షి ఆలయాన్నికి రామాయణంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. రావణాసురుడు సీతమ్మవారిని అపహరించుకుని తీసుకెళుతుండగా కూర్మ పర్వతంపైన జటాయువు అడ్డగిస్తాడు. రావణుడు అడ్డొచ్చిన ఆ పక్షి రెక్కలు నరికివేయగా ఈ స్థలంలో పడిపోయింది. సీతాన్వేషణలో ఈ స్థలానికి వచ్చిన శ్రీరాముడు విషయం తెలుసుకుని ఆ పక్షికి మోక్షమిచ్చి లే పక్షీ అని పలికాడు. ఆ పదమే కాలక్రమేణా లేపాక్షిగా మారిందని స్థలపురాణం.