Andhra Pradesh

News April 17, 2024

కడప: సెల్‌ఫోన్‌లోనే అసలు నిజం?

image

కడప YVUలో ఆదివారం విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. రంజాన్‌కు ఇంటికి వెళ్లి తిరిగి వచ్చిన సుల్తానా(23) మరుసటి రోజు కాలేజ్‌కు వెళ్లి అరగంట ముందే హాస్టల్‌కు వచ్చి ఉరివేసుకున్నట్లు తోటి విద్యార్థినిలు తెలిపారు. అయితే ఆత్మహత్యకు పాల్పడే ముందు ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడిందని చెప్పారు. దీంతో ఫోన్‌కాల్‌పై అనుమానం వ్యక్తం చేసి సెల్‌ఫోన్‌ను సీజ్ చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

News April 17, 2024

గుర్రంకొండ: విషం తాగి ఇద్దరి ఆత్మహత్యాయత్నం

image

గుర్రంకొండ దవలత్ ఖాన్ పల్లికి చెందిన ఇద్దరు వాస్మాల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం.. గ్రామానికి చెందిన ఒకరి భార్య మరోక పురుషుడితో ఒకచోట ఉండగా భర్త గమనించి భార్యను మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె వాస్మొల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి కూడా విషం తాగేశాడు. ఇద్దరిని వేరువేరు వాహనాల్లో మదనపల్లికి తరలించారు.

News April 17, 2024

శ్రీకాకుళం: శ్రీరామనవమి శుభాకాంక్షలతో సైకత శిల్పం

image

ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలస సమీపంలో గల శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం కొండ దిగువన శిల్పి గేదెల హరికృష్ణ రూపొందించిన శ్రీరాముని సైకత శిల్పం పలువురిని ఆకట్టుకుంది. శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సైకత శిల్పం రూపొందించినట్లు హరికృష్ణ పేర్కొన్నారు. ఈ సైకత శిల్పాన్ని మంగళవారం తిలకించిన పలువురు భక్తులు ఆయనను అభినందించారు.

News April 17, 2024

కర్నూలు: క్లస్టర్ యూనివర్సిటీలో సెమిస్టర్ పరీక్షలు

image

కర్నూలులోని క్లస్టర్ యూనివర్సిటీ అనుసంధానంలో ఉన్న కే.వీ.ఆర్ డిగ్రీ కాలేజ్, సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్ కాలేజీలలో సెమిస్టర్ 2, 4వ రెగ్యులర్, సప్లమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.రేపటి నుంచి మే 3వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ డీవీఆర్ సాయి గోపాల్ తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు హాల్ టికెట్, ఐడి కార్డ్, యూనిఫామ్ తప్పనిసరి అన్నారు.

News April 17, 2024

గుంటూరు జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలివే.!

image

గుంటూరులో బుధవారం లీటర్ పెట్రోల్ ధర రూ.109.73, లీటర్ డీజిల్ ధర రూ.97.56గా ఉంది. పది రోజులుగా వీటి ధరలు నిలకడగానే ఉన్నాయి. బాపట్లలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.98 ఉండగా, డీజిల్ ధర రూ.96.85గా ఉంది. పల్నాడులో డీజిల్ ధర రూ.97.42 ఉండగా, పెట్రోల్‌ను రూ.109.60కి విక్రయిస్తున్నారు.

News April 17, 2024

సీతమ్మ కుడి వైపు ఉన్న ఆలయం ఎక్కడ ఉందో తెలుసా

image

తిరుపతి శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయం క్రీస్తు పూర్వం 1402లో నరసింహ మొదలియార్ నిర్మించారు. ఇక్కడ సీతమ్మ రాముల వారికి కుడి వైపున, లక్ష్మణుడు ఎడమవైపున దర్శనమిస్తారు. తిరుమల శ్రీవారిని పోలిన విధంగా రాముడు దర్శనమిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఉన్న సీతారాముల విగ్రహాలలో కూడా ఇలాగే సీతమ్మ కుడి వైపు ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఆలయానికి ఎదురుగా ప్రసన్న ఆంజనేయస్వామి వారు కొలువై ఉన్నారు.

News April 17, 2024

కాకినాడ: దేశంలోనే రాత్రిపూట పెళ్లి జరిగే ఏకైక ఆలయం ఇదే..

image

సీతారాముల కళ్యాణాన్ని నేటి రాత్రి జరిపించేందుకు గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ఏర్పాట్లుచేశారు. రాత్రి 9 గంటలకు కళ్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త వెంకట దివాకర్, ఈవో అశ్విని తెలిపారు. దేశంలో రాత్రిపూట కళ్యాణం జరిగే ఏకైక ఆలయం కావడం విశేషం. పూర్వం పిఠాపురం మహారాజు భద్రాచలంలో సీతారాముల కళ్యాణం తిలకించి, చేబ్రోలు వచ్చేసరికి రాత్రి అయ్యేదట. అప్పటినుంచి రాత్రి జరిపించడం ఆనవాయితీగా మారింది.

News April 17, 2024

VZM: సాఫ్ట్‌వేర్ వదిలి IAS కోసం ప్రయత్నం

image

గంట్యాడ మండలం పెదవేమలికి చెందిన పి భార్గవ్ మంగళవారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 590 ర్యాంక్ సాధించారు. 2016లో బీటెక్ పూర్తిచేసి సాఫ్ట్‌వేర్‌‌లో చేరిన అతను IAS లక్ష్యంతో 2018లో ఉద్యోగాన్ని వదులుకున్నాడు. గతేడాది ఫలితాల్లో 722 ర్యాంక్ సాధించాడు. దీంతో IDASలో శిక్షణ పొందుతున్నాడు. తాజా ర్యాంక్‌తో IPS, IRS మాత్రమే వచ్చే అవకాశం ఉన్నందున IAS కోసం మళ్లీ ప్రయత్నిస్తానని తెలిపారు.

News April 17, 2024

విశాఖ: సివిల్స్‌‌లో మెరిసిన హనిత ..887 ర్యాంక్

image

యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసిన సివిల్స్ తుది ఫలితాల్లో విశాఖకి చెందిన వేములపాటి హనిత 887 ర్యాంకుతో మెరిశారు. గతేడాది గ్రూప్-1లో రాణించి వైద్యారోగ్యశాఖలో కొలువు సాధించిన ఈమె ఏడాది తిరక్కుండానే సివిల్స్‌లో సత్తాచాటారు. మూడు ప్రయత్నాల్లో మెయిన్స్ వరకు వచ్చి ఆగిపోయిన హనిత నాలుగో ప్రయత్నంలో విజయం సాధించి తన కలను నెరవేర్చుకున్నారు.

News April 17, 2024

ఫాం-6, 8 పరిష్కారం: జిల్లా కలెక్టర్

image

కొత్త ఓటర్ల నమోదు, ఓటరు జాబితాలో ఇంటి చిరునామా మార్పు కోసం ఫాం-6, 8ల క్లెయిమ్స్ ఈ నెల 25లోపు పరిష్కరించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం అనంత కలెక్టర్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ నెల 14 దాకా ఆ రెండు రకాల ఫారాలను తీసుకున్నాం. ఇప్పటిదాకా వచ్చిన వాటిని పరిష్కరించే దిశగా కసరత్తు సాగుతోందన్నారు.