Andhra Pradesh

News April 17, 2024

VZM: ట్రైనీ నర్సుపై అత్యాచారయత్నం

image

ట్రైనీ నర్సుపై యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన విజయనగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. గంట్యాడ మం.కి చెందిన గోపీ తన తల్లిని వారం క్రితం ఆస్పత్రిలో చేర్చాడు. మంగళవారం రాత్రి విధుల్లో ఉన్న నర్సు మంచినీరు తాగేందుకు గదిలోకి వెళ్లగా ఆమె వెనకే వెళ్లి తలుపులు వేసి అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఆమె గట్టిగా అరవడంతో సిబ్బంది చేరుకున్నారు. మద్యం మత్తులో ప్రవర్తించినట్లు వైద్యులు తెలిపారు.

News April 17, 2024

నెల్లూరు : నామినేషన్ కేంద్రాలివే…

image

సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభం కానుంది. నెల్లూరు ఎంపీ స్థానానికి కలెక్టరేట్ లో, కందుకూరుకు సబ్ కలెక్టర్ ఆఫీసులో, కావలికి ఆర్డీఓ ఆఫీసులో, ఆత్మకూరుకు మున్సిపల్ ఆఫీసులో, కోవూరుకు కోవూరు తహశీల్దార్ ఆఫీసులో, నెల్లూరు సిటీకి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో, నెల్లూరు రూరల్ కు ఆర్డీఓ ఆఫీసులో, సర్వేపల్లికి వెంకటాచలం ఎంపీడీఓ ఆఫీసులో, ఉదయగిరికి ఉదయగిరి తహశీల్దార్ ఆఫీసులో స్వీకరిస్తారు

News April 17, 2024

సివిల్స్‌లో గోదారి బిడ్డకు SUPER ర్యాంక్

image

ప.గో. జిల్లా కాళ్ల మండలం సీసలికి చెందిన గణేశ్న భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష UPSC ఫలితాల్లో అద్భుత ప్రతిభ చాటారు. జాతీయ స్థాయిలో 198 ర్యాంకు సాధించి ఔరా అనిపించారు. గతంలో గ్రూప్-1 పరీక్షల్లో ఉత్తమ ర్యాంకు సాధించగా.. డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. కాగా ఈమె తండ్రి రామాంజనేయులు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి ఉష గృహిణి.

News April 17, 2024

నేడు కృష్ణా జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన

image

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన కార్యాలయం రూట్ మ్యాప్ విడుదల చేసింది. మధ్యాహ్నం 2: 15 నిమిషాలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ చేరుకుని అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా పెడన వెళతారు. పెడనలో 3 PM- 4:30 PM మధ్య నిర్వహించే ప్రజాగళం సభలో చంద్రబాబుతో కలిసి పాల్గొంటారు. అనంతరం 7 గంటలకు మచిలీపట్నం కోనేరు సెంటరులో నిర్వహించే వారాహి విజయభేరిలో పాల్గొంటారని తెలిపింది.

News April 17, 2024

గుంటూరు: నేడు టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే.?

image

మాజీ MLA నంబూరు సుభాని నేడు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఆయన తన తనయుడు, డిప్యూటీ మాజీ మేయర్ గౌస్‌తో కలిసి చంద్రబాబు, లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. 2004లో గుంటూరు తూర్పు నుంచి సుభాని గెలిచారు. 2014, 19 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపునకు పని చేశారు. టీడీపీలో చేరేందుకు సిద్ధమైన సుభాని, ఉండవల్లికి కార్లతో ర్యాలీగా వెళ్లనున్నట్లు సమాచారం.

News April 17, 2024

విశాఖ: రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి

image

దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో వడ్లపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందింది. కణితి గవర వీధికి చెందిన ఎం.మణి (63) మంగళవారం మధ్యాహ్నం కణితి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సైకిల్‌పై వెళ్లారు. తిరిగి వస్తుండగా వడ్లపూడి వద్ద ప్రధాన రహదారిపై వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. సమీపంలో ఆసుపత్రికి తీసుకువెళ్లగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు.

News April 17, 2024

ఏలూరు: యువతిపై అత్యాచారం.. పదేళ్ల జైలు

image

ఏలూరు జిల్లా పెదపాడు పోలీసు స్టేషన్‌ పరిధిలో యువతిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడు సాక శివకు పదేళ్ల జైలు శిక్ష, రు.2500/- జరిమానా విధించినట్లు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.వి.రామాంజనేయులు తెలిపారు. 2021 ఆగస్టులో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారని, సాక్షులను విచారించిన కోర్టు ఈ రోజు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించిందని పేర్కొన్నారు.

News April 17, 2024

కడప: ఎన్నికల బరిలో రాజకీయ కురువృద్ధులు

image

కడప జిల్లా ఎన్నికల బరిలో రెండు నియోజకవర్గాల అభ్యర్థులు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నారు. ప్రొద్దుటూరు నుంచి నంద్యాల వరదరాజులరెడ్డి TDP తరఫున పోటీ చేస్తున్నారు. ఈయన గతంలో 5 సార్లు MLAగా గెలిచారు. అటు మైదుకూరు నుంచి రఘురామిరెడ్డి 4 సార్లు MLAగా గెలిచారు. మరోసారి YCP నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు. వీరిద్దరూ స్వాతంత్ర్యం రాకముందు జన్మించారు. రాష్ట్రంలో ఎక్కువ వయస్సు ఉన్న అభ్యర్థులు వీరే కావడం విశేషం.

News April 17, 2024

ప్రకాశం: మాజీ కానిస్టేబుల్‌కు సివిల్స్‌లో 780వ ర్యాంక్

image

జిల్లాలోని సింగరాయకొండ మండలం ఊళ్లపాలెంకి చెందిన మూలగాని ఉదయ్ కృష్ణారెడ్డి సివిల్స్ పరీక్షలో జాతీయ స్థాయిలో 780 ర్యాంక్ సాధించారు. ఉదయ్ కృష్ణారెడ్డి గతంలో ఒంగోలులో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్‌కు ప్రిపరేషన్ మొదలు పెట్టారు. ఐఏఎస్ అవ్వాలన్నా దృఢ సంకల్పంతో చదివి ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాడు. ఈ సందర్భంగా పలువురు ఉదయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

News April 17, 2024

కర్నూలు : ఎవరెవరు ఎక్కడ నామినేషన్ వేస్తారో తెలుసా?

image

జిల్లాలో 13న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనుండగా.. రేపటి నుంచి నామినేషన్లు వేసుకోవచ్చు.
కర్నూలు- కర్నూలు నగర పాలక సంస్థ
పాణ్యం- కలెక్టరేట్‌లోని జేసీ ఛాంబరు
పత్తికొండ- పత్తికొండ ఆర్డీవో ఆఫీస్
కోడుమూరు – కర్నూలు ఆర్డీవో ఆఫీస్
ఎమ్మిగనూరు- ఎమ్మిగనూరు తహశీల్దార్ ఆఫీస్
మంత్రాలయం- మంత్రాలయం తహశీల్దార్ ఆఫీస్
ఆదోని- ఆదోని సబ్ కలెక్టర్ ఆఫీస్
ఆలూరు- ఆలూరు తహశీల్దార్ ఆఫీస్ లో నామినేషన్ వేయవచ్చు.