Andhra Pradesh

News April 17, 2024

కర్నూలు : ఎవరెవరు ఎక్కడ నామినేషన్ వేస్తారో తెలుసా?

image

జిల్లాలో 13న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనుండగా.. రేపటి నుంచి నామినేషన్లు వేసుకోవచ్చు.
కర్నూలు- కర్నూలు నగర పాలక సంస్థ
పాణ్యం- కలెక్టరేట్‌లోని జేసీ ఛాంబరు
పత్తికొండ- పత్తికొండ ఆర్డీవో ఆఫీస్
కోడుమూరు – కర్నూలు ఆర్డీవో ఆఫీస్
ఎమ్మిగనూరు- ఎమ్మిగనూరు తహశీల్దార్ ఆఫీస్
మంత్రాలయం- మంత్రాలయం తహశీల్దార్ ఆఫీస్
ఆదోని- ఆదోని సబ్ కలెక్టర్ ఆఫీస్
ఆలూరు- ఆలూరు తహశీల్దార్ ఆఫీస్ లో నామినేషన్ వేయవచ్చు.

News April 17, 2024

యల్లనూరు: మహిళా టీచర్ సస్పెండ్

image

యల్లనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులురాలిగా విధులు నిర్వహిస్తున్న విజయకుమారిని సస్పెండ్ చేసినట్లు ఉప విద్యాశాఖ అధికారి శ్రీనివాస రావు తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది వివరాలు వాట్సాప్ గ్రూపులలో నిబంధనలకు విరుద్ధంగా పంపడంతో చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

News April 17, 2024

తూ.గో.: సీతారాముల కళ్యాణానికి 24 ఏళ్లుగా..

image

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఒంటిమిట్ట, భద్రాచలంలో నిర్వహించే సీతారాముల కళ్యాణోత్సవాలకు మండపేటకు చెందిన కేవీఏ.రామారెడ్డి 24 ఏళ్లుగా అలంకరించిన బోండాలను అందిస్తున్నారు. అక్కడ పరిణయోత్సవం ముగిసిన తర్వాత వాడపల్లి వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం, జి.మామిడాడ, సత్యవాడ, రామతీర్థంలో నిర్వహించే వేడుకలకు ఇస్తారని తెలిపారు.

News April 17, 2024

మదనపల్లి సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ మృతి

image

మదనపల్లి స్పెషల్ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.  పెద్దపంజాణి మండలం ముత్తుకూరుకు చెందిన మొగిలప్ప(67), సారా కేసులో అరెస్ట్ అయ్యాడు. పోలీసులు మొగిలప్పను తీసుకొచ్చి మదనపల్లి స్పెషల్ సబ్ జైల్లో ఉంచారు. రిమాండ్ ఖైదీగా ఉన్న మొగిలప్ప బుధవారం ఉదయం తను ఉంటున్న బ్యారక్ లోనే కుప్పకూలిపోవడం గుర్తించిన జైలర్లు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడు

News April 17, 2024

సివిల్స్‌లో సిక్కోలు కుర్రోడు సత్తా

image

శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం అల్లాడపేటకు చెందిన బాన్న వెంకటేష్ సివిల్స్‌లో సత్తా చాటాడు. NITలో ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఆయన ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూనే సివిల్స్ కోచింగ్ తీసుకుని 467 ర్యాంకు సాధించి ఔరా అనిపించారు. వెంకటేష్ తండ్రి చంద్రరావు, తల్లి రోహిణి వ్యవసాయం చేస్తూ.. గ్రామంలోనే చిరు వ్యాపారం చేస్తున్నారు. రెండో కుమారుడు వంశీ శ్రీహరికోటలో శాస్త్రవేత్తగా చేస్తున్నాడు.

News April 17, 2024

నెల్లూరు: శ్రీరాముడు నడియాడిన ప్రాంతం ఇక్కడే..

image

రామతీర్థం గ్రామం సముద్రతీరాన ఉంది. స్థల పురాణం ప్రకారం.. సీతాన్వేషణకు వెళుతున్నశ్రీరాముడు ఒకరోజు ఈ ప్రాంతానికి వచ్చి సూర్యోదయసమయంలో శివుణి ప్రతిష్ఠించి అర్చన చేశాడు. రాములవారి పాదస్పర్శ ఏర్పడిన ఈక్షేత్రం “రామతీర్థం” గానూ, శ్రీరాముడు ప్రతిష్ఠించిన లింగం గనుక శ్రీ రామలింగేశ్వరస్వామి గానూ పూజలందుకుంటున్నాడు. 14వ శతాబ్దంలో పల్లవరాజులు స్వామివారికి దేవాలయం నిర్మించారని ఇక్కడ చారిత్రికఆధారాలు ఉన్నాయి.

News April 17, 2024

ప.గో.: నేడు CM జగన్ బస్సు యాత్రకు BREAK

image

మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్రకు నేడు విరామం ఇచ్చారు. తణుకు మండలం తేతలిలో రాత్రి బస చేసిన ఆయన బుధవారం రాత్రి కూడా సైతం ఇక్కడే బస చేయనున్నారు. రోజంతా శిబిరంలో ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తిరిగి గురువారం ఉదయం యాత్ర ప్రారంభం కానుంది. శిబిరం నుంచి బయలుదేరి తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లనున్నారు.

News April 17, 2024

శ్రీకాకుళం: 17న అండర్-19 క్రికెట్ జట్టు ఎంపికలు

image

శ్రీకాకుళం జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన అండర్- 19 బాలుర క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు ఆ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు పుల్లెల శాస్త్రి, హసన్ తెలిపారు. 2005 సెప్టెంబరు 1వ తేదీ తర్వాత జన్మించిన వారు పోటీలకు అర్హులని పేర్కొ న్నారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఆరోజు ఉదయం 9 గంటలకు ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని చెప్పారు. వివరాలకు 92466 31797 నంబర్‌కు సంప్రదించాలన్నారు.

News April 17, 2024

విశాఖ: పెన్సిల్ ముల్లుపై శ్రీరాముడి రూపం

image

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లుకి చెందిన సూక్ష్మ కళాకారుడు గట్టెం వెంకటేశ్ పెన్సిల్ ముల్లుపై శ్రీరాముడి రూపాన్ని అద్భుతంగా చెక్కారు. ఇప్పటికే గిన్నీస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి, ఎన్నో అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. తాజాగా 6 హెచ్‌బీ పెన్సిల్ ముల్లుపై, 6 గంటల పాటు శ్రమించి 8మి.మీ వెడల్పు, 20మి.మీ పొడవులో శ్రీరాముడి రూపాన్ని చెక్కారు. 

News April 17, 2024

తిరుపతి జిల్లాలో ఎన్ని ఎపిక్ కార్డులు ప్రింట్ అయ్యాయో తెలుసా

image

జిల్లాలో 2023 జనవరి 6 నుండి 2024 మార్చి 30 వరకు మొత్తం 337130 ఎపిక్ కార్డులను జనరేట్ చేయగా 314710 ప్రింట్ చేసి జిల్లా కలెక్టర్ నుంచి పోస్టల్ శాఖకు పంపారు. పోస్టల్ ద్వారా 265823 ఓటర్లకు పంపిణీ చేయగా అందులో 12875 రిటర్న్ రావడంతో బిఎల్ఓల ద్వారా 10439 ఓటర్ కార్డులు పంపిణీ చేసారు. బిఎల్ఓ వద్ద 2436, పోస్టల్ శాఖ వద్ద 60,868 ఓటర్ కార్డులు పంపిణీ కి సిద్ధంగా ఉన్నాయి.