Andhra Pradesh

News April 17, 2024

కాకినాడ: అచ్చంపేటలో 19న మేమంతా సిద్ధం సభ

image

కాకినాడ రూరల్‌ మండలం తిమ్మాపురం పరిధిలోని అచ్చంపేటలో ఈ నెల 19వ తేదీన సీఎం జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం సభ జరగనుంది. ఈ సందర్భంగా సభా ఏర్పాట్లను రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తదితరులు మంగళవారం పరిశీలించారు. సభా వేదిక, ర్యాంపు ఏర్పాటు, ప్రజలకు ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌, తదితరులు ఉన్నారు.

News April 17, 2024

విశాఖ: సివిల్స్ ఫలితాల్లో 545వ ర్యాంకు

image

అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ తుది ఫలితాలు మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలానికి చెందిన విద్యార్థి సత్తా చాటారు. హుకుంపేట మండలంలోని అండిభ గ్రామానికి చెందిన చిట్టపులి నరేంద్ర పడాల్ అనే విద్యార్థి జాతీయ స్థాయిలో 545 ర్యాంకు సాధించారు. ఈమేరకు ఆయనను పలువురు అభినందించారు.

News April 17, 2024

విశాఖలో పెన్సిల్ ముల్లుపై శ్రీరాముడి రూపం

image

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లుకి చెందిన సూక్ష్మ కళాకారుడు గట్టెం వెంకటేశ్ పెన్సిల్ ముల్లుపై శ్రీరాముడి రూపాన్ని అద్భుతంగా చెక్కారు. ఇప్పటికే గిన్నీస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి, ఎన్నో అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. తాజాగా 6 హెచ్‌బీ పెన్సిల్ ముల్లుపై, 6 గంటల పాటు శ్రమించి 8మి.మీ వెడల్పు, 20మి.మీ పొడవులో శ్రీరాముడి రూపాన్ని చెక్కారు.

News April 17, 2024

సివిల్స్‌లో మెరిసిన శాసనమండలి ఛైర్మన్ తనయుడు

image

శాసనమండలి ఛైర్మన్ కొయ్యె మోషేను రాజు తనయుడు చిట్టి రాజు ఈరోజు విడుదలైన 2024 సివిల్స్ ఫలితాల్లో 833వ ర్యాంక్ సాధించారు. సంతోషం వ్యక్తం చేసిన శాసనమండలి ఛైర్మన్ కుటుంబ సభ్యులు ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చిట్టి రాజును పట్టణంలోని పలువురు ప్రముఖులు అభినందించారు.

News April 17, 2024

నెల్లూరును ఇండస్ట్రియల్  కారిడార్‌గా అభివృద్ధి చేస్తా: వేమిరెడ్డి

image

తాను గెలిస్తే నెల్లూరును ఇండస్ట్రియల్ కారిడార్‌గా అభివృద్ధి చేస్తానని నెల్లూరు టిడిపి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మంగళవారం రామలింగపురం, ముత్యాలపాలెం ప్రాంతాలలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే పరిశ్రమలు వస్తాయని, యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

News April 17, 2024

అనంతపురం : JNTUలో ఎంటెక్ ఫలితాలు విడుదల

image

అనంతపురం JNTU పరిధిలో నిర్వహించిన M.Tech 1వ, 3వ సెమిస్టర్ (ఆర్21) రెగ్యులర్, సప్లిమెంటరీ, M.Tech 1వ, 3వ సెమిస్టర్ (ఆర్17) సప్లిమెంటరీ, M.Tech  2వ సెమిస్టర్ (ఆర్21), (ఆర్17) సప్లిమెంటరీ ఫలితాలను మంగళవారం విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ బి.చంద్రమోహన్రెడ్డి తెలిపారు. పరీక్ష ఫలితాల కోసం www.jntua.ac.in ను సంప్రదించాలని సూచించారు.

News April 17, 2024

కృష్ణా: పీజీ పరీక్షల రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

image

కృష్ణా వర్సిటీ పరిధిలో డిసెంబర్ 2023లో నిర్వహించిన Mcom, MA, MED, MHR, SWO 3వ సెమిస్టర్ పరీక్షలకు(2022-23 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఏప్రిల్ 22వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.9,00 చెల్లించాల్సి ఉంటుందని పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు. వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడాలన్నారు.

News April 17, 2024

శ్రీకాకుళం: శ్రీరామనవమి.. బంగారంతో సూక్ష్మ రామబాణం

image

శ్రీకాకుళంలోని పలాస మండలం కాశీబుగ్గ మున్సిపాలిటీకి చెందిన సూక్ష్మకళాకారుడు కొత్తపల్లి రమేష్ ఆచారి రామభక్తి చాటుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా బంగారంతో సూది మీద నిలబడే రామబాణంను మంగళవారం తయారుచేశారు. ఏటా వివిధ ప్రత్యేకతలు కలిగిన రోజుల్లో ఆయా పండగలకు తగ్గట్టుగా సూక్ష్మ ఆకృతులు తయారుచేయడం అలవాటు అని చెబుతున్నారు.  

News April 17, 2024

కాకినాడ: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి.. ఎవరికీ తెలియకుండా ఖననం

image

రౌతులపూడి మండలం గిడజాంకు చెందిన పూడి తాతాజీ తన కౌలు భూమిలో కొబ్బరి మొక్కలు వేసి రక్షణకు విద్యుత్ తీగలు అమర్చాడు. సోమవారం అదే గ్రామానికి చెందిన సత్తిబాబు(42) గేదెలు మేపేందుకని వెళ్లి ఆ తీగలు తగిలి చనిపోయాడు. తాతాజీ భయంతో మృతదేహాన్ని ఖననం చేశాడు. రాత్రయినా సత్తిబాబు ఇంటికి రావట్లేదని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. వారు రంగంలోకి దిగి తాతాజీని విచారించగా నిజం ఒప్పుకున్నాడు. కేసు నమోదైంది.

News April 17, 2024

ప్రకాశం: ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల

image

ఇంటర్ అడ్మిషన్లపై షెడ్యూల్ ను బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ విడుదల చేసినట్లు ఆర్ ఐవో సైమన్ విక్టర్ తెలిపారు. అడ్మిషన్లను రెండు దశల్లో నిర్వహిస్తారు. మే 15 నుంచి కళాశాలల్లో దరఖాస్తులు విక్రయిస్తారు. మే 22నుంచి విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తారు. రెండో దశ అడ్మిషన్లకు జూన్ 10నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. జూలై 1కి అడ్మిషన్లు పూర్తి చేయాలి.