Andhra Pradesh

News April 17, 2024

చిత్తూరు: తమ్ముడిని తుపాకీతో కాల్చిన అన్న

image

గుర్రంకొండ మండలం తుమ్మల గొందిలో భూ వివాదం తలెత్తి తమ్ముడిని అన్న తుపాకీతో కాల్చి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. బాధితుని కథనం.. మండలంలోని తుమ్మల గొంది హరిజనవాడలో కాపురం ఉంటున్న బాలపోగు విశ్వనాథ(45)కు అతని అన్న బాలపోగు జయప్పకు కొంతకాలంగా భూ వివాదమై గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రాత్రి ఇద్దరూ గొడవపడగా జయప్ప తుపాకీతో కాల్చారు.

News April 17, 2024

నెల్లూరు నగరంలో పలువురు టీడీపీలో చేరిక

image

నెల్లూరు సిటీ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ ప్రాతినిధ్యం వహిస్తున్న 43వ డివిజన్‌కు చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు పలువురు టీడీపీలో చేరారు. మంగళవారం సాయంత్రం నగరంలోని జండా వీధిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారందరికీ ఎన్డీఏ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ పార్టీ కండువాలు కప్పారు.

News April 17, 2024

అభ్యర్థుల ఖర్చులను పక్కాగా నమోదు చేయాలి:కలెక్టర్

image

నామినేష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభమైన రోజు నుంచే అభ్య‌ర్ధుల ఖాతాలో ఖ‌ర్చు లెక్కించేందుకు సిద్ధం కావాలని జిల్లా ఎన్నిక‌ల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అభ్య‌ర్థి నామినేష‌న్ వేసిన ద‌గ్గ‌ర‌నుంచీ అత‌ని ఖాతాలో పక్కాగా ఖ‌ర్చు న‌మోదు చేయాల‌న్నారు.

News April 17, 2024

విశాఖ: ఎన్నికల ఏర్పాట్లపై చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సమీక్ష

image

ఎన్నికల ఏర్పాట్లపై చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈ సమీక్షలో విశాఖ నుంచి కలెక్టర్ మల్లికార్జున, జాయింట్ కలెక్టర్ కే మయూరి అశోక్, డిఆర్ఓ మోహన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 18 నుంచి ప్రారంభమయ్యే నామినేషన్ల ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ మల్లికార్జున తెలిపారు.

News April 17, 2024

జియ్యమ్మవలసలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

image

చినమేరంగి, జియ్యమ్మవలస పోలీస్ స్టేషన్ పరిధిలో గల వివిధ పోలింగ్ కేంద్రాలను ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు. ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి ఎన్నికల ప్రవర్తన నియమావళి గూర్చి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమస్యాత్మక గ్రామాలలో ఎన్నికల ప్రశాంతంగా జరుగుటకు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల నిర్వహణపై సిబ్బందికి పలు సూచనలు అందించారు.

News April 17, 2024

KNL: క్లిష్టమైన పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్ ఏర్పాటు

image

సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్
సృజన రిటర్నింగ్, నోడల్ అధికారులను మంగళవారం ఆదేశించారు. క్లిష్టమైన, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. అనంతరం తాగునీరు, ఉపాధి హామీ పనులు, విద్యుత్ సరఫరా అంశాలపై సీఎస్ జవహర్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు.

News April 17, 2024

శ్రీసత్యసాయి: తాగునీరు, విద్యుత్ అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష

image

శ్రీ సత్యసాయి జిల్లాలో తాగునీరు, విద్యుత్ సరఫరా, జాతీయ ఉపాధి హామీ పథకం పనులు తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మంగళవారం సాయంత్రం సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ అరుణ్ బాబు, ఆర్డబ్ల్యుఎస్ ఎస్సి మల్లికార్జున, డ్వామా పీడీ విజయేంద్ర బాబు పాల్గొన్నారు.

News April 17, 2024

నార్పలలో 18న షర్మిల సభ.. చకచకా ఏర్పాట్లు 

image

నార్పల మండల కేంద్రంలో ఈనెల 18న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పర్యటించనున్నారు. సభ ఏర్పాట్లను సింగనమల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీమంత్రి శైలజనాథ్, డీసీసీ అధ్యక్షులు బండ్లపల్లి ప్రతాప్ రెడ్డితో కలిసి పరిశీలించారు. అక్కడ చేపట్టాల్సిన పనుల గురించి నాయకులతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆరు మండలాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని కోరారు.

News April 17, 2024

నామినేషన్ల ట్రయల్‌రన్‌ విజయవంతం

image

2024 సార్వత్రిక ఎన్నికలకు ఈనెల 18 నుండి నామినేషన్ల ఘట్టం ప్రారంభమవుతుండడంతో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌ నేతృత్వంలో నామినేషన్ల ట్రయల్‌రన్‌ విజయవంతంగా నిర్వహించారు. కలెక్టరు వారి చాంబర్‌లో మంగళవారం నామినేషన్ల స్వీకరణ ట్రయల్‌ రన్‌ చేపట్టారు. నామినేషన్‌ ప్రాసెస్‌ చేయడానికి తగిన సిబ్బందిని నియమించుకుని నామినేషన్‌ పరిశీలించారు.

News April 17, 2024

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: ఐజీ త్రిపాఠి

image

ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు నిర్వహించాలని గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం పోలీస్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ ప్రక్రియను ఎలక్షన్ కమిషన్ నిబంధన ప్రకారం అమలు చేయాలన్నారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎస్పీ తుషార్, ఏఎస్పీలు పాల్గొన్నారు.