Andhra Pradesh

News April 16, 2024

విశాఖ: ‘రాష్ట్ర ప్రజలు కోడి కత్తి రెండవ ఎపిసోడ్ చూస్తున్నారు’

image

రాష్ట్ర ప్రజలు కోడికత్తి రెండవ ఎపిసోడ్ చూస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు. విశాఖ నగర టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ రెడ్డిని ప్రజలు చీకొడుతుండడంతో ఏదో విధంగా సానుభూతితో ఓట్లు పొందాలని చూస్తున్నాడని విమర్శించారు. గులకరాయి డ్రామా జబర్దస్త్ కామెడీ షో లా ఉందన్నారు. జగన్ రెడ్డి పై విసిరిన రాయి ఇంతవరకు దొరకలేదన్నారు.

News April 16, 2024

సివిల్స్ మెరిసిన శాసనమండలి ఛైర్మన్ తనయుడు

image

శాసనమండలి ఛైర్మన్ కొయ్యె మోషేను రాజు తనయుడు చిట్టి రాజు ఈరోజు విడుదలైన 2024 సివిల్స్ ఫలితాల్లో 833వ ర్యాంక్ సాధించారు. సంతోషం వ్యక్తం చేసిన శాసనమండలి ఛైర్మన్ కుటుంబ సభ్యులు ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చిట్టి రాజును పట్టణంలోని పలువురు ప్రముఖులు అభినందించారు.

News April 16, 2024

జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ సేవలను పక్కాగా నిర్వహించాలి:కలెక్టర్

image

జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ సేవలను పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, కడప జిల్లా ఎన్నికల అధికారి వి.విజయ్ రామరాజు సిబ్బందికి సూచించారు. కలెక్టరేట్ లోని జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి వెళ్లే ప్రతి రిపోర్టును భద్రపరచాలని ఆదేశించారు. 

News April 16, 2024

శ్రీసత్యసాయి: ఆటో డ్రైవర్ మృతి

image

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆటో డ్రైవర్ సాకే జయప్ప(50) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. డి.చెర్లోపల్లి గ్రామానికి చెందిన సాకే జయప్ప ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం బత్తలపల్లి నుంచి స్వగ్రామానికి ఆటోలో వెళుతుండగా బత్తలపల్లి సమీపాన కుక్కను తప్పించబోయి ఆటో బోల్తాపడింది. ఆ ప్రమాదంలో గాయాపడిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

News April 16, 2024

ఒంటిమిట్ట: రేపు ధ్వజారోహణం, శేష వాహన సేవ

image

ఒంటిమిట్టలో శ్రీ కోదండరాముడి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. వేద పండితులు ఇవాళ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం ధ్వజారోహణం(మీథున లగ్నం) సాయంత్రం శేష వాహన సేవ జరుగుతుంది. 22న సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటలకు కల్యాణోత్సవం కన్నుల పండుగగా జరగనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలో శ్రీసీతారాముల కళ్యాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

News April 16, 2024

బాలనాగిరెడ్డి ఇసుకను పక్క రాష్ట్రాలకు అమ్ముతున్నారు: బాలకృష్ణ

image

మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఇసుకను పక్క రాష్ట్రాలకు అమ్మి కోట్లు సంపాదించారని బాలకృష్ణ విమర్శించారు. మంగళవారం కోసిగిలో స్వర్ణాంధ్ర సాకార యాత్రలో మాట్లాడారు. తుంగభద్ర నది నుంచి ఇసుక తవ్వి అభివృద్ధిని మరిచారని అన్నారు. అక్రమ మద్యం, కల్తీ సారాయి అమ్మి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలు ఆలోచించి TDP అభ్యర్థి రాఘవేంద్రని గెలిపించాలని కోరారు.

News April 16, 2024

శ్రీకాకుళం: ఈనెల 18 నుంచి నామినేషన్ల స్వీకరణ

image

ఈనెల 18వ తేదీ నుంచి సాధారణ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నిర్వహణకు రిటర్నింగ్ అధికారులందరూ సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. మంగళవారం BZA నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్చువల్‌గా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ల స్వీకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాల పై మీనా సమీక్షించారు.

News April 16, 2024

నామినేషన్స్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలి:కలెక్టర్

image

జిల్లాలో ఈనెల 18 నుంచి మొదలయ్యే నామినేషన్స్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం విజయవాడ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వీసీ నిర్వహించారు. కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, డీఆర్ఓ సత్యనారాయణరావు, వివిధ విభాగాల నోడల్ అధికారులు పాల్గొన్నారు.

News April 16, 2024

విజయనగరం రైల్వే స్టేషన్‌లో గంజాయి స్వాధీనం

image

ఎలక్షన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్క్‌లో భాగంగా మంగళవారం విజయనగరం రైల్వే స్టేషన్‌లో విశాఖ జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ కే.వెంకట్రావు నేతృత్వంలో జీఆర్పీ ఎస్ఐ రవివర్మ, సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ప్లాట్ ఫారం నెం-1లో గంజాయిని గుర్తించారు. మహారాష్ట్ర, ఒడిశాకు చెందిన ఇద్దరిని తనిఖీ చేసి.. వారి వద్ద నుంచి 33 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.

News April 16, 2024

శ్రీకాకుళం: విజయం మనదే: ఎంపీ

image

రానున్న ఎన్నికలలో జయం మనదేనని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడుతో యువనాయకుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. పలాస సభ ముగించుకుని మంగళవారం తిరుగుప్రయాణం అయిన చంద్రబాబు హెలికాప్టర్ ఎక్కిన సమయంలో రామ్మోహన్ నాయుడుతో మాట్లాడారు. కొన్ని నిమిషాల పాటు వారి మద్య మాటామంతి కొనసాగింది. చంద్రబాబు తిరుగుప్రయాణం అయినప్పుడు రామ్మోహన్ నాయుడు విక్టరీ సింబల్ చూపించి జయం మనదేనని ధీమాను వ్యక్తం చేశారు.