Andhra Pradesh

News April 16, 2024

సివిల్స్ ఫలితాల్లో శరత్ చంద్ర IAS అకాడమీ అభ్యర్థుల ప్రతిభ

image

సివిల్స్ ఫలితాల్లో శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్, విజయవాడ బ్రాంచీల అభ్యర్థులు సత్తాచాటారని డైరెక్టర్ శరత్ చంద్ర తెలిపారు. అనన్య రెడ్డికి ఆల్ ఇండియా 3వ ర్యాంకు, రుహానికి 5వ ర్యాంకుతో పాటు 16, 19, 42, 61, 91వ ర్యాంకులు వచ్చాయని చెప్పారు. దాదాపు 50కి పైగా IAS, IPS, ఐఆర్ఎస్ వంటి ర్యాంకులు తమ విద్యార్థులు సాధించారని ఆయన చెప్పారు. ఇందులో 19 ర్యాంకులు తెలుగు విద్యార్థులకు వచ్చాయన్నారు.

News April 16, 2024

చిత్తూరు: SPని ఆశ్రయించిన ప్రేమజంట

image

చిత్తూరు : ప్రేమ పెళ్లి చేసుకున్నాం రక్షణ కల్పించండని అని ఓ ప్రేమజంట జిల్లా ఎస్పీ మణికంఠను ఆశ్రయించారు. పెనుమూరు మండలం ఎగువ పూనేపల్లి గ్రామానికి చెందిన మౌలాలి కుమార్తె జాస్మిన్, తవణంపల్లి మండలం అరగొండ పంచాయతీ చారాల దళితవాడకు చెందిన మురుగేశ్ కుమారుడు తిరుమలేష్ మతాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. భర్త తిరుమలేశ్ ఎస్సీ కులస్తుడు కావడంతో మా తల్లిదండ్రులు అడ్డుపడ్డారని ఆమె వాపోయారు.

News April 16, 2024

అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు – జిల్లా ఎస్పీ

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ కె ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. తనిఖీల్లో భాగంగా తగిన రశీదులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న నవాబ్ పేట పరిధిలో 5 లక్షలు, అల్లూరు పరిధిలో 1,85,500, మనుబోలు పరిధిలో లక్ష, బుచ్చి పరిధిలో 3 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.

News April 16, 2024

శ్రీశైలంలో ఆగమ పాఠశాలలో ప్రవేశ పరీక్షలు

image

శ్రీశైలంలోని వీరశైవ ఆగమ పాఠశాలలో మంగళవారం వార్షిక పరీక్షలు నిర్వహించినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. మంగళవారం శ్రీశైలంలో ఆగమ పాఠశాల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఈవో మాట్లాడుతూ.. అర్చక ప్రవేశ, వర, ప్రవర కోర్సులకు సంబంధించి ఆగమ పరీక్షలు జరిగాయన్నారు. ఈ పరీక్షలకు మొత్తం 115మంది విద్యార్థులు హాజరైనట్లు చెప్పారు. రేపటితో పరీక్షలు ముగుస్తాయన్నారు.

News April 16, 2024

కర్నూలు కిమ్స్‌లో తొలిసారిగా స్కోరింగ్ బెలూన్ యాంజియోప్లాస్టీ

image

క‌ర్నూలు జిల్లాలోని కొండాపురం గ్రామానికి చెందిన స‌త్యనారాయ‌ణ రాజు దీర్ఘకాల కిడ్నీ వ్యాధితో బాధ‌ప‌డుతున్న వ్యక్తికి గుండెల్లో స‌మ‌స్య త‌లెత్తింది. ఈ కేసులో రిస్క్ ఎక్కువ ఉండ‌టంతో యాంజియోప్లాస్టీ చేసేందుకు కొంద‌రు వైద్యులు అంగీక‌రించ‌లేదు. క‌ర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో ఈ రోగికి విజ‌య‌వంతంగా స్కోరింగ్ బెలూన్ యాంజియోప్లాస్టీ చేశారని కార్డియాల‌జిస్టు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు.

News April 16, 2024

నందలూరు: సివిల్స్‌లో మెరిసిన కృష్ణ శ్రీవాత్సవ్ యాదవ్

image

నందలూరు మండలానికి చెందిన గొబ్బిళ్ళ కృష్ణ శ్రీవాత్సవ్ ప్రతిష్ఠాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షలో 444 ర్యాంక్ సాధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణ శ్రీవాత్సవ్ సోదరి విద్యాధరి కందుకూరు సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఒకే ఇంట్లో అక్క ఉద్యోగం, తమ్ముడు సివిల్స్‌లో మంచి ర్యాంక్ సాధించడం పట్ల గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.

News April 16, 2024

వేడి గాలులపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ 

image

శ్రీకాకుళం జిల్లాలో వేసవి వేడి గాలులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ సూచించారు. మంగళవారం ఆయన కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, మెడికల్ ఆఫీసర్లు, సూపర్‌వైజరీ సిబ్బందికి అవగాహన కల్పించారు. ఆరోగ్య సదుపాయాలను పెంచడంతోపాటు వేడిగాలుల ఎక్కువగా ఉన్న సమయంలో చేయకూడని పనులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు.

News April 16, 2024

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి: కలెక్టర్

image

సాధారణ ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేసేందుకు ముందుకు రావాలని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. సాధారణ ఎన్నికల కొరకు ప్రిసైడింగ్ అధికారులు, సహాయ అధికారులు పోస్టల్ బ్యాలెట్ కొరకు ఫారం-12 దరఖాస్తులు పూర్తి చేసి 24, 25 తేదీలలో రిటర్నింగ్ అధికారికి అందజేయాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.

News April 16, 2024

TPT: దూరవిద్య పీజీ ఫలితాలు విడుదల

image

తిరుపతి: శ్రీవేంకటేశ్వర దూరవిద్య(DDE) విభాగం పరిధిలో గత ఏడాది సెప్టెంబర్‌లో పీజీ (PG) ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంఏ పొలిటికల్ సైన్స్ & పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ద్వితీయ సంవత్సర పరీక్షలు జరిగాయి. ఫలితాలు మంగళవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in, www.schools9.com ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News April 16, 2024

అన్నమయ్య: 120 కేంద్రాల్లో స్లాష్ పరీక్షలు

image

అన్నమయ్య జిల్లాలో స్లాష్ 2024 పరీక్షలు 120 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని డీసీఈబీ సెక్రటరీ కె నాగమునిరెడ్డి తెలిపారు. వారు మాట్లాడుతూ.. జిల్లాకు కేటాయించిన అన్ని కేంద్రాలలో స్లాష్ పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని అన్నారు. ఏ కేంద్రానికి మినహాయింపు లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఈబీ సిబ్బంది పాల్గొన్నారు.